Good Health: పొట్ట వల్ల ఇబ్బంది పడుతున్నారా.. అవి, ఇవి కాదు.. జస్ట్ మంచి నీళ్లు ఇలా తాగండి చాలు..

Good Health: పొట్ట వల్ల ఇబ్బంది పడుతున్నారా.. అవి, ఇవి కాదు.. జస్ట్ మంచి నీళ్లు ఇలా తాగండి చాలు..

వాటర్ థెరపీతో పొట్ట తగ్గుతుందంటే.. నమ్మడానికి అంత ఈజీగా లేదు కదా.. అవును పొట్ట తగ్గించుకోవడానికి వెల్ నెస్ సెంటర్ల చుట్టూ తిరిగి.. డైటీషియన్లు చెప్పినవి, ఇంటర్నెట్లో కనిపించిన ప్రతి పనికిమాలిన డైట్ ఫాలో అయ్యి విసిగిపోయినవారికి కేవలం వాటర్ థెరపీతో పొట్ట తగ్గుతుందంటే నమ్మడానికి మనసు ఒప్పుకోదు నిజమే.. కానీ.. ఇది ముమ్మాటికీ నిజం. జాపనీస్ వాటర్ థెరపీతో ఎంతటి బాన పొట్ట అయినా ఇట్టే కరిగిపోతుంది.

పొట్ట కరిగించడానికి జపనీస్ వాటర్ ఏమీ మెడిసిన్ కాదు. కానీ.. జపనీస్ సాంప్రదాయ చికిత్స విధానంలో వాటర్ థెరపీకి ప్రత్యేక స్థానం ఉంది. ఇది బడిలోని టాక్సిన్స్ ని క్లీన్ చేసి మెటబాలిజంను స్పీడప్ చేస్తుంది. ఇంకో విశేషం ఏంటంటే.. జపనీస్ వాటర్ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడి.. ఆహారం త్వరగా జీర్ణమయ్యి కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. ఇది బాడీని డిటాక్సిఫై చేసి బెల్లి అండ్ బ్యాక్ ఫ్యాట్ పెరగకుండా కాపాడుతుంది. 

ఈ నీటిని ఎప్పుడు, ఎలా తాగాలి:

జపనీస్ వాటర్ ని సరైన సమయంలో, సరైన పద్దతిలో తీసుకున్నప్పుడే దాని ప్రభావం కనిపిస్తుంది. ఉదయం నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో తాగడం అనేది బెస్ట్ ప్రాక్టీస్. దీనివల్ల నైట్ టైం మెటబాలిజం యాక్టివేట్ అయ్యి.. బాడీ టెంపరేచర్ బ్యాలెన్స్ అవుతుంది.
జపనీస్ వాటర్ బాడీ సరిగా గ్రహించాలంటే.. రిలాక్స్ గా కూర్చొని.. చిన్న చిన్న సిప్స్ గా తాగాలి. ఇలా రోజుకు రెండుసార్లు తాగొచ్చు. అయితే.. ఎప్పుడు తినడానికి ముందు తాగితేనే మంచిది.

Also Read : డేంజర్ బెల్స్ మోగిస్తున్న డి-విటమిన్ లోపం

జపనీస్ వాటర్ లో ఏముంది:

జపనీస్ వాటర్ లో స్పెషల్ ఇంగ్రిడిఎంట్స్ ఏమీ ఉండవు.. మనకు కావాల్సిందల్లా గోరువెచ్చని నీరు, సగం నిమ్మకాయ, కొన్ని దోసకాయ ముక్కలు, పుదీనా ఆకులు అంతే... కావాలనుకుంటే కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నిమ్మకాయ శరీరాన్ని ఆల్కలీన్ చేస్తుంది. దోసకాయ చల్లబరుస్తుంది... పుదీనా కడుపుకు ఉపశమనం అందిస్తుంది. ఇవ్వన్నీ కలిపి తీసుకుంటే.. బాడీ డిటాక్సిఫై అయ్యి కొవ్వు కరగడం ప్రారంభం అవుతుంది. ఇది సమ్మర్ కి బెస్ట్ డ్రింక్ అని చెప్పచ్చు.

దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా:

జపనీస్ వాటర్ థెరపీ.. న్యాచురల్ ప్రాడక్ట్స్ తో తయారయ్యేది అయినప్పటికీ.. కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఈ నీటిని ఎక్కువగా తీసుకున్నా, వేడి చేయకుండా తీసుకున్నా కానీ కొంతమందిలో గ్యాస్, అసిడిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే గ్యాస్, అసిడిటీ వంటి లక్షణాలు ఉన్నవారు ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. ఇలాంటి లక్షణాలేవి లేకపోతే ఈ వాటర్ పూర్తిగా సేఫ్ అని చెప్పచ్చు.

ఎన్ని రోజులు తాగితే రిజల్ట్ ఉంటుంది:

ఈ వాటర్ ని రెగ్యులర్ గా తీసుకుంటే 7 నుంచి 10రోజుల్లో రిజల్ట్ కనిపించడం స్టార్ట్ అవుతుంది.. కడుపులో లైట్ గా అనిపించడం.. ఉబ్బరం తగ్గడం, ఎనర్జీ లెవెల్స్ పెరగడం వంటి మార్పులు గమనించవచ్చు. ఈ వాటర్ తీసుకోవడంతో పాటు.. హెల్దీ ఫుడ్ తీసుకుంటూ.. మంచిగా నిద్రపోతే.. 2 లేదా 3వారాల్లో బరువు తగ్గడాన్ని గమనిస్తారు. అయితే.. దీనివల్ల సడన్ గా రిజల్ట్ రాదు కానీ.. స్లోగా పర్మనెంట్ గా ఆరోగ్యకరమైన మార్గంలో రిజల్ట్ ఉంటుంది.