ఇటీవల కాలంలో సోషల్ మీడియా ఫ్లాట్ఫాం X(గతంలో ట్విట్టర్)లో కేవలం ఒక ఇమేజ్ పోస్ట్ చేయడం అనేది బాగా పెరిగిపోయింది. తెల్లని బ్యాక్గ్రౌండ్లో ‘ఇక్కడ క్లిక్ చేయండి’ అని బ్లాక్ టెక్ట్స్ రీడింగ్తో కిందికి చూపించే బాణం గుర్తుతోఈ ఇమేజ్ కనిపిస్తుంది. ఏందీ.. ఒక ఇమేజ్ మాత్రమే ఉంది.. ఏముంది ఇందులో.. వంటి క్వశ్చన్లతో చాలామంది యూజర్లలో గందరగోళాన్ని రేపుతోంది. X లో రచ్చ చేస్తున్న Click Here ట్రెండ్ గురించి తెలుసుకుందాం..
ట్రెండ్ డీకోడ్
Xలో యూజర్లు ఫొటోలను తెలుపు బ్యాక్ గ్రౌండ్, బ్లాక్ టెక్ట్స్ తో ‘‘ఇక్కడ క్లిక్ చేయండి ’’ అని పోస్ట్ చేస్తారు. ఫొటో దిగువన ఎడమ మూలలో బాణం గుర్తు చూపుతుంది. యూజర్ పోస్ట్ పై క్లిక్ చేసినపుడు ALT అనే పదంతో ఒక చిన్న బాక్స్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ఒక టెక్ట్స్ బాక్స్ తెరుచుకుంటుంది. ఇది దీని డీకోడింగ్.
బీజేపీ, కాంగ్రెస్, ఆప్ వంటి రాజకీయ పార్టీలు, యూరోపియన్ ఫుట్ బాల్ క్లబ్, బార్సిలోనా, పారిస్ సెయింట్ జర్మైన్ వంటి సంస్థల ఖాతాలన్నీ ఈ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం X లో ‘‘ఇక్కడ క్లిక్ చేయండి ’’ ట్రెండ్ లో ఉన్నాయి.
ALSO READ :- రాముడు అయోధ్యని మార్చాడు.. కానీ, ఇప్పుడు అక్కడ స్కామ్
బీజేపీ పార్టీ లోక్ సభ ఎన్నికల నినాదాన్ని హిందీలో చెప్పుతూ ‘ఇక్కడ క్లిక్ చేయండి ’ ట్రెండ్ ను ఉపయోగించుకుంది. బ్రాండెడ్ కంపెనీలు, సంస్థలు కూడా ట్యాగ్ లైన్లు, నినాదాలను వ్యాప్తి చేయడానికి మార్కెటింగ్ సాధనంగా ఈ ‘‘ఇక్కడ క్లిక్ చేయండి ’’ ట్రెండ్ ను ఉపయోగించుకుంటున్నాయి.
— BJP (@BJP4India) March 30, 2024
నెటిజన్ల స్పందన
ఈ క్లిక్ హియర్ ట్రెండ్ గురించి బీజేపీ, శివసేన, ఆప్ వంటి చాలా రాజకీయ పార్టీలు స్పందించాయి. దీనికి క్లిక్ చేస్తే గానీ దాని వెనక ఏముందో తెలియడం లేదు..అంతా అయోమంగా ఉంది అని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ట్రెండ్ పై వివరణ ఇవ్వాలని కోరుతున్నారు.
2016లో Xఫ్లాట్ ఫాంలో ఈ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చారు. ఇది ఫొటో డిస్క్రిప్సన్ ను అందిస్తుంది. అంటే 420 క్యారెక్టర్ల వరకు టెక్ట్స్ ద్వారా ఇమేజ్ గురించి వివరిస్తుంది. X లో క్లిక్ హియర్’ ట్రెండ్ ఫీచర్..యూజర్లకు ముఖ్యంగా వికలాంగులకు కంటెంట్ ను రూపొందించడమే లక్ష్యాంగా ఈ ఫీచర్ ను తీసుకొచ్చారు. ఈ ట్రెండ్ X యూజర్లను కొంత గందరగోళానికి గురి చేసినా..డిజిటల్ స్పేస్ లలో యాక్సెసిబిలిటీ ఫీచర్ల ప్రాముఖ్యత, విభిన్న కమ్యూనిటీలకు అది ఎంత ఉపయోగమో గుర్తు చేస్తుంది.