శ్రీరాముడు వనవాస సమయంలో తన సతీమణి సీత, సోదరుడు లక్ష్మణునితో పద్నాలుగేళ్ల పాటు అడవిలోనే జీవించాడు. ఆ సమయంలో రాముడు తీసుకున్న ఎక్కువగా తీసుకున్న తిన్న ఆహారం ఇదేనట. దీన్ని రామ్ కంద్ మూల్ ( భూచక్ర గడ్డ) అని పిలుస్తారు. వివిధ అనారోగ్య సమస్యలకు ఈ కందమూలాన్ని ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు . ఇది ఆరోగ్యకరమైనది కూడాడడ. వనవాసంలో ఉన్న శ్రీరాముడు ఈ కందమూలాన్ని తినడం వల్లనే ఆరోగ్యవంతుడిగా ఉన్నారని మన పెద్దలు చెబుతుంటారు.
భూచక్ర గడ్డ మూలం భారతదేశం అయినప్పటికీ, ఈ మొక్క పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఆఫ్రికన్ దేశాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కర్నాటకలోని పశ్చిమ కనుమలతో సహా కేరళ, మహారాష్ట్రలోని కొండలలోని స్క్రబ్ అడవులలో పెరుగుతుంది. మహా కుంభమేళాలో ఈ భూచక్ర దుంపను రామకండ, రామ ఫల పేర్లతో విక్రయిస్తారు. ఈ దుంపకు ఆయుర్వేదంలో ఎంతో ముఖ్యమైనది. ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది.
దీన్ని ప్రధానంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలోనే పండిస్తారు. డ్రమ్ము ఆకారంలో కనిపించే దుంప ఇది. దీన్ని రామ్ కంద్ మూల్ అని పిలుస్తారు. ఉత్తర భారత దేశంలో దీన్ని రాంకంద్, రామచంద్ర కంద్ మూల్ అని కూడా అంటారు. ఇక తమిళనాడులో బుమి చక్కెరైవల్లి కిజంగు అని పిలుస్తారు. ఇది అరుదైన దుంప మాత్రమే కాదు. చాలా ప్రాచీనమైనది కూడా. దీన్ని ఒకప్పుడు ప్రజలు చిరుతిండిగా తినేవారు. ఇప్పుడు ఇది చాలా అరుదుగా లభిస్తుంది. ఆయుర్వేదంలో కూడా దీని ప్రస్తావన ఉంది.
వివిధ వ్యాధుల చికిత్సలో భాగంగా ఈ కందమూలాన్ని ఆయుర్వేదంలో వినియోగిస్తారు. ఇది ఎంతో ఆరోగ్యకరమైనది. వనవాసంలో శ్రీరాముడు ఈ కందమూలాన్ని తినడం వల్లనే సర్వ ఆరోగ్యవంతుడిగా ఉన్నారని చెబుతారు. దీన్ని ఇప్పటికీ రోడ్డుపైన అక్కడక్కడ అమ్ముతూ ఉంటారు. చిన్న ముక్కలుగా కోసి అందిస్తారు. దీని రుచి తీపిగా ఉంటుంది. పైన కొద్దిగా చక్కెర జల్లుకొని తినే వాళ్ళు కూడా ఉన్నారు.
ఈ కంద్ మూల దుంపను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణాశయ రుగ్మతలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. జీర్ణశయంలో స్రవించేలా ప్రేరేపిస్తుంది. దీనివల్ల పోషకాల శోషణ పెరుగుతుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. పేగు కదలికలను నియంత్రించడంలో ఇది ముందుంటుంది. కంద్ మూల దుంపలో ఉండే సుగుణాలు దగ్గు, ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులు వంటివి రాకుండా అడ్డుకుంటాయి. అలాంటివి వచ్చినప్పుడు దీన్ని తింటే వాటిని త్వరగా తగ్గేలా చేస్తాయి.
కీళ్ల నొప్పులతో బాధపడేవారు దీన్ని కచ్చితంగా తినాలి. ఇది కీళ్ల నొప్పులను తగ్గించడమే కాదు కీళ్ల వాపును కూడా తగ్గిస్తుంది. కాబట్టి ఆర్థరైటిస్ బారిన పడినవారు దీన్ని కచ్చితంగా తినాలి. దీన్ని తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది. ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం కూడా తగ్గుతుంది.
శరీరం నుంచి వ్యర్థాలను, విష పదార్థాలను తొలగించడంలో, రక్తాన్ని శుద్ధి చేయడంలో ఇది సహాయపడుతుంది. కాలేయం, మూత్రపిండాల పనితీరుకు ఇది ఎంతో మద్దతుగా నిలుస్తుంది. ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో కూడా ఇది ముందుంటుంది. ఇది పొడి రూపంలో కూడా అమ్ముతారు. ఇది మార్కెట్లలో లభిస్తుంది. దీన్ని ఔషధంగా తీసుకోవచ్చు. మిల్క్ షేక్ లు, స్మూతీలు తయారు చేసుకున్నప్పుడు దీన్ని కలుపుకొని తాగితే ఎంతో మంచిది. ఈ పొడిని వేసిన నీళ్లను 10 నిమిషాలు మరగబెట్టి అందులో నిమ్మరసం, తేనె కలుపుకొని తాగితే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.
. కొండల మధ్య దొరికే ఈ దుంపకు ప్రజల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పరిమాణంలో పొడవుగా ఉండే ఈ దుంప భూమిలో 10- నుంచి 15 మీటర్ల లోతులో పెరుగుతుంది. ఈ దుంప బెరడు లేతవర్ణంలో ఉండి, రుచికి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయాలే ఉంటుంది. ఎత్తైన కొండల్లో భూమి లోపల నుంచి సేకరించినది కాబట్టి ఎలాంటి రసాయనలు వాడరు. ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు. దీన్ని తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి రక్తం శుద్ధి అవుతుంది.
భూచక్ర గడ్డ ఆకు, పువ్వు, కాండం ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగించబడుతుంది. ఈ దుంపలో కాల్షియం, ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఇది కాకుండా ఈ పండు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు సందర్భాలలో కూడా తినవచ్చు. బరువు తగ్గడంలో భూచక్ర గడ్డ సహాయపడుతుంది. ఈ దుంపలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల చాలా సేపు పొట్ట నిండుగా ఉంటుంది. ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఫైబర్ జీవక్రియను వేగవంతం చేస్తుంది. కొవ్వును సులభంగా జీర్ణం చేస్తుంది. త్వరగా బరువును తగ్గిస్తుంది.
భూచక్ర గడ్డ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది విటమిన్ సి అదనపు ప్రయోజనాలను కలిగి ఉంది. అవసరమైన విటమిన్లు, ఖనిజాలతో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పనిచేస్తుంది. ఈ గడ్డ తినడం వల్ల శరీరంలో ఐరన్ లోపం తగ్గుతుంది. అలాగే హిమోగ్లోబిన్‌ని పెంచుతుంది. డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల, ఈ గడ్డ ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది. ఇది పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో ఎంతగానో సహకరిస్తుంది. తక్కువ కొలెస్ట్రాల్, సంతృప్త కొవ్వులతో గుండెకు మంచిది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది