పెట్రోల్ ధరలు బాగా పెరిగిపోవడంతో CNG కార్లకు డిమాండ్ పెరిగిపోతోంది. చాలా కంపెనీలు తమ పెట్రోల్ కార్లలో CNG వేరియంట్ లను వేగంగా విడుదల చేసేందుకు ఇదే కారణం. అయితే ప్రస్తుతం CNG కార్లతో పాటు iCNG కార్లు కూడా మార్కెట్లోకి రావడం ప్రారంభించాయి. దీంతో సీఎన్ జీ కారును కొనుగోలు చేయాలా లేక ఐసీఎన్ జీ కార్లను కొనుగోలు చేయాల అనే అయోమయం కస్టమర్లలో నెలకొంది. ఇంతకీ CNG , iCNG కార్ల మధ్య తేడా ఏంటీ? రెండింటిలో ఏదీ కొంటే మంచి మైలేజీ వస్తుందనే విషయాలను తెలుసుకుందాం.
CNG iCNG కార్లమధ్య ఉన్న ఏకైక వ్యత్యాసం ఏమిటంటే.. CNG కారు ఇంజిన్ పెట్రోల్, CNG రెండింటిలోనూ నడుస్తుంది. అయితే iCNG కార్లలో ఇంజిన్ తో పాలు ఎలక్ట్రిక్ మోటారు కూడా అమర్చబడి ఉంటుంది. ఇది కారుకు అదనపు శక్తిని ఇస్టుంది. ఇది కారు పవర్, మైలేజ్ రెండింటిని పెంచుతుంది.
iCNGతో ఎక్కువ మైలేజ్
iCNG కార్లు సాధారణ CNG కార్ల కంటే 12-15 శాతం ఎక్కువ మైలేజీని అందిస్తాయి. ఒక CNG కారు ఒక కిలో CNGకి 20 కిలోమీటర్ల మైలేజీని ఇస్తే.. iCNG కారు 22-23 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
iCNGతో తక్కువ కాలుష్యం
తక్కువ ఎలక్ట్రిక్ మోటారు , ఎక్కువ మైలేజీ కారణంగా సాధారణ CNG కార్లతో పోలిస్తే iCNG కార్లు కూడా తక్కువ కాలుష్యాన్ని కలిగిస్తాయి. అయితే ధర పరంగా iCNG కారు ఖరీదైనవి. కానీ iCNG కారును నడిపేందుకు అయ్యే ఖర్చు సాధారణ CNG కారు కంటే తక్కువగా నే ఉంటుంది.