చంద్రబాబు అరెస్ట్.. ఇంతకీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ ఏంటీ?

చంద్రబాబు అరెస్ట్.. ఇంతకీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ ఏంటీ?

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబును  పోలీసులు అరెస్టు చేశారు.  నంద్యాలోని ఆర్‌.కె.ఫంక్షన్‌ హాల్‌ వద్ద ఆయన బస చేసిన బస్సు వద్దకు పోలీసులు చేరుకున్నారు. ఆయనతో మాట్లాడి అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసు ఎంటీ అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్నప్పుడు  2015లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో ప్రభుత్వం ఒప్పదం కుదుర్చుకుంది . రూ. 3 వేల 356 కోట్ల ఈ ప్రాజెక్టులో రూ. 371 కోట్లు దారి మళ్లాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో 2020లో ఇప్పటి వైసీపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 

2020 డిసెంబర్ 10న విజిలెన్స్, 2021 ఫిబ్రవరిలో ఏసీబీ విచారించింది. అనంతరం ఈ కేసు సీఐడీకి బదిలి అయింది.  ఈ అవినీతి కుంభకోణంలో ఏ1గా చంద్రబాబు పేరు, ఏ2గా అచ్చెన్నాయుడు ఉన్నట్లుగా సీఐడీ పేర్కొంది.  చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్‌ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద  కేసులు నమోదు చేశారు.