Health tips: పులియ బెట్టిన ఆహారం తింటే ఆరోగ్యానికి మంచిదేనా.. డైటీషియన్లు ఏం చెబుతున్నారంటే..

Health tips: పులియ బెట్టిన ఆహారం తింటే ఆరోగ్యానికి మంచిదేనా.. డైటీషియన్లు ఏం చెబుతున్నారంటే..

చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా ఇడ్లీ తింటుంటారు. సామాన్యులనుంచి సెలబ్రిటీల వరకు ఇడ్లీలను ఇష్టంగా తింటారు. కొందరైతే ఎన్ని రోజులు పెట్టినా.. ఇడ్లీలు వద్దనుకుంటా ఆరగిస్తుంటారు. దీని వల్ల మేం ఆరోగ్యంగా ఉన్నాం..పొట్టలో ఎలాంటి ఇబ్బందీ లేకుండా రోజంతా హ్యాపీగా గడిచిపోతుందని చెప్పడం తరుచుగా వింటుంటాం..ఇడ్లీలు ప్రేగులకు ఆరోగ్యాన్ని అందించే ఫుడ్ మాత్రమే కాదు..రోగనిరోధక వ్యవస్థకు సపోర్టు చేస్తుంది..దీనికి కారణం.. ఇడ్లీలు రాత్రంతా పులియబెట్టిన పిండితో తయారు చేయడమే.. 

పులియబెట్టిన పదార్థాలతో తయారు చేసిన అల్పాహారం వల్ల ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఎన్నో ఉన్నాయని డైటీషియన్లు చెబుతున్నారు. కనీసం రెండు వారాల పాటు రోజు బ్రేక్ ఫాస్ట్ పులియబెట్టిన ఆహారం తింటే కలిగి ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయంటున్నారు. 

పులియబెట్టిన ఆహారం జీర్ణక్రియను మెరుగుపర్చడం, పోషకాల శోషణను పెంచడం, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందంటున్నారు డైటీషియన్లు. పులియ బెట్టిన ఆహారంలో ప్రోబయోటిక్స్ ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం అల్పాహారం క్రమంగా 2 వారాల పాటు తీసుకుంటే కడుపులో మంటను కూడా తగ్గిస్తుందంటున్నారు. గట్,-మెదడు కనెక్షన్ ద్వారా మానసిక ఆరోగ్యానికి తోడ్పడుదంటున్నారు. 

ఆరోగ్య ప్రయోజనాలు

పులియబెట్టిన ఆహారాలు జీర్ణక్రియ, పోషకాల శోషణలో కీలక పాత్ర పోషిస్తున్న గట్ మైక్రోబయోటా వైవిధ్యాన్ని పెంచడమే కాకుండా, క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ప్రేగు కదలికలు, ఉబ్బరం తగ్గడం, రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుందని అంటున్నారు. 

పులియబెట్టిన ఆహారం శోథ నిరోధక లక్షణాలు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అయితే గట్,-మెదడు కనెక్షన్‌పై వాటి ప్రభావం కారణంగా మానసిక స్థితి,మానసిక శ్రేయస్సును సానుకూలంగా ప్రభావితం చేస్తుందంటున్నారు. 

ఆరోగ్య ప్రమాదాలు ఉన్నాయా?

పులియబెట్టిన ఆహారాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందజేస్తుండగా వాటిని ఇష్టంగా తీసుకోకపోతే కొన్ని ప్రమాదాలు ఎదురవుతాయని డైటీషియన్లు చెబుతున్నారు. మిసో ,సౌర్‌క్రాట్ వంటి అనేక పులియబెట్టిన ఆహారాలలో సోడియం ఎక్కువగా ఉంటుంది. 

ఇవి అధికంగా తీసుకుంటే రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రోబయోటిక్స్‌తో పడని వారికి పేగు ఉబ్బరం లేదా గ్యాస్‌తో సహా జీర్ణ సంబంధ సమస్యలు కలగవచ్చు. 

ముఖ్యంగా పెరుగు వంటి పాలతో చేసిన ఆహారంలో ఇరిటేషన్ కలిగిస్తాయంటున్నారు. కిణ్వప్రక్రియ సరిగ్గా లేని పులియ బెట్టిన ఆహారం ఆనారోగ్యానికి దారి తీస్తుందంటున్నారు. ఇంట్లో తయారు చేసిన పులియబెట్టిన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు డైటీషియన్లు.