బోర్ ఎందుకు కొడుతుందో తెలుసా?

బోర్ ఎందుకు కొడుతుందో తెలుసా?

బోర్‌‌‌‌ కొడుతోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు’ ఈ మాట చాలామంది చాలాసార్లు అంటుంటారు. ఇంతకీ బోర్ అంటే ఏంటి? అసలు బోర్ ఎందుకు కొడుతుంది?  ‘చేయడానికేం పని లేనప్పుడు .. ఖాళీగా ఉండటమే బోర్‌‌‌‌ కొట్టడం’ అని వెస్టర్న్‌‌ కల్చర్‌‌‌‌లో బోర్‌‌డమ్‌‌‌‌కి ఓ డెఫినిషన్‌‌ ఉంది. దీన్ని సంతోషం లేని స్థితి లేదా ఎమోషన్‌‌ అని కూడా అనొచ్చు.  బోర్‌‌‌‌ కొట్టడానికి చాలా కారణాలు ఉంటాయి. ఇది యూనివర్సల్ ఎక్స్‌‌పీరియెన్స్‌‌. ప్రపంచంలో దాదాపు అందరూ తమ జీవితంలో బోర్‌‌‌‌ని ఎక్స్‌‌పీరియెన్స్‌‌ చేస్తారు.  90 శాతం మంది యూత్‌‌ ఎప్పుడో ఒకసారి బోర్‌‌‌‌డమ్‌‌ ఎక్స్‌‌పీరియెన్స్‌‌ చేసిన వాళ్లే అని స్టడీలు చెప్తున్నాయి.

బోర్ కొట్టడం’ అంటే ఏమీ తోచకపోవడమే. ఈ లక్షణం మనుషుల్లో మాత్రమే కనిపిస్తుంది.  టెక్నాలజీ పెరగడం, అన్ని పనులూ మెషిన్లే చేస్తుండటం వల్ల చాలామందికి ఎక్కువ విశ్రాంతి దొరుకుతోంది. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఏ పని లేకపోతే.. విసిగిపోతారు. ఈ విషయంలో పిల్లలు, పెద్దలు అని తేడా ఏం లేదు. చిన్న పిల్లలు ఎక్కువ ఫీల్‌‌ అవుతారు. పెద్ద వాళ్లకు బోర్ కొట్టడం అప్పటికి కొత్త కాదు. కాబట్టి, ఇదంతా కామనే అని అడ్జెస్ట్‌‌ అవుతుంటారు. ‘ఎప్పుడూ ఉత్సాహంగా ఉండటం అంటే కుదిరే పని కాదు’ అని తమకు తామే సర్థి చెప్పుకుంటారు. టీనేజర్లు, యూత్‌‌ ఇలా అర్థం చేసుకోరు. పైగా అప్పటికే ఏవేవో కలలు కంటుంటారు. వెంటనే ఫ్యూచర్‌‌‌‌ని తమ చేతుల్లోకి తీసుకోవాలనుకుంటారు. సహజంగానే ఆ వయసులో  సహనం తక్కువగా ఉంటుంది. కాబట్టి, ప్రతి చిన్న విషయానికి చిరాకు పడుతుంటారు. ఊహలకు, రియాలిటీకి సంబంధం లేకపోవడం వల్ల జీవితంలో ఒక ఛాలెంజ్‌‌, ఇన్‌‌స్పిరేషన్ లేకపోవడం వల్ల నిరాశలో మునిగిపోతారు.  దీనికి బోర్ అని పేరు పెట్టి ‘బోర్‌‌‌‌ కొడుతోంది’ అంటారు.

నిజానికి బోర్‌‌‌‌ కొట్టడం అనేది  ఎక్కువ సేపు  ఉండదు. కానీ, చాలా  టైమ్‌‌ వేస్ట్‌‌ అవుతున్నట్టు, పెద్ద సమస్యలాగా అనిపిస్తుంటుంది.  ఆ టైమ్‌‌లో ఏం చేయాలో తెలియదు. చికాకు కలుగుతుంది.  పనీ పాటా  లేకుండా,  ఏ ఆలోచనా లేకుండా పడుకుంటారు. తమ నిస్సహాయస్థితికి తమ చుట్టూ ఉన్నవాళ్లే  కారణమన్నట్టుగా అందర్నీ కోప్పడుతుంటారు.  లేదంటే  గూడు పెట్టుకున్న కోడిలా డల్‌‌గా ఉంటారు.

బోర్ ఎందుకు కొడుతుంది?

  • బోర్ ఎందుకు కొడుతుంది? అంటే దాని వెనక రకరకాల కారణాలు ఉంటాయి. వాటిలో కొన్ని..
  • మెదడు అలిసిపోయినప్పుడు కలిగే ఫీలింగ్‌‌ లాంటిదే ఈ బోర్ కూడా! ఏదైనా ఒక పనిని పదే పదే చేయడం వల్ల బోర్‌‌‌‌ కొడుతుంది.  ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌లోనో, బస్టాప్‌‌లోనో వెయిట్‌‌ చేస్తున్నప్పుడు బోర్‌‌‌‌ కొట్టడం కామన్‌‌. నాలుగు గంటలకు రావాల్సిన బస్సు రానప్పుడు, అది వచ్చే వరకు వెయిట్‌‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు బోర్‌‌‌‌ కొడుతుంది.
  • తన స్కిల్స్‌‌కి తగ్గ చాలెంజ్‌‌ లేనప్పుడు, తాను చేస్తున్న పనిలో లక్ష్యం చేరుకుంటున్నానా? లేదా? అనే విషయాలకు సంబంధించి ఫీడ్‌‌బ్యాక్ అందనప్పుడు బోర్ కొడుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే తన స్కిల్స్‌‌కి తగ్గ పని లేనప్పుడు బోర్‌‌‌‌ కొడుతుంది, తన స్కిల్స్‌‌కి మించిన పని ఇచ్చినప్పుడు అదే పని యాంగ్జైటీకి కారణమవుతుంది.
  • ఏం చేసినా కొత్తదనం, ఎగ్జైట్‌‌మెంట్‌‌ కావాలని గట్టిగా కోరుకునే వాళ్లలో ఈ బోర్‌‌‌‌డమ్ రిస్క్‌‌ ఎక్కువ. ప్రపంచం చాలా స్లోగా నడుస్తోందని,  తమ బోర్‌‌‌‌కి కొత్తదనమే మెడిసిన్‌‌ అని వీళ్ళు భావిస్తుంటారు. కొంత వరకు, కొన్ని విషయాలకు ఈ కొత్తదనం పరిమితం అయితే ఏం కాదు, కానీ, అదేపనిగా కొత్తదనం కావాలనుకుంటే మాత్రం మానసిక ఆరోగ్యం మీద  తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
  • శ్రద్ధకి, బోర్‌‌‌‌కి సంబంధం ఉంది. మనం చేస్తున్న పనిపై వందశాతం శ్రద్ధ పెట్టలేనప్పుడు కూడా బోర్‌‌‌‌ కొడుతుంది. ఒక పని మీద ఏకాగ్రత కుదరనప్పుడు ఆ పని చేయాలనే ఆసక్తి పూర్తిగా తగ్గిపోతుంది. అందుకే, ‘క్రానిక్ అటెన్షన్‌‌’ సమస్యలు ఉన్నవాళ్లు, ‘అటెన్షెన్‌‌ డెఫిక్ట్ హైపర్‌‌‌‌యాక్టివిటీ డిజార్డర్‌‌‌‌’ సమస్యతో బాధపడుతున్న వాళ్లలో బోర్‌‌‌‌డమ్‌‌ ఫీలింగ్‌‌ ఎక్కువగా ఉంటుంది.
  • తమ గురించి తాము తెలుసుకోలేకపోవడం వల్ల కూడా బోర్ కొడుతుంది. బోర్‌‌‌‌ కొట్టినప్పుడు తమకు ఏం కావాలో, ఏం చేయాలనుకుంటున్నారో బయటకు చెప్పలేరు.  ఏం చేస్తే తాము సంతోషంగా ఉంటామో కూడా  తెలియదు. తమ గోల్‌‌ని గుర్తించే కెపాసిటీ లేక, సొసైటీతో కలవలేక ‘బోర్ కొడుతోంది’ అనేవాళ్లు మరో కేటగిరి.
  • లోలోపల ఆనందించే స్కిల్స్ లేకపోవడం వల్ల కూడా బోర్ కొడుతుంది. కావాల్సినంత ఎగ్జైట్‌‌మెంట్‌‌ని, కోరుకున్న కొత్తదనాన్ని ఇవ్వడంలో ఎప్పుడూ బయటి ప్రపంచం ఫెయిల్‌‌ అవుతూనే ఉంటుంది. దాన్ని తన అంతరంగంలో వెతుక్కోవడంలో విఫలమైన వాళ్లకు బోర్‌‌‌‌ కొడుతుంది.
  • బందీగా ఉన్నట్టు అనిపించడం బోర్‌‌‌‌ కొట్టడంలో ఒక భాగం. అలాగే, డిపెండెంట్‌‌గా ఉన్నప్పుడు వాళ్లు ఏదైనా చేయాలనుకుంటే.. ఎవరిమీదయితే ఆధారపడ్డారో వాళ్ల అనుమతి తీసుకోవాలి. టీనేజ్‌‌లో పిల్లలు పేరెంట్స్ కంట్రోల్‌‌లో ఉంటారు. అందుకే, టీనేజ్‌‌ వాళ్లకు బోర్‌‌‌‌ ఫీలింగ్‌‌ ఎక్కువ.
  • బోర్ అనే ఫీలింగ్‌‌  ఎలా చూసినా అదొక మోడర్న్​ లగ్జరీ.  18 వ శతాబ్దానికి ముందు బోర్‌‌‌‌ అనే ఫీలింగ్‌‌ ఎవరి నోట వినిపించేది కాదు. ఇండస్ట్రియల్‌‌ రివల్యూషన్ తర్వాతే ఈ ఫీలింగ్‌‌ వచ్చి చేరింది. అంతకు ముందు తరం రోజులో టైమంతా కూడు, గుడ్డ కోసమే వెచ్చించేవారు. అందుకే, వాళ్లకు ‘బోర్‌‌‌‌కొట్టడం’ అనే ఆప్షనే లేదు. మారిన కల్చర్​తో అందుబాటులోకి వచ్చిన సౌకర్యాల వల్ల మనిషి పనీ పాట లేకుండా తయారయ్యాడు!

బోర్‌‌‌‌ మంచిదేనా?

బోర్‌‌‌‌ కొట్టడం వల్ల లాభాలు కూడా ఉన్నాయి, ఇది ‘కాల్‌‌ టు యాక్షన్‌‌’..  అంటే ఏదో గొప్ప పని చేయడానికి బోర్‌‌‌‌ ఒక సూచన అని ప్రపంచ ప్రఖ్యాత మ్యూజిక్‌‌ కంపోజర్ స్వెండన్‌‌సన్‌‌ అంటాడు. ఏదో ఒకటి సాధించడానికి బోర్‌‌‌‌ ఇన్‌‌పుట్స్‌‌ అందిస్తుందని ఫేమస్ ఫిలాసఫర్ ఫ్రిడిచ్‌‌ నీజా అంటాడు. బోర్ అనేది ఏదైనా ఒక గొప్ప విషయాన్ని ఆలోచించే అవకాశాన్ని కల్పిస్తుంది.

ఏం చేయాలి?

ఫ్రెండ్‌‌ దగ్గరకెళ్లి  కబుర్లు చెప్పడం,  సినిమాకు వెళ్లడం, ఏదన్నా పుస్తకం చదువుకోవడం, ఆటలాడటం లాంటివి చేస్తే బోర్‌‌‌‌డమ్‌‌ నుంచి బయటపడొచ్చు. ఇలా కాకుండా… సిగరెట్‌‌ తాగడం, మందుకొట్టడం, వేగంగా వెహికల్‌‌ నడపడం లాంటివి చేస్తూ  బోర్‌‌డమ్‌‌ అధిగమించాలని కొంతమంది ప్రయత్నిస్తారు.  బోర్‌‌ కొట్టడం ఎవరికైనా సహజం. కొద్దిసేపటికి అది మాయమైతే పట్టించుకోనవసరం లేదు. ఆ బోర్‌‌ డిప్రెషన్‌‌కి దారితీస్తే మాత్రం సీరియస్‌‌గా తీసుకోవాలి.  ముఖ్యంగా ‘నాకేం తోస్తలేదు.  చచ్చిపోవాలనిపిస్తోంది’ అనే వాళ్లకు కౌన్సెలింగ్ అవసరం. బోర్‌‌ అందరికీ సహజమేనన్న విషయం అర్థమయ్యేట్టు చెప్పాలి.  ముందుగా పేషెంట్‌‌  బలహీనతల్ని వివరించడం వల్ల యాంగ్జయిటీ కొంత తగ్గుతుంది. దాంతో  మనసు విప్పి మాట్లాడగలుగుతారు.  అలా మాట్లాడగలిగితే.. బోర్‌‌ అనే మానసిక స్థితి నుంచి బయటపడేసినట్టే! దీనికి ఫ్యామిలీ సపోర్ట్ అవసరం. బైక్‌‌ కొనిస్తే బోర్‌‌‌‌ పోతుందనో, ఇంకేదో కొనిస్తే బోర్‌‌‌‌ పోతుందని కూడా అడుగుతుంటారు. కానీ, ఈ సమయంలో వాళ్లకి  లొంగిపోవద్దు. ఇలా అడిగిందల్లా కొనిస్తే వాస్తవ పరిస్థితులకు వాళ్లని మనమే దూరం చేసినవాళ్ళమవుతాం.  జీవితమంటే ఆశా నిరాశల సమ్మేళనం. ఫ్యూచర్‌‌‌‌లో  ఎప్పుడో సడెన్‌‌గా నిరాశను ఎదుర్కోవడం కంటే ఎదుగుతున్న దశలోనే కొంచెం కొంచెంగా వాటిని రుచి చూడనివ్వాలి. అది పరిస్థితులను తట్టుకోవడం, మనసుకి సర్దిచెప్పుకోవడం ఎలాగో నేర్పిస్తుంది!

బోర్‌‌‌‌ కొట్టినప్పుడు

ఆడవాళ్ల కంటే మగవాళ్లకే బోర్‌‌‌‌ ఫీలింగ్‌‌ ఎక్కువట! బోర్‌‌‌‌ కొట్టినప్పుడు ఒంటరిగా ఉంటారు. కోపంగా ఉంటారు. నిరాశ, ఆందోళనల్లో మునిగిపోతారు.
‘ చెడ్డ పనులన్నింటి వేర్లు బోర్‌‌‌‌ కొట్టడంలోనే ఉంటాయి’ అంటాడు ఫేమస్‌‌ ఫిలాసఫర్ కీయర్కె గార్డ్‌‌. బాధ నుంచి తప్పించుకోవడానికి ఏ పని
చేయడానికైనా బోర్ ఉసిగొల్పుతుంది. డ్రగ్‌‌ ఎడిక్షన్‌‌, ఆల్కహాలిజం, గ్యాంబ్లింగ్‌‌తో సంబంధాలు ఉన్నవాళ్లలో ఈ బోర్‌‌‌‌డమ్‌‌ ఎక్కువగా కనిపిస్తుంది.