సర్కార్ చేతుల్లోనే ఇక జీడీపీ లెక్కలు !

అనేక అంశాల్లో ప్రభుత్వ  వైఫల్యాలను లెక్కలతో  సహా వివరించే ‘నేషనల్ శాంపిల్ సర్వే  ఆఫీస్ ’ ( NSSO)  నోరు నొక్కేయడానికి  కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందా ? ఇందులో భాగంగానే  స్వయం ప్రతిపత్తి గల నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ ను ‘ సెంట్రల్ స్టాటిస్టిక్స్  ఆఫీస్ ’ ( CSO) లో విలీనం చేయబోతున్నట్లు మే 23న కేంద్రం ప్రకటించింది అంటున్నారు.  రెండు సంస్థలను విలీనం చేసి ‘నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ’ ( NSO ) పేరుతో  కొత్త సంస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కొత్తగా ఏర్పడబోయే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, స్టాటిటిక్స్, ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ సెక్రెటరీ అజమాయిషీలో  పనిచేస్తుందని అధికారులు చెప్పారు. స్టాటిస్టికల్ సంస్థలకు సంబంధించి ప్రభుత్వం గతంలో ఒక ప్లాన్ ను రెడీ చేసింది. ఎన్ ఎస్ ఎస్ ఓ తో సహా అన్ని స్టాటిస్టికల్ సంస్థలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడమే ఈ ప్లాన్ ఉద్దేశం. కొత్తగా ఏర్పడే సంస్థ ప్రభుత్వానికి కాకుండా పార్లమెంటుకు జవాబుదారీగా ఉంటుందని మొదట అన్నారు. ఇప్పుడు పరిస్థితి మారింది. మొదట అనుకున్న   ప్లాన్ కు భిన్నంగా ‘నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ ’ ను ‘సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ’ లో విలీనం చేసి దానిని ప్రభుత్వం తన చేతుల్లోనే పెట్టుకోనున్నట్లు తాజాగా కేంద్రం ప్రకటించింది.

జీడీపీపై  NSSO రిపోర్ట్

గ్రాస్ డొమెస్టిక్   ప్రోడక్ట్ ( జీడీపీ ) ను లెక్కకట్టడానికి ప్రభుత్వం ఉపయోగించే  ‘రా డేటా’ పై  మే నెలలో నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్  ఒక రిపోర్ట్ బయటకు తీసుకువచ్చింది.ఈ రిపోర్ట్ ప్రభుత్వం ఉపయోగించిన  ‘ రా డేటా ’ పై విశ్వసనీయతపై  అనుమానాలు వచ్చాయి. ఎంసీఏ –21 లో శాంపిల్ కింద  సెలెక్ట్ చేసిన కంపెనీల అడ్రస్ తమకు ఎక్కడా దొరకడం లేదని  ఎన్ ఎస్ ఎస్ ఓ తెలిపింది. ఎంపీఏ –21 అనేది ప్రైవేటు కంపెనీలకు సంబంధించిన డేటా బేస్. ఈ సమాచారాన్ని  కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. ఎంసీఏ –21 కంపెనీల రెవెన్యూఆధారంగానే కేంద్ర ప్రభుత్వం జీడీపీ లెక్కలు కడుతుంది. ఎంసీఏ –21 అందించిన డేటా ఆధారంగా చూస్తే 2013–14 ఆర్థిక సంవత్సరంలో అనేక మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ల గ్రోత్ ఫిగర్స్ భారీగా కనిపించాయి. నిజానికి అంతకుముందు డేటా ప్రకారం మాన్యుఫ్యాక్చరింగ్ రంగం వెనుకంజలో ఉంది. దీంతో జీడీపీని లెక్కకట్టడానికి ఎంపీఏ –21 డేటా బేస్ ను పరిగణనలోకి తీసుకోవాలా, వద్దా అనే అంశం తెరమీదకు వచ్చింది.

ప్రభుత్వ వైఖరేంటి ?

ఎంసీఏ –21 డేటాబేస్ ను నిరభ్యంతరంగా పరిగణనలోకి తీసుకోవచ్చని  ‘మినిస్ట్రీ ఆఫ్ స్టాటిటిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ ’ (ఎంఓఎస్ పీ ఐ ) పేర్కొంది. ఎంసీఏ –21 డేటా బేస్ పై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. అంతేకాదు ఎన్ ఎస్ ఎస్ ఓ లెక్కల ప్రకారం ‘ అవుట్ ఆఫ్ కవరేజ్ ’ లో ఉన్న కొన్ని కంపెనీలు కచ్చితంగా  సర్వీసెస్ సెక్టార్ లోకి రాకపోయినప్పటికీ  దేశ ఆర్థిక వ్యవస్థ కు వాటి కంట్రిబ్యూషన్ ఉందని పేర్కొంది. ఎంసీఏ –21 లో ఉన్న కంపెనీల్లో కేవలం 16.4 శాతం మాత్రమే అడ్రస్ లేకుండా ఉండొచ్చని స్పష్టం చేసింది. ఈ సంస్థ అందించే డేటాపై  నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ వి అర్థం లేని భయాందోళనలను స్టాటిటిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ కొట్టి వేసింది. అయినప్పటికీ అనుమానాలు పూర్తిగా పోలేదు.

ఎంసీఏ – 21 అవసరమా ?

ఎంసీఎం –21 అవసరం పై రెండు వాదనలు వినిపిస్తున్నాయి. మొదటి వాదన ప్రకారం ఎంసీఏ –21 లో చాలా షెల్ కంపెనీలు ఉంటాయి. ఈ ప్రాక్సీ కంపెనీలు యాక్టివిటీస్ డేటాలో రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే ఇవి తప్పుడు లెక్కలు అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఇదిలా ఉంటే  షెల్ కంపెనీల యాక్టివిటీస్ ను డేటాలో తీసుకోవడం వల్ల తప్పులేదంటున్నది రెండో వాదన.

డేటాను ఏ మేరకు నమ్మవచ్చు?

ప్రభుత్వ వైఖరి ఎలా ఉన్నా అనేక షెల్ కంపెనీలకు సంబంధించిన ఫైనాన్షియల్ అక్కౌంట్ల పై ఎంసీఏ –21 సంస్థ అందిస్తున్న డేటా కు విశ్వసనీయత లేదన్నది నిపుణుల వాదన. దీంతో ఈ డేటా ఆధారంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన లెక్కలను ఫిక్స్ చేయడం కరెక్ట్ కాదంటున్నారు. దేశ ఆర్థిక పరిస్థితిని తెలియచేసే అంచనాల్లో తేడాలు వచ్చి నట్లు డౌట్ వస్తే వాటిని క్లియర్ చేయడానికి ‘ రా డేటా ’ సేకరించడానికి వీలుగా ప్రభుత్వ స్టాటిషియన్స్ గతంలో చిన్న చిన్న సర్వేలు చేయించేవారు. ఈ సర్వేల్లో వచ్చిన సమాచారం ఆధారంగా డేటా పై ఒక అభిప్రాయానికి వచ్చేవారు.

అయితే 2015లో ఈ పద్ధతికి ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టింది. జీడీపీ ఫిగర్స్ ను లెక్కకట్టడానికి ఎంసీఏ –21డేటా బేస్ ను పరిగణనలోకి తీసుకుంటూ ఓ కొత్త జీడీపీ సిరీస్ ను కేంద్ర ప్రభుత్వం మొదలెట్టింది. ఇందుకు సంబంధించి2011–12 ఆర్థిక సంవత్సరాన్ని బేస్ ఇయర్ గా తీసుకోవడం ప్రారంభించింది. దీంతో కనీసం ఆర్గనైజ్డ్  సెక్టార్ ఎకానమీ గురించి పరిగణనలోకి తీసుకునే డేటానైనా ఎంతవరకు నమ్మవచ్చు అనే ప్రశ్న తెర మీదకు వచ్చింది. అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్ కు సంబంధించి న డేటాలో అన్ని తప్పుల తడకలే అన్నారు ఫైనాన్షియల్ ఎక్స్ పర్స్ట్ . ప్రభుత్వానికి సంబంధించిన విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్రంలోని ఉన్నతాధికారులు అధికారిక జీడీపీ లెక్కలపైనే ఆధారపడతారన్నవిషయం ఇక్కడ ప్రస్తావిం చక తప్పదు.

ఎకానమీకి సంబంధించిన ఫిగర్స్ ను ఫైనలైజ్ చేయడానికి సర్వేల్లో వచ్చే శాంపిల్ డేటా పైనే సహజంగా స్టాటిస్టియన్స్ ఆధారపడుతుంటారు. అయితే దీనిపై కూడా ఎకనమిక్ ఎక్స్ పర్స్ట్ కుకొన్ని అభ్యంతరాలున్న మాట వాస్తవం. అయితే జీడీపీ నెంబర్లను ఫిక్స్ చేయడంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందన్న ఆరోపణలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అసలు జీడీపీ లెక్కలు కట్టే విధానాల్లోనే లోపాలు ఉన్నాయన్నది ఫైనాన్షియ ల్ ఎక్స్ పర్స్ట్ ఆరోపణ. డేటా బేస్ ను పరిగణనలోకి తీసుకోవడానికి సంబంధించికొన్ని అంశాలపై విభేదించి నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ లోని ఇద్దరు ప్రభుత్వేతర సభ్యులుఈ ఏడాది జనవరిలో రాజీనామాలు చేశారు.నేషనల్ శాం పిల్ సర్వే ఆఫీస్ రిపోర్ట్ ఆధారంగాదేశంలో ఉద్యోగాలకు సంబంధించిన డేటాను విడుదల చేయాల్సిం దిగా ఈ ఇద్దరు పట్టుబడితే,కేం ద్ర ప్రభుత్వం అందుకు అంగీకరించలేదన్నది ఎకనమిక్ సర్కి ల్స్ సమాచారం. దేశంలో నిరుద్యోగ శాతం ప్రస్తుతం 6.1 శాతానికి చేరిందని ఎన్ ఎస్ ఎస్ ఓ పేర్కొంది. ఎకానమీకి సంబంధించి న డేటా మదింపు చేయడంలో జరిగే లోపాలపై గతంలో విమర్శలు వచ్చేవి. తాజాగా రాజకీయ జోక్యం పెరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి.

2015 లో జీడీపీ బేస్ ఇయర్ సవరణ

మోడీ సర్కార్ 2015 లో జీడీపీ బేస్ ఇయర్ ను సవరించింది. పాత రోజుల్లో 2004–05ఆధారంగా జీడీపీ కాలిక్యులేషన్స్ ఉండేవి.అయితే కేంద్రం జీడీపీ బేస్ ఇయర్ ను2011–12 కు మార్చింది. ఎన్డీయే ప్రభుత్వంమార్చి న బేస్ ఇయర్ ప్రకారం చూస్తే యూపీఏ ప్రభుత్వ హయాంలో వృద్ది రేటు చాలా తక్కువగా ఉంది.