డిజిటల్ మోసాలను నిరోధించేందుకు RBI కొత్త AI మోడల్ లను అందుబాటులో తెచ్చింది. ఆన్ లైన్ ఫ్రాడ్స్ ను అరికట్టేందుకు RBI AI/ML-ఆధారిత మోడల్ MuleHunter.AIని ప్రవేశపెట్టింది. ఈ ఎక్విప్ మెంట్ మ్యూల్ ఖాతాలకు చెక్ పెట్టే లక్ష్యంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను తీసుకొచ్చింది.
MuleHunter.AI ఎలా పనిచేస్తుందంటే..
ఇటీవల కాలంలో మ్యూల్ ఖాతాలు బాగా పెరిగి పోయాయి. మనీలాండరింగ్ లేదా అక్రమ మనీ ట్రాన్స్ ఫర్ చేయడానికి ఈ ఖాతాలను వాడుతున్నారు. తమ అక్రమ వ్యాపారాలు, మనీలాండరింగ్, మనీ ట్రాన్స్ ఫర్లు సులభతరం చేసేందుకు ఈ మ్యూల్ ఖాతాలను ఉపయోగిస్తున్నారు ఫ్రాడ్ స్టర్లు. వీటిపై దృష్టి సారించిన ఆర్బీఐ వీటికి చెక్ పెట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ MuleHunter.AI ని ప్రవేశపెట్టింది.
Also Read :- నైట్ ఛార్జింగ్ పెట్టి పడుకోవడం, వైఫై ఆన్ చేసి అంతే ఉంచడం
మనీలాండరింగ్ లేదా నిధుల ఫ్రాడ్ మనీ ట్రాన్స్ ఫర్ చేయడానికి నేరస్థులు ఉపయోగించే బ్యాంకు ఖాతాలను గుర్తించి అటువంటి ఖాతాలను తొలగించేందుకు MuleHunter.AI తొలగిస్తుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం( డిసెంబర్ 6) MPC మీటింగ్ లో ప్రకటించారు.