కళక్కడల్ అలలు అంటే ఏంటీ.... ఈ అలలు ఎలా ఏర్పడతాయి.. సునామీ, ఉప్పెనలా ఉంటాయా..?

దేశం మొత్తం ఇప్పుడు కళక్కడల్ సముద్ర అలలు గురించే చర్చించుకుంటుంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని సముద్ర తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయటంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యింది. ఇంతకీ కళక్కడల్ అలలు అంటే ఏంటీ.. ఎప్పుడు.. ఎందుకు.. ఎలా వస్తాయో తెలుసుకుందామా..

కళక్కడల్ అలలను దొంగ అలలు అని కూడా అంటారు.. అంటే చడీచప్పుడు లేకుండా.. హఠాత్తుగా ఎటాక్ చేయటం అన్నమాట.. ఊహించని విధంగా సముద్రంలో మార్పుల వల్ల.. సముద్రం పోటెత్తటం. అందుకే వీటిని దొంగ అలలు అని కూడా.. స్థానిక మత్స్యకారులు పిలుస్తుంటారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వీటిని కళక్కడల్ అలలు అంటారు. 

కళక్కడల్ అలలు ఎలా ఏర్పడతాయి అనేది చూద్దాం. సముద్రంలో విపరీతమైన గాలులు, ఆ గాలులు వేడిగా ఉండటం.. అదే విధంలో సుడిగుండాలు ఏర్పడటం వల్ల కళక్కడల్ అలలు వస్తాయి. సముద్రం మధ్యలో ఏర్పడే ఇవి.. తీరం వైపు అత్యంత వేగంగా దూసుకొస్తాయి. తుఫాన్లు, వాయుగుండాల సమయంలో ఏర్పడే కన్ను కదిలే వేగం గంటకు 5 నుంచి 20 కిలోమీటర్ల వరకు ఉంటుంది. కళక్కడల్ అలలు వచ్చే సమయంలో ఆయా సుడిగుండాల వేగంగా చాలా ఎక్కువగా ఉంటుంది. వేడిగాలులతో కూడిన సుడిగుండాలు తీరం వైపు వేగంగా దూసుకొస్తాయి. ఆ సమయంలో తీరంలోని అలలు పోటెత్తుతాయి. మామూలు రోజుల్లో కంటే 2 నుంచి 3 మీటర్ల ఎత్తు వరకు కళక్కడల్ అలలు ఉంటాయి. అదే విధంగా సముద్రం అర కిలోమీటర్ నుంచి కిలోమీటర్ వరకు ముందుకు వస్తుంది. అది కూడా ఉప్పెనలా విరుచుకుపడుతుంది. అయితే ఇవి ఏ ప్రాంతంలో.. ఎక్కడ తీరాన్ని తాకుతాయి అనేది కచ్చితంగా ఎవరూ చెప్పలేరు.. అందుకే వీటిని దొంగ అలలు అంటారు. అందుకే కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. 

ALSO READ | కేరళ, తమిళనాడుకు కల్లక్కడల్‌ ముప్పు.. తీరంలో అలల ఉగ్రరూపం

కళక్కడల్ అలలు ఎంత వేగంగా తీరం వైపు వస్తాయి.. అంతే వేగంగా వెనక్కి వెళ్లిపోతాయి. కాకపోతే తీరంలోని అన్నింటినీ ఊడ్చేస్తుంది. బలమైన వేడిగాలులతో కూడిన సుడిగుండాలు కావటంతో.. వాటి ఉధృతి కూడా అంతేస్థాయిలో ఉంటుంది తీరంలో.. అందుకే తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసింది కేంద్ర ప్రభుత్వం. తీరంలోని జనం దూర ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరిస్తుంది. ఇప్పుడు తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ఈ కళక్కడల్.. దొంగ అలలు ఎఫెక్ట్ ఉంది.

ఈ అలలపై తీర ప్రాంతంలోని ప్రజలు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. ఇలాంటివి చాలా చూశాం.. పౌర్ణమి, అమావాస్యలకు చూస్తూనే ఉంటాం.. కాకపోతే ఈసారి ఎక్కువగా వస్తాయి అంతే అంటుున్నారు. కేంద్రం మాత్రం హెచ్చరికలు చేస్తూనే ఉంది. కళక్కడల్ అలల తీవ్రత ఈసారి ఎక్కువగానే ఉండొచ్చని అప్రమత్తం చేస్తుంది.