42 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటే మోదీకి ఏంటి సమస్య..? ఢిల్లీ బీసీ పోరు గర్జనలో సీఎం రేవంత్

42 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటే మోదీకి ఏంటి సమస్య..? ఢిల్లీ బీసీ పోరు గర్జనలో సీఎం రేవంత్

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటే మోదీకి ఏంటి సమస్య అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ పోరు గర్జన మహా ధర్నాలో పాల్గొన్న సీఎం.. ఈ సందర్భంగా కీలక వ్యాక్యలు చేశారు. రిజర్వేషన్లు గుజరాత్ లో అడగలేదని, ఢిల్లీలో కుర్చీ అడగలేని బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయాలంటే ప్రధాని మోదీ ఎందుకు మద్ధతు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుందనే జనగణన చేయటం లేదని ఆరోపించారు. 

ఈ సందర్భంగా సీఎం రేవంత్ కామెంట్స్:

  • భారత్ జోడో యాత్ర చేసి దేశ ప్రజల సమస్యలు  రాహుల్ గాంధీ చూశారు
  • తమ వాటా తేల్చాలని బహుజనులు ఆయనను అడిగారు
  • అందుకే వాటా తేల్చేందుకు కులగణన చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది
  • ఏ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రంలో కులగణన చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు
  • దేశంలో అధికారంలోకి వచ్చీ..జనగణనలో కులగణన చేసి దేశ వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తాం
  •  అందుకే నా మీద ఎంత ఒత్తిడి ఉన్నా కులగణన చేసి తీరాం
  • బీసీలకు రిజర్వేషన్ లు ఇవ్వాలంటే మీ లెక్క ఎంతో తెలియదు అని కోర్టులు అన్నాయి
  • అందుకే లెక్కలు తేల్చాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.
  • కులగణన చేసి, బీసీ బిల్లును ఫిబ్రవరి 4 తేదీన అసెంబ్లీ తీర్మానం చేశాం.
  • అందుకే సోషల్ జస్టిస్ డేగా ఫిబ్రవరి 4ను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
  • బీసీలది ధర్మమైన కోరిక.. దాన్ని పార్టీలు అమలు చేయాలి
  • ఆనాడు మొరార్జీ దేశాయ్ మండల్ కమిషన్ ఏర్పాటు చేశారు
  • ఆ కమిషన్ 27 శాతం రిజర్వేషన్ ఇయ్యాలని సూచించింది
  •  వీపీ సింగ్ అమలు చేస్తామంటే వ్యతిరేకంగా జనతా పార్టీ కమండల్ ఉద్యమాన్ని తెచ్చి అడ్డుకునే ప్రయత్నం చేసింది
  • ఆ జనతా పార్టీ నుంచి వచ్చిన ప్రతినిధే ఈ ప్రధాని మోదీ
  • బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుందని, కులగణన చేయాల్సి వస్తుందని బీజేపీ ప్రభుత్వం 2021 జనాభా లెక్కలను చేయలేదు
  • బీజేపీ కుట్ర చేసి జనగణన ను వాయిదా వేస్తోంది
  • ఇది బహుజనుల సమస్య.. ఏకమై లెక్కలు తేల్చితేనే తప్ప ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లు పెరగవు
  • రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చేసి 56.3 శాతం బలహీన వర్గాల లెక్కలు తెలంగాణ ప్రభుత్వం తేల్చింది
  • దేశానికి దిక్సూచిగా మొదటిసారి 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది
  • ప్రభుత్వ పరిపాలన, అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం
  • రిజర్వేషన్ల అమలు కేంద్ర ప్రభుత్వ పరిధి.. అందుకే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం 
  • అయిననూ పోయి రావలెను హస్తినకూ అని మహాభారత యుద్ధ సమయంలో పెద్దలు చెప్పారు
  • అందుకే అయిననూ హస్తినకు వచ్చితిమి..
  • బీసీ రిజర్వేషన్లకు అనుమతి ఇస్తే తెలంగాణలో 10 లక్షల మందితో సన్మానం చేస్తాం
  • కానీ ఎందుకు బీసీ రిజర్వేషన్లకు ఆమోదం ఇవ్వడం లేదు
  • చట్టం, అధికారం ఉంది కదా అని మా మీద ఆదిపత్యం చలాయించాలని చూస్తే ఊరుకోం
  • ఢిల్లీలోనే ఎప్పుడూ ఉండరు.. మళ్లీ గల్లికి వస్తారు.. మాకు దొరుకుతారు. 
  • మా దగ్గర లెక్క తేలింది.. మాకు అనుమతి ఇవ్వండి మోదీ గారు అంటే.. ఆయన పట్టించుకోవడం లేదు
  •