మనిషి ఎదుగుదలకు ఇది ఎంతో అనర్దాయకం.. అహం అంటే ఏమిటి.. పురాణాలు ఏం చెబుతున్నాయి..

ప్రతి మానవుడు ఎప్పుడో ఒకప్పుడు అహం ప్రదర్శిస్తుంటాడు.  ప్రతి వ్యక్తి నేను.. నాది.. ఇలా నిత్యం అనేక పర్యాయములు సంబోధిస్తుంటాడు.  అసలు నేను అంటే ఎవరు.. నేను అనే జీవితానికి అర్దం ఉందా.. నేను అనే పదానికి అర్దం ఏమిటి.. వేదాలు ఏం చెబుతున్నాయి..  పురాణకాలం నాటి రాముడి ( త్రేతా యుగం)  నుంచి కలియుగంలో ఇప్పడు  ఎంతో అభివృద్ది  టెక్నాలజీలో కూడా  ఒక మనిషిని అర్దం చేసుకోవాలంటే  .. వారి లోపల ఉండే నేను అనే అహంలాంటి మనిషి గురించి అర్దం చేసుకోవాలి.  

ప్రతి మనిషిలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకరు మామూలుగా పైకి కనిపించేవాళ్లు. రెండోవారు  బయటకు కనిపించకుండా లోపల వాళ్లకు మాత్రమే తెలిసిన వాళ్లు . రెండో వ్యక్తినే నేను అని అంటారు,  నేను అంటు అహం .. అహంభావం..అహంకారంతో  నేను అది చేశాను.. ఇది చేశాను అంటూ గొప్పలు చెప్పుకుంటారు.  అయితు వేరే వారి  గురించి చెప్పేటప్పుడు 'వాడు చాలా   లోతు మనిషిరా' అంటారు పెద్దోళ్లు. కానీ ప్రతి ఒక్కరికీ బయట ప్రవర్తన గురించే కాదు. లోపల ఎలా ఉంటారో కూడా కచ్చితంగా తెలియాలి. 

మనిషిలో ఉండే నేను అనే రెండో వ్యక్తిని ఆంగ్లంలో అహాన్ని  ఊఏక్ష అంటారు . ఊ అంటే ఎడ్జిం గ్‌, ఏ అంటే గాడ్‌, క్ష అంటే అవుట్‌. మొత్తంగా ఊఏక్ష ఉంటే… ఎడ్జింగ్‌ గాడ్‌ అవుట్‌. అంతరంగంలో అంత: స్వరూపునిగా ఉన్న భగవంతుడ్ని, నీకు తెలియకుండానే బయటకు పంపివేస్తుంది అహంకారం. అహంకారం అంతటి ప్రమాదకరమైంది. అహంకారులు అహంభావులు ఎందరో యీ అహంకారం వల్లే నామ రూపాల్లేకుండా మసైపోయారు. రావణాసురుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, దుర్యోధనుడు యిలా యో ధానుయోధులు ఎందరో  నేను అనే  అహం కారణంగానే ఎందుకూ కొరగాని వాళ్ళైపోయారు. మహామహులు వరాలు పొందామని కొందరు. ... తపస్సులు చేసి భగవదనుగ్రహం పొందామని కొందరు. ...నేను అనే అహంకారంతో   అపారమైన బలం, అనంతమైన బలగం ఉన్నాయని కొందరు... యీ అహం కారణంగానే ఎందుకూ కొరవడక కొరగాని వాళ్ళయ్యారు. అస్తిత్వం కోల్పోయారు.

నేను చేయగలను” ”నేనూ చేయగలను.” అనంటే అది ఆత్మ విశ్వాసం అవుతుంది. ఆత్మ విశ్వాసం విజయాని కి ఎంతో అవసరం కూడా. ”నేనే చేయగలను.” అనంటే అది అహంకారం. అలాగే ”నాకే అన్నీ తెలుసు. నేనే మేధావిని” అను కుంటే అదీ అహంకారమే. అది మనల్ని అథ:పాతాళానికి తో స్తుంది. చరిత్రహనులుగా మారుస్తుంది. భౌతికంగానే కాదు ఆ ధ్యాత్మికంగాను అహం అనేది మానవుని ప్రగతికి, పురో గతికి, అభివృద్ధికి అడ్డుకట్ట అవుతుంది. పెద్ద అవరోధంగా మారుతుంది. మొత్తంగా చూసుకుంటే నేను అంటే అహంకారభావాన్ని తెలియ పరుస్తుంది.

ఎవరికి వాళ్లు తెలుసుకోవాల్సిందే..

ఒకరోజు శ్రీరాముడు మంచి నిద్రలో ఉన్నాడు. హఠాత్తుగా మెలకువ వచ్చింది. మనసును ఓ ప్రశ్న వేధించడం మొదలు పెట్టింది. ఆలోచనను పక్కన పెట్టి నిద్రపోదాం అనుకుంటే ఆ ప్రశ్న నిద్రపట్టకుండా చేస్తోంది. ఇక లాభం లేదనుకొని ఆ రాత్రే గురువైన వశిష్టుని ఆశ్రమానికి వెళ్లి తలుపు తట్టాడు.. ఇంత రాత్రి వేళ తన కుటీరానికి వచ్చింది ఎవరా?' అని వశిష్టుడు తలుపు తీయకుండానే ఎవరు?'' అని అడిగాడు. అప్పుడు  రాముడు మామూలుగా 'నేను' అని సమాధానం ఇచ్చాడు.  నువ్వంటే ఎవరు?' అని అడిగాడు వశిష్ఠుడు మళ్లీ.  .. ఆ అనుమానం వచ్చే ఈ రాత్రివేళ మీ తలుపు తట్టాను గురువుగారూ ...  అని చెప్పాడు రాముడు. తలుపు తీసి రాముడ్ని లోపలకు పిలిచాడు.  కొన్ని  వాస్తవాలు తెలిపాడు. 

నేను అనే అహంకారాన్ని వదిలేసి...  నిరంహకారంతో, అణకువ, వినమ్రత, వినయం కలిగి ఉంటే మామూలు వ్యక్తులు కూడా మహాత్ములు అవుతారనేది జగద్విదితమే. అహం ఉంటే మనుషులే కాదు ఆకులు అలములు యితరత్రా వస్తువులు కూడా గౌరవం కోల్పోతాయి. స్థాయినీ, స్థానాన్ని కోల్పోయి నిరాదరణకు గురౌ వుతాయని వశిష్ఠులవారు.. శ్రీరామచంద్రులకు ఇలా వివరించాడు.

ఓసారి ఆకులన్నీ సభ పెట్టుకున్నాయి. ముందుగా మామిడాకు తలెగరేస్తూ మాట్లాడింది. నేను అనే అహంకారంతో  ప్రతి శుభానికి, శుభకార్యానికీ ఎంతో అవసరం. పెళ్ళైనా, పవి త్రమైన దైవ కార్యక్రమమైనా జరుగుతుంటే, శుభానికి ప్రతీకగా మామిడాకులనే ఎంచుకుంటారు. ఉత్కృష్టమైన మహోన్నత ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నిటికీ నేనే అవసరమని అహంకారంతో చెప్పింది. ఆఖరుకి దేవుడి విగ్రహాలను, పటాలను కూడా నేను లేకుండా పెట్టరు. భగవంతుడ్ని కూర్చోబెట్టాలంటే, ఆ దేవుళ్ళ క్రింద శుభాన్ని తేవడానికి మామి డాకు (అంటే నేను) ఉండాల్సిందే. అంతటి ఉత్కృష్టమైన జన్మ నాది అని మావి డాకు అంది. అయితే గుమ్మాలకీ ద్వారాలకీ తలకిందకు వ్రేలాడుతూ, తలకిందు లుగా వేలాడటమే మామిడాకు స్థానం అనే నిజాన్ని మర్చిపోయింది. అంటే బ్రతుకు తలకిందులైంది అనే విషయాన్ని గ్రహంచ లేకపోయింది మామిడాకు.

తర్వాత అరిటాకు నిల్చొంది. తన ప్రతిభను చెప్పుకోవటం మొదలుపెట్టిం ది. దేవునికి ప్రసాదం నివేదన అరటి ఆకులోనే చేస్తారని గొప్పగా చెప్పుకుంది. దైవ కార్యాలైన పూజలు, వ్రతాలలో అరిటాకుకి ఎంతో విలువ ఉంటుందని చెప్పింది. పెళ్ళిళ్ళలో, పేరంటాలలో, అరిటాకులలో భోజనాలు వడ్డించితే, సంప్రదాయ పద్ధతిలో భోజనాలు పెట్టారనే గొప్ప పేరు, ఆ భోజనాలకు వస్తుందని గర్వంగా తలెగరేసింది అరిటాకు.  అయితే ప్రసాద వితరణ సమయంలోను, పెళ్ళిళ్ళు పేరంటాలులో భోజనాలకు అవసరార్ధం అరటాకుని వాడినా, భోజనాలయ్యాక, ప్రసాదం ఆరగించడం అయ్యాక, ఆ అరిటాకు స్థానం ఎంగిలాకుల కుప్పే’ అనే విషయాన్ని అరిటాకు మర్చిపోయింది. అరిటాకుకి ఉన్న అహం కారణంగానే, అరటి ఆకు స్థానం ఎంగి లాకుల కుప్ప అయ్యిందనే అసలు నిజాన్ని గ్రహంచ లేకపోయింది అరిటాకు.

తర్వాత కరివేపాకు వంతు వచ్చింది. ఎన్నో రుచికరమైన వంటలకు రుచి రావాలంటే, సుగంధ భరితం అవ్వాలంటే కరివేపాకు ఎంతో అవసరం. కరివేపా కు లేకపోతే ఆ వంటకానికి సార్ధకత రాదు. అంతటి ప్రాముఖ్యత కలదాన్ని నేను. అని కరివేపాకు అహం ప్రదర్శించింది. అవునవును. అవసరం అయిపోయాక వండిన ఆ వంటకాన్ని తింటున్నప్పుడు, నిన్ను (కరివేపాకును) తీసి అవతల పారేస్తారు. అంత నీచమైన స్థానం నీది అని మిగతా ఆకులు వినబడీ వినబడనట్లు గొణుక్కున్నాయి.

తర్వాత తమలపాకు మాట్లాడింది. తాంబూల సేవనం నేను (తమలపాకు) లేనిదే జరగదు. మంచి సువాసనతో నోళ్ళనన్నింటినీ పండిస్తాను. తాంబూల సేవనానికి మానవ జీవనంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. అదంతా నా వలనే. అని అహంకార పూరితంగా తన గొప్పదనాన్ని తానే చెప్పుకుంది తమలపాకు. అవు నవును. తాంబూల సేవనం అయింతర్వాత, పిప్పిగా మిగిలిపోయిన నిన్ను, ఉమ్ముగా ఊసి పారేస్తారు. అదీ నీ స్థానం. అని హాస్యంగా నవ్వుకుంటూ ఎగతాళి చేసాయి మిగతా ఆకులు.

తమలపాకు తర్వాత మరే ఆకు మాట్లాడటానికి నిలబడ లేదు. అయితే విన మ్రంగా కూచుని అంతా వింటున్న ఓ ఆకు, తులసి ఆకు వైపు చూసింది. తులసి ఆకుని తన గొప్పదనాన్ని చెప్పుకోమని తులసి ఆకుకి ఎంతగానో చెప్పింది. తులసి ఆకు మాత్రం ససేమిరా మాట్లాడలేనని ఖరాఖండిగా చెప్పింది. మాట్లాడవలసిం దే అని అన్ని ఆకులూ తులసి ఆకుని బలవంతం చేసాయి. చేసేదేమీ లేక మాట్లాడ టానికి సిద్ధపడింది తులసి ఆకు. ఎంతో వినమ్రంగా నిలుచుని ఇలా అంది.

నేను చాలా చిన్న ఆకుని. నా తల్లి తులసి మొక్క కూడా చాలా చిన్నది. ఆకారంలోను, అన్నింటిలోను నేను చాలా చిన్నదానిని. నాకేం ప్రత్యేకత ఉంటుంది? నాకు ఏవిధమైన ప్రత్యేకతా లేదు. అని చెప్పి నెమ్మదిగా కూచుంది.తులసి ఆకులో అణువణువునా ఏమాత్రం అహంకారం, అహంభావం కనిపించలేదు. అందుకే తులసి ఆకు అంత పవిత్రమైంది అయ్యింది. అమ్మ స్థానం పొం దింది. తులసమ్మ”గా పిలవబడుతోంది. పూజ్యనీయురాలైంది. ప్రతివారి చేత ప్రతి నిత్యం పూజలు అందుకుంటోంది.

బాధ్యతలు నిర్వహించడమే..

ద్వాపరయుగంలో  కౌశికుడనే బ్రహ్మచారికి ఎంతో తపశ్శక్తి ఉంది. అయినా సరే నిత్యం ఆయన  తపస్సు చేసుకుంటాడు.   ఒక రోజు చెట్టుమీద ఉన్న పక్షి అతడి మీద రెట్టవేస్తుంది. దాన్ని కౌశికుడు కోపంతో చూస్తాడు. అతడి తపశ్శక్తికి ఆ పిట్ట కాలి పోతుంది. తర్వాత ఒక ఇంటికి వెళ్లి 'భిక్షాం దేహి' అని అడుగుతాడు. ఆమె భర్తకు సేవలు చేస్తూ భిక్ష వేయడానికి ఆలస్యంగా వస్తుంది. దాంతో ఆమె మీదా కౌశికుడికి కోపం వస్తుంది. బయటకు రాగానే ఆమెను కోపంతో చూస్తాడు. ఆమెకు ఏమీ కాదు. పైగా ఆ స్త్రీ నీ కోపానికి తగలబడి పోవడానికి నేను పక్షిని కాదు  అంటుంది. 

కౌశికుడు ఆమె శక్తికి ఆశ్చర్యపోతాడు. ఆమె సలహా ప్రకారం మాంసాన్ని అమ్ముతున్న ధర్మవ్యాధుడిని కలుస్తాడు. తనకు తపస్సు వల్ల వచ్చిన కొద్దిపాటి శక్తిని చూసుకొని గర్వపడ్డానని, ముసలివాళ్లు అయిన  తల్లిదండ్రులను చూసుకోకుండా వదిలేశానని అతడి వల్ల తెలుసుకుంటాడు. తనలో ఉన్న 'నేను  అహంభావం గల వ్యక్తి .. ఇన్నాళ్లు సరిగా అర్ధం చేసుకోలేదని, ఇప్పుడే 'నేను అనే వ్యక్తకి అర్దం  తెలిసిందని ధర్మవ్యాధుడికి చెప్తాడు. కర్తవ్యాన్ని నిర్వహించడమే తన బాధ్యతని గ్రహించి.. తల్లిదండ్రులను చూసుకోవడానికి వెళ్లిపోతాడు. సులభంగా సమాధానం చెప్పేది కాదు. వేదాలు, ఉపనిషత్తుల నుంచి ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి రుషులు ప్రయత్నిస్తున్నారు" అని చెప్పాడు. అంతేకాదు, వశిష్టుడు ఇంకా ఈ ప్రశ్నకు సమాధానం ఒకరు చెప్తే అర్ధం కాదు. ఎవరి జీవితానుభవాలనుంచి వాళ్లకు వాళ్లే సమాధానం వెతుక్కోవాలి. ప్రయత్నించు" అని చెప్పాడు.

అధికారమనే అహం పోవాలి

ఒక రాజుకు ప్రజలను ఎక్కువకాలం పాలించడం వల్ల అధికారం మీద విసుగు పుడుతుంది. నేను ఎందుకు రాజ్యాన్ని పాలించాలి? ఈ ప్రజలు ఎందుకు నేను చెప్పినట్టు వినాలి? అసలు నేను ఎవరు? ఈ బాధ్యతకు ఎందుకు బందీగా ఉన్నాను?.." ఇలాంటి అనుమానాలు వచ్చాయి. గురువును కలవడానికి ఆశ్రమానికి వెళ్తాడు. గురువు లోపల ఉంటాడు. శిష్యులు బయట కనిపిస్తారు. 'మీ గురువును కలవడానికి రాజును వచ్చానని చెప్పు' అని ఒక శిష్యుడికి చెప్తాడు. ఆ శిష్యుడు లోపలకు వెళ్లి రాజు చెప్పిన మాటను అలాగే గురువుకు చెప్తాడు. గురువు వెంటనే ' ఆ రాజనే 'నేను' పోయాక రమ్మని చెప్పు" అని బదులిచ్చి పంపించాడు. శిష్యుడు వచ్చి 'రాజనే "నేను" పోయాక రమ్మని చెప్పమన్నారు గురువుగారు' అని చెప్తాడు. రాజుకు మొదట అర్ధం కాదు. తిరిగి రాజ్యానికి వెళ్లి, కొన్నిరోజులు ఆలోచిస్తాడు. చివరకు ఒక రాత్రి అర్థమై.. తనలో ఉన్న 'నేను' అంటే అధికారంతో వచ్చిన 'అహం'అని తెలుసుకుని.. గురువు దగ్గరకు వెళ్లి ఉపదేశం పొందుతాడు.

ఎవర్ని తొలగమంటారు స్వామీ.. 

శంకరాచార్యులు శిష్యులతో కలిసి కాశీలోని గంగానదిలో స్నానం చేసి, విశాలాక్షుడ్ని దర్శించుకుందామని బయలుదేరుతాడు. దారిలో నడుస్తుంటే నాలుగు కుక్కలతో, కల్లు తాగుతూ, కురూపి ఎదురు వస్తాడు. అతడిని చూసిన శంకరాచార్యులు 'దారికి అడ్డుతప్పుకో అంటాడు. అగు స్వామీ మీరు అడ్డు తప్పుకోమంటోంది నన్నా.? నాలో ఉన్న వ్యక్తినా...' అని అడుగుతాడు. 

శంకరాచార్యులకు ఆ వ్యక్తి అడిగిన ప్రశ్నకు తల తిరిగినట్లవుతుంది. ఆలోచిస్తాడు. అప్పటి వరకు శంకరాచార్యులు తనను తాను ఎంతో జ్ఞాని అనుకుంటున్నాడు. కానీ తనలో ఉన్న లోపం ఏంటో ఆ ప్రశ్నతో తెలిసొస్తుంది. తనలో ఉన్న ఆ లోపాన్ని పోగొట్టడానికే శివుడు ఇలా వచ్చాడని అర్థం చేసుకుంటాడు. అతడి పక్కన ఉన్నవి కుక్కలు కాదని, నాలుగు వేదాలని గ్రహిస్తాడు. వెంటనే తన తప్పు మన్నించమని శివుడి కాళ్ల మీద పడతాడు. నిజమైన జ్ఞానిలో 'నేను' అనే అహం ఉండదు. అందర్నీ తనతోపాటు సమానంగా చూస్తాడు.. అని శంకరాచార్యులు శివుడి వల్ల తెలుసుకుంటాడు.

వదిలేస్తే మంచిది
 
'నేను' అంటే 'అహం' అంటారు కొందరు. ఆ అహం కామక్రోధలోభమోహ మదమాత్సర్యాదులతో ప్రవర్తించడం వల్ల బయటపడుతుందని చెప్తారు. ప్రతి ఒక్కరూ తన గురించి చెప్పుకునేటప్పుడు 'నేను' అనే మాట వస్తుంది. 'నా వాళ్లు, నా సంపాదన, నా డబ్బు, నా కారు, నా ఇల్లు.." ఇలా ప్రతి దాన్ని నేనుతో ముడిపెట్టి చెప్తారు. నిజానికి 'నేను' అనేది పెద్ద చిక్కు ప్రశ్న. వేదాల నుంచి ఇప్పటి వరకు అది ఒక అంతుచిక్కని రహస్యంగానే మిగిలి ఉంది. 'నన్ను తిడతావా?, నన్ను అంటారా? అని అహంతో ఆలోచిస్తారు. 'నా పరువు పోయింది' అని సమాజంలో భాగస్వామిగా భావించేది ఈ 'నేను' వల్లే. తిడితే బాధ, పొగిడితే సంతోషం.. ఇవన్నీ 'నేను' వల్లే వస్తాయి. ఇంద్రియాలన్నీ 'నేను' తోనే ముడిపడి ఉంటాయి. కోరికలు, ఆశలు, సుఖాలు, సంతోషాలు.. "'నేను'ను అంటిపెట్టుకునే ఉంటాయి. జూదం, 2. మద్యం..లాంటి చెడు అలవాట్లు కూడా ఈ "నేను కు సంబంధించినవే. అందుకే "నేను" అనేది మనిషిని దిగజార్చేది తప్ప, గొప్ప స్థాయికి తీసుకెళ్లేది కానేకాదు. నిజమైన ఆనందం పొందాలంటే 'నేను'ను వదిలేయాలి. 'నేను'ను వదిలేస్తేనే స్వచ్ఛంగా, స్వేచ్ఛగా జీవించడం అంటే ఏంటో తెలుస్తుంది.

మరి చూశారా.. పైన చెప్పిన విధంగా.. తులసి ఆకు నేను అనే అహాన్ని వదిలేసింది కాబట్టి.. ఈ రోజు పూజలందుకుంటుంది.. అంతే కాదు ఆ ఆకుతోనే నిత్యం పూజిస్తాం కూడా.   అందుకనే నేను అనే  అహాన్ని వదులుదాం. అహంభావాన్ని దూరం పెడదాం. ప్రశాంతంగా జీవిద్దాం...