క్రిప్టో కరెన్సీ దశ-దిశ మార్చే నిర్ణయం.. బిట్కాయిన్ రిజర్వ్ ఏర్పాటు ఆర్డర్పై ట్రంప్ సంతకం

క్రిప్టో కరెన్సీ దశ-దిశ మార్చే నిర్ణయం.. బిట్కాయిన్ రిజర్వ్ ఏర్పాటు ఆర్డర్పై ట్రంప్ సంతకం

క్రిప్టో కరెన్సీకి ఫ్యూచర్ మారేలా ఉంది. క్రిప్టో కరెన్సీని ఆమోదిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. వ్యూహాత్మక బిట్కాయిన్ రిజర్వ్ ఏర్పాటు ఎక్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేయడంతో యూఎస్ క్రిప్టో కరెన్సీని ఇకనుంచి పెద్ద ఎత్తున ప్రమోట్ చేయనున్నట్లు స్పష్టం అవుతోంది. 

గురువారం (మార్చి 6) యూఎస్ ప్రసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బిట్ కాయిన్ నిల్వల ఏర్పాటుకు సంబంధించిన ఎక్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. మొదటి నుంచి క్రిప్టో కరెన్సీ పై ఆసక్తి చూపిస్తున్న ట్రంప్.. తాజాగా బిట్ కాయిన్ రిజర్వ్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 

క్రిప్టో కరెన్సీ సప్లైలో ఉన్న అవాంతరాలను అధిగమించేందుకు అవసరమైన సమయంలో నిధులు విడుదలకు ఉద్దేశించి బిట్ కాయిన్ రిజర్వ్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఒక అసెట్ మాదిరిగా ప్రభుత్వం లేదా ఇతర ప్రభుత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. 

ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత జనవరిలో డిజిటల్ అసెట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తూ సంతకం చేశారు. బిట్ కాయిన్ రిజర్వ్ ఏర్పాటుకు ఉన్న మార్గాలను అన్వేషించేందుకు ఈ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత స్ట్రాటజిక్ బిట్ కాయిన్ రిజర్వ్ ను ఏర్పాటు చేయడం విశేషం.

ALSO READ | రష్యా నుంచి ఇండియా కొన్న ఆయిల్​ విలువ రూ.1.5 లక్షల కోట్లు: యూరోపియన్ సంస్థ సీఆర్‌‌‌‌ఈఏ వెల్లడి

వైట్ హౌజ్ క్రిప్టో ఎనలిస్ట్ డేవిడ్ సాక్స్ ప్రకారం.. యూఎస్ ప్రభుత్వం దగ్గర ఇప్పటి వరకు 2 లక్షల బిట్ కాయిన్స్ ఉన్నట్లు అంచనా. అయితే కచ్చితంగా అవి ఎన్ని ఉన్నాయి అనే అంశంపై  ఇప్పటి వరకు ఎలాంటి ఆడిట్ నిర్వహించలేదు. గురువారం ఏర్పాటు చేసిన రిజర్వ్.. బిట్ కాయిన్స్, క్రిప్టో నిల్వలపై ఆడిట్ నిర్వహిస్తుంది. 

యూఎస్ ఇప్పటి వరకు డిపాజిట్ చేసుకున్న ఒక్క బిట్ కాయిన్ ను కూడా అమ్మడం లేదు. అది ఒక విలువైన ఆస్తిగా భద్ర పరచుకుంటాం’’ అని డేవిడ్ సాక్స్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. 

గత వారం 5 క్రిప్టో కరెన్సీలను యూఎస్ రిజర్వ్స్ లో యాడ్ చేసుకోనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అవి బిట్ కాయిన్, ఈథర్ (ether), XRP, సొలాన (solana), కార్డనో(cardano) మొదలైనవి.