ఒకే దేశం ఒకే సమయం: ఇక ఇండియన్​ స్టాండర్డ్​ టైం(ఐఎస్టీ) తప్పనిసరి

ఒకే దేశం ఒకే సమయం: ఇక ఇండియన్​ స్టాండర్డ్​ టైం(ఐఎస్టీ) తప్పనిసరి

దేశవ్యాప్తంగా ఒకే సమయాన్ని ప్రామాణీకరించే చర్యలో భాగంగా అన్ని రంగాల్లో భారత ప్రామాణిక సమయం (ఐఎస్​టీ) వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం ముసాయిదా నిబంధనలు రూపొందించింది. వీటిపై వచ్చే నెల 14 లోపు ప్రజలు తమ అభిప్రాయాలను తెలపాలని కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ కోరింది. 

ఇందుకోసం లీగల్ మెట్రోలజీ (ఇండియన్​ స్టాండర్డ్ టైం) రూల్స్​–2024లో చట్టపరమైన విధివిధానాలు ఏర్పాటు చేశారు. ఇవి అమల్లోకి వస్తే చట్ట, పాలన, వాణిజ్య, ఆర్థికరంగాలతోపాటు అధికారిక పత్రాల్లోనూ ఇక ఇండియన్​ స్టాండర్డ్​ టైం(ఐఎస్టీ) తప్పనిసరి. 

ALSO READ | పొలార్​ శాటిలైట్​ లాంచ్​ వెహికల్​.. ప్రత్యేక కథనం
    
ఈ చట్టంలోని ముసాయిదా నిబంధనల ప్రకారం ఐఎస్టీ కాకుండా ఇతర టైమ్​ జోన్లను(కాలమానాలను) ఉపయోగించడాన్ని నిషేధిస్తున్నట్లు అందులో స్పష్టం చేసింది. అంతరిక్షం, సముద్రయానం, శాస్త్రీయ పరిశోధన రంగాలకు మినహాయింపు ఇచ్చింది.