అమృతం అంటే ఏమిటి.. అది ఎక్కడ దొరుకుతుంది ....జ్ఞానం అంటే ఏమిటి? దాని వల్ల ఉపయోగం ఏమిటి? యఙ్ఞాలు ఎందుకు చేయాలి ?. మహాభారత గ్రంథం ప్రకారం.. ఈ విషయాల గురించి శ్రీకృష్ణుడు... అర్జునుడికి ఏమని వివరించాడు ?
అమృతం అంటే ఎక్కడో స్వర్గంలో దేవతల ఆహారం అనుకుంటాం. కానీ, ఆమాటకి అర్థం తెలిస్తే అది ఇక్కడే లభ్యమౌతుందని తెలుస్తుంది. అమృతం అంటే మరణించనిది. నశించనిది, శాశ్వతంగా ఉండేది అని అర్థం. అటువంటి దానిని ఆహారంగా తీసుకుంటే, తిన్నవారికి కూడా అటువంటి లక్షణాలే సంక్రమిస్తాయి. ఇది ఎక్కడ దొరుకుతుందో స్పష్టంగా, సూటిగా, ఎటువంటి శషభిషలు లేకుండా చెప్పాడు కృష్ణుడు. తన గొప్పతనం ప్రదర్శించుకోవటానికి కాకుండా, వింటున్న వారికి బాగా అర్థమై, ఆచరించటానికి వీలుగా ఉండేట్టు చెప్పటం ఉత్తమ ఆచార్యుడి లక్షణం కదా. ఈ సృష్టి కార్యం మొత్తం యజ్ఞ స్వరూపం అని, మానవులు చేసే యజ్ఞాలు అన్నీ ఆ యజ్ఞాన్ని చూసి అనుకరిస్తున్నవేనని, ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన యజ్ఞాన్ని చేస్తున్నారు అని చెప్పిన తరువాత. యజ్ఞశేషాన్ని స్వీకరించే వారు అమృతాన్ని భుజిస్తున్నారు అని చెప్పాడు శ్రీ కృష్ణుడు.
యజ్ఞం అంటే ప్రస్తుతం మనం చూస్తున్న యజ్ఞాలు అని భ్రమపడకూడదు. ఏదైనా స్వప్రయోజనాన్ని ఆశించకుండా చేసే పని. ఫలితం తాను మాత్రమే పొందాలనుకోకుండా చేసేది. ..దీనిని అందరు తెలిసో తెలియకో కొంతవరకు ఆచరిస్తూనే ఉంటారు. అయితే, తెలిసి ప్రయత్నపూర్వకంగా త్రికరణశుద్ధితో చేసినప్పుడు పూర్తి ఫలితం ఉంటుంది.
వంట చేసే ఇల్లాలు తాను మాత్రమే తినాలని అనుకోదు. సంపాదించే వారు తాము మాత్రమే అనుభవించాలని అనుకోరు. కనీసం తన కుటుంబం. పిల్లలు, తరువాత తరాలు అయినా అనుభవించాలని కోరుకుంటారు. ఇది కొంత నయం... కాని, లోకం అంతటికి అది ఉపయోగపడాలనుకోవటం నిజమైన యజ్ఞార్థ క్రియ.
"త్యాగాయ సంభృతార్థానం" అని రఘువంశ రాజుల గురించి చెపుతాడు కాళిదాసు. త్యాగం అనేదిసంపాదించారు. కూడబెట్టటానికి కాదు అంటాడు. "దేయం దీన జనాయ చ విత్తం" అని శంకర భగవత్పాదులు ఆదేశించారు. దీనులై ధనార్జన చేయలేనివారికి ఇవ్వవలసినది అని ఆచార్యులు చెప్పిన మాట.. తన స్థాయిలో కుటుంబసభ్యులైనా, పెద్దస్థాయిలో లోకం అన్నా- తాను సంపాదించినది ఇతరుల కొరకు వినియోగపరచి మిగిలినది తాను అనుభవిస్తే అది యజ్ఞశేషం అవుతుంది. ఈ యజ్ఞశేషం తరగకుండా ఉంటుంది.
ఉదాహరణకి పండిన పంట అంతా తినేస్తే అంతటితో అయిపోతుంది. కొన్ని గింజలైనా మిగిల్చి వాటిని నాటితే తిరిగి పంట తయారవుతుంది. మొత్తం తానే అనుభవించాలని కాక... ఆ కాస్త త్యాగబుద్ధి ఉండాలి. ఇదే కృషియజ్ఞం. అదేవిధంగా వ్యాపారస్తుడు వచ్చిన లాభాన్ని అంతా స్వంతానికి ఖర్చు పెట్టకుండా, కొంత మళ్ళీ పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయి. అనుభవించేస్తే వ్యాపారమే లేదు. ఈ విధంగా మధ్యలో తెగిపోకుండా నిరంతరంగా కొనసాగటమే అమృతత్వం..
ఇది ద్రవ్యపరంగా మాత్రమే కాదు. జ్ఞానపరంగా కూడా వర్తిస్తుంది. గురువు నుండి తను పొందిన జ్ఞానాన్ని తన వద్దనే ఉంచుకోకుండా, ఇతరులతో పంచుకోవటం జ్ఞానయజ్ఞం. జ్ఞానం పంచుకున్న కొద్దీ పెరుగుతుందే కాని తరగదు కదా. ఇతరులకి బోధిస్తున్న కొద్దీ మరింత స్వచ్ఛంగా, తేటపడుతుంది. అప్పుడు అది జ్ఞానయజ్ఞశేషం అయి అమృతత్వాన్ని సంతరించుకుంటుంది. ఆ జ్ఞానం ఆ వ్యక్తితో అంతరించకుండా తరువాతి తరాలకి కొనసాగుతోంది కనుక అమృతం అవుతుంది. దీనినే రుషి రుణం అంటారు. దీనినూ మూమూలుగా చెప్పకపోతే విషముష్టి చెట్టె పుడతారు" అని అంటుంటారు. ఇందులో నిరంతరత్వంతో పాటు పరస్పరత్వం కూడా ఉంది. నిరంతరత్వం విషయానికి సంబంధించింది.
ALSO READ | Horoscope : తులా సంక్రమణం.. తులా సంక్రాంతి.. 12 రాశులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..!
పరస్పరత్వం వ్యక్తికి, సమాజానికి సంబంధించింది.. ఇంతకుముందు చెప్పిన కుటుంబ విషయమే తీసుకుంటే అనుభవంలోకి తెచ్చుకోవటానికి రఘువంశ రాజులు ధనాన్ని
-సంపాదించిన వ్యక్తి తాను మాత్రమే దానిని అనుభవించాలని అనుకుంటే వండి పెట్టేవారు ఉండరు. వండిన వారు తను మాత్రమే తినాలనుకుంటే సంపాదించి తెచ్చి పెట్టేవారు ఉండరు.. సమాజపరంగా చూస్తే రైతు పండించిన దానిని తనకోసమే ఉంచుకుంటే, పాత్రలు చేసేవాడు ఇతరులకి ఇవ్వనంటే, వంటచెరకో ఇంధనమో ఎవరికి ఇవ్వనంటే- ఇట్లా ఎవరికి వారు తమ శ్రమఫలితాన్ని ఇతరులతో పంచుకోమని అంటే సమాజ వ్యవహారాలు నడిచేదెట్లా? ప్రతివారు అన్ని పనులు చెయ్యలేరు. తమ అవసరాలకి కావలసిన వాటిని తామే స్వయంగా తయారు చేసుకోవటం. వీలు కాదు. పరస్పరం ఆధారపడవలసినదే. తప్పనిసరి అయిన దానిని ఎరుకతో త్యాగబుద్ధితో ఆచరించినప్పుడు అమ్మతత్వ సాధన అవుతుంది.
యజ్ఞాలు బ్రహ్మ ముఖం నుండే పుట్టాయి. బ్రహ్మముఖం నుండి వెలువడినవి వేదాలు. అవి సృష్టిలోను, తనలోను అంతర్లీనంగా ఉన్న జ్ఞానానుభూతి. అంటే ఈ యజ్ఞాలు అన్నీ 'బ్రహ్మకర్మ' అనే దివ్యకర్మ నుండి పుట్టాయి. ఇది తెలిసి కర్మాచరణం చేసే వారు విమోచనం పొందుతారు. ద్రవ్యమయంగా భౌతిక పదార్థాలతో చేసే యజ్ఞం కన్నా జ్ఞానయజ్ఞం శ్రేష్టం. ద్రవ్యమయ యజ్ఞం వల్ల శ్రేయస్సు కలుగుతుంది. శ్రేయస్సు వల్ల జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం అంటే పనులని యజ్ఞార్థం ఆచరించటం వల్ల కలిగే సంస్కారం. కర్మలన్నీ పరిసమాప్తమయ్యేది జ్ఞానంలోనే. ఒక్క మాటలో చెప్పాలంటే ఫలితాన్ని వదిలి కర్మలను ఆచరిస్తే కలిగేది జ్ఞానం.యజ్ఞం అంటే ఈనాడు మనం చూస్తున్న యజ్ఞాలు అని భ్రమపడకూడదు. ఏదైనా స్వప్రయోజనాన్ని ఆశించకుండా చేసే పని. ఫలితం తాను మాత్రమే పొందాలనుకోకుండా చేసేది.