భార్యలు ఏం చేశారు.. బీసీసీఐ నిబంధనలపై హర్భజన్ సింగ్ ఫైర్

న్యూజీలాండ్, ఆస్ట్రేలియా సీరీస్ లలో భారత్ ఓటమిపై ఇండియాలో ఇంకా చర్చలు నడుస్తూనే ఉన్నాయి. మనోళ్లు సరిగా ప్రాక్టీస్ చేయరు.. అందుకే ఆడలేక పోతున్నారు అని కొందరు అంటుంటే.. వయసు ప్రభావంతో సీనియర్లు ఆడలేకపోతున్నారని కొందరు విమర్శిస్తుంటారు. మరి జూనియర్లకేమైంది.. వాళ్లైనా ఆడొచ్చు కదా అనే వారూ ఉన్నారు. కొందరు ప్రతి టూర్ కు ఫ్యామిలీతో వెళ్లడం వల్లనే కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు అని కూడా అంటుంటారు. ఇలా ఎవరికి తోచింది వాళ్లు కామెంట్స్ చేస్తూ టీమిండియా వైఫల్యాలపై విమర్శలు చేస్తూనే ఉంటారు.

 టీమిండియా పర్ఫార్మెన్స్ అంశాన్ని బీసీసీఐ కూడా సీరియస్ గా తీసుకుంది. అందుకోసం పది నిబంధనలను అంతర్గతంగా టీమ్ కు జారీ చేసినట్లు సమాచారం. అయితే అందులో భవిష్యత్తులో ప్లేయర్లు విదేశీ టూర్లకు వెళ్లినపుడు ఫ్యామిలీని తీసుకురాకూడదు లేదంటే తక్కువ సమయం కేటాయించాలనే నిబంధన ఉందని అంటున్నారు. 

Also Read : గేల్ ఆల్‌టైం రికార్డ్‌పై వెస్టిండీస్ ఆటగాడు గురి

అంతర్గత నిబంధనలలో భార్యలకు దూరంగా ఉండాలి లేదా తక్కువ సమయం కేటాయించాలనే నిబంధన ఉంది అన్న అంశంపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఫైర్ అయ్యారు. ‘‘మధ్యలో భార్యలు ఏం చేశారు.. మన పర్ఫార్మెన్స్ బాలేకుంటే భార్యలను నిందించడం దేనికి’’ అని ప్రశ్నించాడు. 

‘‘ఆసీస్ పై 3-1 తేడాతో ఓటమి తర్వాత బీసీసీఐ కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని అనుకుంటాం. కానీ అనవసర విషయాలపై కాకుండా.. ఫీల్డ్ లో మనోళ్ల పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలో కాన్సన్ట్రేట్ చేయాలి’’ అని హర్భజన్ అన్నారు. 

‘‘ఆస్ట్రేలియా సీరీస్ ఓడిపోయాం.. ఓకే.. కానీ అసలు ఓటమే లేకుంటే గెలుపును ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం.. న్యూజీలాండ్ తో ఓడిపోయాం.. అది కూడా ఓకే.. రెండు టీమ్స్ ఆడినపుడు ఒకరు గెలుస్తారు.. ఒకరు ఓడుతారు. దానికి ఫ్యామిలీని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ప్రస్తుతం టీమ్ సెటిల్మెంట్ మోడ్ లో ఉంది. కొన్ని రోజులైతే అన్నీ సర్దు కుంటాయి’’ అని భజ్జీ తెలిపాడు.