Good Health : నో వైట్ డైట్ అంటే ఏంటీ.. ఇవి తింటే షుగర్ తగ్గుతుందా.. షుగర్ రాదా..!

Good Health : నో వైట్ డైట్ అంటే ఏంటీ.. ఇవి తింటే షుగర్ తగ్గుతుందా.. షుగర్ రాదా..!

'నో వైట్ డైట్' ఇది ఎప్పటినుంచో పాపులర్ అయిన ఒక ఫేమస్ వెయిట్లాస్ టెక్నిక్. పేరుకు తగ్గట్టే ఇందులో వైట్ ఫుడ్స్ ఉండవు. అంటే తెల్లగా ఉండే చాలా ఫుడ్స్ ఈ డైట్ లో తినకూడదన్న మాట. ఇంకా ఈ డైట్లో ఉన్న ప్రత్యేకత లేంటంటే.. 

నో వైట్ డైట్లో లో  కొన్ని రకాల వైట్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి శరీరంలో షుగర్ లెవెల్స్ ను పెంచేచక్కెర పిండి పదార్థాలు లాంటివి ఈ డైట్ లో అస్సలు తినకూడదు. అలాగే ఇందులో దుంప జాతికి  చెందిన వెజిటబుల్స్ కు కూడా చోటు లేదు. తెలుపు రంగులో ఉన్నవి కాకుండా మిగతా అన్నిరకాల కాయగూరలు, పండ్లు తినొచ్చు. అయితే ఇందులో ఎగ్ వైట్, క్యాలీ ఫ్లవర్, పాలు లాంటివి మాత్రం కొద్ది మొత్తంలో తీసుకోవచ్చు. 

తెలుపు ఎందుకొద్దంటే.. 

మిగతా డైట్ లాగా 'అది తినకూడదు'. 'ఇది తినొచ్చు' అనే రూల్స్ తక్కువ. ఉన్నది ఒకటే రూల్. తెలుపు రంగులో ఉన్న ఫుడ్స్క. దూరంగా ఉండాలి. ఫుడ్ సైన్స్ ప్రకారం తెలుపు రంగు పదార్ధాలలో గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ వల్ల షుగర్ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే నో వైట్ డైట్ లో అచ్చంగా తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ కే ఇంపార్టెన్స్ ఇస్తారు. 

గ్లైసమిక్ ఇండెక్స్ అంటే... 

ఆహారం తిన్న తర్వాత అది ఎంత వేగంగా చక్కెరగా మారి రక్తంలో కలుస్తుందో తెలిపేదే గ్లైసమిక్ ఇండెక్స్, తిండి త్వరగా జీర్ణమై.. చక్కెరగా మారి, రక్తంలో కలిస్తే 'హైగ్లైసమిక్ ఇండెక్స్' అంటారు. ఈ ప్రాసెస్ స్లోగా జరిగితే 'లో-గ్లైసమిక్' ఇండెక్స్ అంటారు.  ఈ గ్లైసమిక్ ఇండెక్స్ పాయింట్లలో లెక్కిస్తారు. 'అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్' ప్రకారం మనం తినే ఫుడ్స్ లో    గ్లైసమిక్ ఇండెక్స్ 55 పాయింట్ల కంటే తక్కువ ఉంటే అవి 'లో- గ్లైసమిక్' ఫుడ్స్ కింద లెక్క. అదే 55 నుంచి 70 మధ్యలో ఉంటే 'మీడియం గ్లైసమిక్' అని, 70 కంటే ఎక్కువ ఉంటే 'హై గ్లైసమిక్ ఫుడ్స్ అని అంటారు నో వైట్ డైట్ ముఖ్యంగా షుగర్ను కంట్రోల్లో ఉంచడానికి, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. హై గ్లైసమిక్ ఫుడ్స్ తినడం వల్ల రక్తంలో షుగర్ శాతం పెరిగి డయాబెటిస్ ఉన్నవాళ్లకు సమస్యగా మారే ప్రమాదం ఉంది. అలాగే హై గ్లైసమిక్ ఫుడ్స్ వల్ల బరువు కూడా త్వరగా పెరుగుతారు. అందుకే నో వైట్ డైట్లో లో  తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ తింటూ... రక్తంలో చక్కెర శాతాన్ని, బరువును కంట్రోల్లో ఉంచుకోవచ్చు

తినాల్సినవి 

నో వైట్ డైట్ లో దుంప జాతికి చెందినవి తప్ప మిగతా కాయగూరలు, పండ్లు అన్నీ తినొచ్చు ఈ డైట్ లో వీలైనంత వరకూ ఫ్రెష్, పచ్చి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. సోడియం ఎక్కువగా ఉండే ఫుడ్స్ను కాస్త తగ్గించాలి. అలాగే ఇందులో సీఫుడ్. చికెన్, లీన్ మీట్ కూడా తినొచ్చు. అయితే ఇవి తిన్నప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా నట్స్, బీన్స్ లాంటివి కూడా తింటూ కొలెస్ట్రాల్ను. కంట్రోల్లో ఉంచుకోవాలి. ఈ డైట్లో  లో గోధుమలు, ఓట్స్, కాయగూరలు, పండ్లు లాంటి తక్కువ గ్లైసమిక్ ఉండే ఫుడ్స్ అన్నీ తినొచ్చు. అలాగే ఆల్మండ్స్, జీడిపప్పు, పంప్కిన్ గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ లాంటివి కూడా మంచివే. 

తినకూడనివి 


నో వైట్ డైట్ లో స్టార్చ్ ఎక్కువగా ఉండే ఫుడ్స అస్సలు తినకూడదు. పాలిష్ పట్టిన తెల్లటి అన్నం, ఇడ్లీలు, మైదా పిండి, రైస్ పాస్తా, చీజ్ లాంటి వాటిల్లో గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ డైట్ లో వీటికి దూరంగా ఉండాలి. ఏదైనా ప్యాక్డ్ ఫుడ్ లేదా పిండి పదార్ధాలు కొనేటప్పుడు వెనుక ఉన్న లేబుల్స్ను క్లియర్గా చదవాలి. స్టార్చ్ కంటెంట్ ఎక్కువగా ఉన్నవాటి జోలికి పోకూడదు. చక్కెర, తెల్లటి పిండి, కార్న్ సిరప్, పాస్తా, ఆలుగడ్డలు, బ్రెడ్. బేకింగ్ ప్రొడక్ట్స్, ఐస్ క్రీమ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ లో 'హై గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుంది. 

లాభాలివే 

ఈ డైట్ పాటించేటప్పుడు క్యాలరీలు నో వైట్ డైట్ లో దుంప జాతికి చెందినవి తప్ప మిగతా కాయగూరలు, పండ్లు అన్నీ తినొచ్చు. లెక్కించుకోవాల్సిన పనిలేదు. కేవలం స్టార్స్ ఉన్న పదార్థాలు తినకుండా ఉంటే సరిపోతుంది. ఈ డైట్ లో ఉన్నప్పుడు.. జంక్ ఫుడ్స్ అయిన కేక్స్, కుకీస్, బ్రెడ్, పాస్తా, ఐస్ క్రీమ్, పొటాటో చిప్స్ లాంటివి ఆటోమెటిక్ గా మానేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ డైట్ లో అన్నింటికంటే మంచి కార్బోహైడ్రేట్స్ శరీరానికి అందుతాయి. షుగర్ను కంట్రోల్లో  ఉంచుకోవడానికి, బరువు పెరగకుండా ఉండడానికి ఇదొక బెస్ట్ డైట్. తక్కువ సోడియం తీసుకోవడం వల్ల బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. 

నష్టాలివే .. 

ఈ డైట్ కు 'నో వైట్ డైట్' అని పేరుపెట్టడం వల్ల తెల్లగా ఉన్నవి ఏవీ తినకూడదేమో అని పొరబడే అవకాశం ఉంది. అందుకే ఈ డైట్ పాటించే చాలామంది పాలు, గుడ్డు లాంటి వాటిని కూడా తినకుండా ఉంటారు. దానివల్ల శరీరానికి కావల్సిన కొన్ని హెల్దీ ప్రొటీన్స్ అందవు. ఈ డైట్ లో కేవలం ఫుడ్ హ్యాబిట్స్ మాత్రమే ఉంటాయి. వ్యాయామం. యోగా లాంటి ఇతర బరువు తగ్గించే ఫ్యాక్టర్స్ ఇందులో లేవు.