పుష్ప 2 ప్రీమియర్ (డిసెంబర్ 4న) సంధ్య థియేటర్లో జరిగిన ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘనటను సీరియస్గా తీసుకున్న తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం బెనిఫిట్ షోలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో టాలీవుడ్ నుంచి రాబోయే భారీ ప్రాజెక్ట్ సినిమాలపై పెద్ద దెబ్బ పడిందనే చెప్పాలి.
ఇప్పడు రానున్న 2025 సంక్రాంతికి లిస్టులో రిలీజ్కు బడా సినిమాలే ఉన్నాయి. అందులో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం, బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలు ఉన్నాయి.
అయితే, ఈ మూడు సినిమాలతో నిర్మాత దిల్ రాజుకు (Dil Raju) సంబంధం ఉంది. ఇందులో రెండు సినిమాలు ఆయన ప్రొడక్షన్ నుంచి నిర్మించినివి ఐతే, మరొకటి ఆయన డిస్ట్రిబ్యూషన్లో రిలీజ్ కాబోతున్న సినిమా కావడం.
ప్రస్తుతం బెనిఫిట్ షోల రద్దు నిర్ణయం మొదట నిర్మాత దిల్ రాజ్కి పెద్ద ఎఫెక్ట్ పడనుంది. ఎందుకనగా.. ఈ రోజుల్లో ప్రీమియర్ అండ్ బెనిఫిట్ షోలు సినిమా నిర్మాతలకి పెద్ద కలిసొచ్చే అంశం. అంతేకాదు ఈ బెనిఫిట్ షోలతో మంచి లాభాలు గడిస్తున్నారు నిర్మాతలు. ఇకపై వాటిని రద్దు చేస్తున్నట్లు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. దీంతో తెలుగు నిర్మాతలకు భారీ నష్టాలే కలిస్తాయని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇపుడు రానున్న సంక్రాంతికి పండుగకు మూడు సినిమాలు దిల్ రాజు కి సంబంధించినవి.
ఇక ఇలాంటి సమయంలో నిర్మాత దిల్ రాజ్ ఏం చేయబోతున్నాడనేది కీలకంగా మారింది. ఓ వైపు తెలంగాణా బెనిఫిట్ షోల రద్దు నిర్ణయం, మరో వైపు తన సినిమాలు. దీంతో ప్రొడ్యూసర్ కం నైజాం డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు.. తన రాజకీయ పరిచయాలతో పర్మిషన్ తెచ్చుకుంటాడా? లేదా గవర్నమెంట్ నిర్ణయాన్నిస్వాగతీస్తాడా? అనేది సస్పెన్స్గా మారింది. ఏమవుతుందో చూడాలి!
ఇకపోతే తాజాగా తెలంగాణ ప్రభుత్వం నిర్మాత దిల్ రాజును తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి 2024, డిసెంబర్ 3వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూటర్‌గా సినీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చిన దిల్ రాజు అంచెలుఅంచెలుగా ఎదిగా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్గా నిలదొక్కున్నారు.