Vastu Tips: రోడ్డు కంటే ఇల్లు ఎత్తులో లేకపోతే ఏమవుతుంది..

Vastu Tips:  రోడ్డు కంటే ఇల్లు ఎత్తులో లేకపోతే ఏమవుతుంది..


 


ఎప్పుడో కట్టిన ఇంటి ఎదురుగా ఉన్న రోడ్డు పెంచితే ఇబ్బందులు వస్తాయా.. ఇప్పుడు ఇల్లు ఎత్తు పెంచుకోవాలా.. అలా ఉంటే వాస్తు పరంగా ఏమైనా ఇబ్బందులున్నాయా.. వాస్తు కన్సల్టెంట్​ కాశీనాథుని శ్రీనివాస్​ ఏమంటున్నారో చూద్దాం. . .

ప్రశ్న: ముప్పై ఏళ్ల క్రితం  ఇంటిని వాస్తు ప్రకారమే కట్టుకున్నాం. మొదట ఇరవై ఏళ్ల వరకు బాగానే ఉన్నాం. కానీ గత పదేళ్లుగా ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఆరోగ్యం బాగోలేకపోవడం, ఉద్యోగాలు దొరక్కపోవడం, మా కోడలికి అబార్షన్లు అవ్వడం వంటివి జరుగుతున్నాయి.. ఇటీవల మాకు తెలిసిన పెద్దాయనతో మా సమస్యలు చెప్తుంటే... "మీ ఇల్లు రోడ్డు కంటే కిందికి ఉంది. అందుకే ఈ సమస్యలు వస్తున్నాయి' అన్నాడు. మేం కట్టుకునేటప్పుడు పైకే ఉంది. కాకపోతే కొత్త రోడ్డు వేసినప్పుడలా ఎత్తు పెరుగుతోంది. దాంతో మా ఇల్లు కిందకు అవుతోంది. మా సమస్యలకు అదే కారణమా? అదే అయితే ఇప్పుడు ఏంచేస్తే మంచిదో చెప్పండి. అలాగే తూర్పు రోడ్డుకు ఉన్న ఇల్లేనా? లేక ఏ ఇల్లు అయినా రోడ్డు కంటే ఎత్తు ఉండొద్దా?. 

జవాబు: ఇల్లు ఏ వైపున్నా ఉన్నా, రోడ్డు కంటే ఇల్లు ఎత్తు ఎప్పుడూ మూడు ఫీట్లైనా ఎక్కువగా ఉండాలి. అలా ఉన్నప్పుడే.. వర్షం పడినప్పుడు నీళ్లు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. అలాగే కొందరు రోడ్డుకు సమానంగా కడుతుంటారు. అది ప్రస్తుతానికి మంచిదే కానీ, ఏళ్లు గడుస్తున్న కొద్దీ రోడ్డు ఎత్తు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి కట్టేటప్పుడు ఇంటిని ఎత్తులో కట్టుకోవాలి. అయితే తూర్పుకు ఉన్న ఇల్లు ఎత్తు... రోడ్డు కంటే తగ్గితే వాస్తు దుష్ప్రభావాలు కచ్చితంగా ఉంటాయి. ప్రస్తుతం మీరు ఉంటున్న ఇంటి ఎత్తును కొద్దిగా పెంచితే సమస్యలు తీరతాయి.