![ఆధ్యాత్మికం.. మమకారం..మాయ అంటే ఏమిటి.. రామకృష్ణ పరమహంస వివరణ ఇదే..](https://static.v6velugu.com/uploads/2025/02/what-is-love-and-illusion-description-of-rama-krishna-paramahamsa_6BjEGN2wqA.jpg)
హైటెక్ యుగంలో జనాలు సంపాదనపై ఉన్న దృష్టి దేనిపై పెట్టడం లేదు. తన కోసం.. బిడ్డల కోసం.. వారి బిడ్డల కోసం.. వాళ్ల వాళ్ల సంతానం కోసం సంపాదిచండం కోసం మాయ అనే భ్రమలో పడుతున్నారు. మాయ అన్నింటిని కప్పేస్తుంది. తరువాత కొంత కాలానికి మాయ అనే భ్రమ మాయమవుతుంది.
ప్రస్తుతం మానవాళికి వారి బిడ్డల కోసం ఎంత సంపద కూడబెట్టినా.. కోరిక తీరడం లేదు.. అలా రెక్కులు.. ముక్కులు చేసుకుని సంపాదించి.. ఒకానొక రోజు శరీరంలో శక్తి ఉడికిపోయి ముంచానపడ్డప్పుడు ఎవరికోసమైతే ఈ తనువును గుల్ల చేసుకొని సంపాదించామో ... వాళ్లు ఏ మాత్రం పట్టించుకోకపోతే బాధపడతారు.. ఏడుస్తారు. అదే మాయ.
ఎవరికి వారే.. ప్రేమ.. మోహం.. ఆవవేశాలతో పెంచుకుంటున్న మమకారాలు పెంచుకుంటున్నారు. వాస్తవానికి ఈ మమకారం మనల్ని మాయలో పడేస్తున్నాయి. అతి ప్రేమతో.. . అమాయకత్వంతో అసలు రహస్యాన్ని తెలుసుకోకుండా. సంసారంలో పీకల లోతు కూరుకుపోతున్నాం. అలాగని చుట్టూ ఉన్న జనాన్ని చీదరించుకొమ్మని కాదు... వారిని ప్రేమించొద్దని కాదు..
Also Read :- డబ్బు సంపాదిస్తున్నంత వరకే నీకు విలువ
కానీ... వారికీ.. మనకూ శాశ్వతానుబంధం ఉందనే భ్రమలో మాత్రం ఉండకూదదు. వారే లోకమని భావించకూడదు. భార్యాపిల్లలు. తల్లిదండ్రులు అందరితో కలిసి మెలిసి ఉండాలి. అందరికీ సేవ చేస్తూ.. అత్యంత ఆత్మీయునిగా వారి పట్ల ప్రవర్తించాలి. కానీ, మనసులో మాత్రం వీరెవ్వరూ నీవారు కారనే నిజం తెలుసుకొని మసలుకోవాలి.
భగవంతుని పట్ల భక్తిని అలవరుచుకోకుండా సంసారంలో దిగావంటే ఇంకా బంధాల్లో ఇరుక్కుంటావు.. ఇలా అప్రమత్తంగా ఉండటమే జీవనదర్శం! దురదృష్టవశాత్తూ మనలో అంతటి వివేకం పొడసూపడం లేదు. ఆపద, దుఃఖం శోకాలు ఎదురైనప్పుడు దైర్యాన్ని కోల్పోతావని అనేవారు రామకృష్ణ పరమహంస అన్నారు.అందుకే మనసును ఈ బంధాలకు మించిన మరోప్రపంచం వైపు.. నడిపించాలి. ఎవరికి వారే అయిన ఈ లోకంలో ఎవరికోసం ఇన్ని తిప్పలు పడుతున్నామో ప్రశ్నించుకోవాలి.
-వెలుగు, లైఫ్–