గుడ్ హెల్త్ ఈజ్ బిగ్గెస్ట్ వెల్త్ అంటారు పెద్దలు. ప్లానెటరీ హెల్త్ డైట్ వల్ల అది సాధ్యమని బ్రిటన్ శాస్త్రవేత్తలు తేల్చారు. అందరూ ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కానీ, ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. చాలామందికి ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారో తెలియదు. ఏది పడితే అది తినేస్తుంటారు. దాంతో అనారోగ్యం పాలవుతుంటారు. సరైన డైట్అంటే 'ప్లానెటరీ హెల్త్ డైట్' తప్పనిసరిగా పాటించాలని పరిశోధకులు చెప్తున్నారు.
ALSO READ : Good Health : ఇంట్లోనే ప్రొటీన్ పౌడర్ ఇలా తయారు చేసుకుందాం.. హార్లిక్స్, బోర్నవిటా కంటే ఎంతో బలం..!
ప్రతి ఒక్కరు సరైన సమయానికి సరైన ఆహారం తీసుకుంటే... ఏటా కోటి మరణాలకు పైగా నిరోధించవచ్చని ఇటీవల శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఈ పరిశోధనను లండన్ లోని బ్రిటన్ యూనివర్సిటీ చేసింది. మన ఆహారంలో పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు లాంటివి కచ్చితంగా ఉండాలని, మాంసాహారం, చక్కెరలు తగ్గించుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల జీవ వైవిధ్యం పరిరక్షించబడుతుందట. అంతేకాకుండా ఈ డైట్ పాటించడం వల్ల డయాబెటీస్, కొన్ని రకాల క్యాన్సర్ల బారిన పడకుండా ఉండొచ్చంటున్నారు పరిశోధకులు.
-వెలుగు, లైఫ్-