నారాయణ కాలేజీల్లో స్టూడెంట్స్ వరస ఆత్మహత్యలపై తెలంగాణ మహిళా కమిషన్ చాలా సీరియస్ అయ్యింది. ఒకటి కాదు రెండు కాదు.. ప్రతి క్యాంపస్ లోనూ.. వరసగా పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవటం ఏంటని ప్రశ్నించింది. నారాయణ కాలేజీల్లో స్టూడెంట్స్ ఆత్మహత్యలపై.. నారాయణ కాలేజీ యాజమాన్యానికి నోటీసులు పంపించింది తెలంగాణ మహిళా కమిషన్.
ఆత్మహత్యలపై మహిళా కమీషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల హైదరాబాద్ బాచుపల్లి నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న అనూష(16) అనే విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.ఆ ఘటన మరువకముందే మాదాపూర్ నారాయణలో శివకుమార్ రెడ్డి ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
కేవలం నెలన్నర సమయంలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంపై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారో వివరణ ఇవ్వాలని తెలంగాణ మహిళా కమిషన్ నారాయణకాలేజీల మేనేజ్ మెంట్ కు నోటీసులు ఇచ్చింది.