పెద్దపల్లిలో భగీరథకు ఏమైంది?

  •     2023లో గ్రిడ్ ‌‌ కు కనెక్షన్ ‌‌ ఇచ్చినా.. ట్రయల్​ రన్ దగ్గరే ఆగింది
  •     లీకేజీలతో సప్లైలో ముందుకు పడట్లే 
  •     వేసవి నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో మున్సిపాలిటీ 

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లిలో మిషన్​ భగీరథ ముందుకు పడట్లే..  2023లో పనులు పూర్తిచేసి గ్రిడ్ ‌‌కు అనుసంధానించిన ట్రయల్ ‌‌ రన్ ‌‌ వద్దే ఆగిపోతోంది. ఓ వైపు టెస్టింగ్ ‌‌లు చేస్తుండగా మరోవైపు లీకేజీలు ఏర్పడుతున్నాయి. దీంతో వాటర్​ సప్లైకి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. సమ్మర్​ వస్తుండడంతో ఈసారి కూడా నీటి కష్టాలు తప్పవని పట్టణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. 

2023లోనే మెయిన్ ‌‌ గ్రిడ్ ‌‌కు​ కనెక్షన్​

మిషన్ భగీరథ కింద పెద్దపల్లి పట్టణానికి నాటి ప్రభుత్వం రూ.34 కోట్లు కేటాయించింది. టౌన్ లో 118 కిలోమీటర్ల పైప్ లైన్, 1200 కేఎల్ , 2100 కేఎల్ కెపాసిటీతో రెండు ట్యాంకుల నిర్మాణం 2016లో ప్రారంభించి 2023లో పూర్తి చేశారు. మెయిన్​ గ్రిడ్​కు లైన్​ కనెక్షన్​ ఇచ్చి ట్రయల్​రన్​ చేశారు. ఆ టైంలో ఎక్కడికక్కడ లీకేజీల ఏర్పడడంతో రిపేర్లు చేశారు. అప్పటినుంచి ఇప్పటిదాకా టెస్టింగ్ ‌‌లు చేయడం లీకేజీలు ఏర్పడితే రిపేర్లు చేయడంతోనే సరిపోతోంది. మరోపైపు పైపుల్లో నాణ్యత లేదనే ఆరోపణలు ఉన్నాయి. కాగా పనులు పూర్తిస్థాయిలో ఎప్పుడు పూర్తవుతాయో, సప్లై ఎప్పుడు ప్రారంభిస్తారో ఆఫీసర్లు క్లారిటీ ఇవ్వడం లేదు.  సమ్మర్​ సమీపిస్తుండటంతో ఈ సారైనా  కొత్త సర్కార్​ పెద్దపల్లి జనాలకు మంచినీటి కరువును తీరుస్తారో లేదో అని ఆందోళన చెందుతున్నారు.

వర్గ పోరుతోనే...

పెద్దపల్లి టౌన్ లో నిర్మించతలపెట్టిన రెండు ట్యాంకులను 2016లో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని  ప్రభుత్వ జూనియర్ కాలేజీ క్యాంపస్ లో కట్టాలని నిర్ణయించారు. దానికోసం మెయిన్ పైప్ లైన్ జూనియర్​ కాలేజీ వరకు వేశారు.  కాగా నాటి నాయకుల మధ్య సయోధ్య లేకపోవడం వల్లే జూనియర్​ కాలేజీలో ఏర్పాటు చేయవలసిన ట్యాంకులు, వ్యవసాయ మార్కెట్​కు తరలిపోయాయి.  దీంతో ట్యాంకుల నిర్మాణ పనులు లేటయ్యాయి. 

ఇక పైప్ లైన్ కోసం రోడ్ల వెంబడి తవ్వకాలు చేపడితే తమకు నష్టమని ఇళ్ల ఓనర్లు కోర్టుకెళ్లారు. తీర్పు రావడం లేటడవంతో పనులు ఆగిపోయాయి. అనంతరం మున్సిపల్​, భగీరథ  అధికారులు దిగివచ్చి  రోడ్డు మధ్యలో తవ్వకాలు జరిపి పైప్ లైన్ వేశారు. ఇటీవల ఇంట్రో పైప్​లైన్​ పనులు కూడా పూర్తిచేసి టెస్టింగులు స్టార్ట్​ చేశారు. ఆరు నెలల నుంచి మొదలైన టెస్టింగులు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఒకవైపు టెస్టింగులు, మరోవైపు లీకేజీలు కొనసాగుతూనే ఉన్నాయి.  పనులు, టెస్టింగ్​ పూర్తి చేసి తమకు వాటర్​ సప్లై సిస్టంను సరెండర్​ చేయాల్సి ఉండగా భగీరథ మేనేజ్ ‌‌మెంట్​ఇప్పటివరకు అవేమీ పట్టించుకోవడం లేదని మున్సిపల్​ అధికారులు చెప్తున్నారు. 

వాటర్ సప్లయ్ లో మున్సిపాలిటీ ఫెయిల్

 భగీరథ నీళ్లు రాకపోవడం, ప్రస్తుతం సరఫరా చేస్తున్న నీళ్లు సరిపోకపోవడంతో టౌన్ లో జనవరి నుంచే మంచి నీటికి  జనాలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు తాగడానికి రెండు రోజులకొకసారి ట్యాప్ ల ద్వారా మున్సిపాలిటీ నీటిని వదులుతున్నారు. గత , ప్రస్తుత పాలకవర్గాలు తాగునీటి సప్లైని ఏనాడూ పట్టించుకోలేదు. పట్టణంలోని ఓవర్ హెడ్ ట్యాంకులు పాత పడిపోయి రిపేర్​ అవుతున్నాయి. వాటిని బాగు చేయడానికి నెలలు పడుతుంది. 

అలాగే పెద్దపల్లి పట్టణంలో వేసిన భగీరథ ఇంట్రో లీకేజీ కావడంతో వాటర్​ సప్లయ్​ నిలిచిపోతోంది. భగీరథ నీటి సరఫరాపై అధికారులు దృష్టి సారించి శాశ్వత పరిష్కారం చూపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. మరోవైపు పెద్దపల్లి మున్సిపల్ అధికారులు సమ్మర్ ‌‌ ‌‌లో పట్టణ ప్రజలకు నీటి కొరత లేకుండా చేయడానికి వాటర్ ట్యాంకర్లు కొనుగోలుకు సిద్ధమైనట్లు చెప్తున్నారు. బావుల నుంచి నీటిని తోడటానికి మోటార్లు కూడా కొనుగోలు చేయనున్నట్లు తెలిసింది. ఇటీవల పెద్దపల్లి మున్సిపల్​ కమిషనర్​ వెంకటేశ్​ మున్సిపాలిటీ పరిధిలోని వ్యవసాయ బావులను 
పరిశీలించారు

సమ్మర్​లో మంచినీటి సమస్య లేకుండా చూస్తాం

సమ్మర్​లో  పట్టణ ప్రజలకు మంచినీటి కొరత లేకుండా చేస్తాం. ఇంకా భగీరథ పనులు పూర్తి కాలేదు. నీటి సమస్య తీర్చడానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నాం. ట్యాంకర్లు కొనుగోలు చేస్తున్నాం. భగీరథ మేనేజ్​మెంటు కూడా మరో 15 రోజుల్లో పనులు పూర్తి చేసి హ్యాండోవర్​ చేస్తామంటున్నారు.
-  వెంకటేశ్​, మున్సిపల్​ కమిషనర్​, పెద్దపల్లి