ఒత్తిళ్ళు లేనిదెవరికి? ఎంతో కొంత ఒత్తిడి అందరి మనస్సుల్లోనూ ఉంటుంది. నిజానికి అది అవసరం కూడా! ఒత్తిడి ఒక ఇంధనం లాంటిది. అసలు ఏ ఒత్తిడీ లేకపోతే మానవ జీవితంలో ఏ ప్రగతీ ఉండదు. ఇంధనం లేని వాహనంలా అతని గమనమే స్తంభించిపోతుంది. వాస్తవానికి ఒత్తిళ్ళను ఎదుర్కొనే కొద్దీ మానసిక శక్తి మరింత బలపడుతుంది.
ఒత్తిడి ఒక సవాలు లాంటిది. అలా సవాలుగా తీసుకునే వారికి ఒత్తిడి మంచే చేస్తుంది. కాకపోతే ఆ ఒత్తిడి ఒక పరిమితిలో ఉన్నంత వరకు సరే కానీ, ఆ పరిధి దాటిపోతేనే కొన్ని సమస్యలు మొదలవుతాయి. అలా పరిమితి దాటిపోవడానికి చాలాసార్లు మన ప్రణాళికలోనే ఏదో లోపం ఉంటుంది. మనం ఎంచుకునే మార్గంలోనే ఏదో లోపం ఉంటుంది. కానీ, దాన్ని మనలో చాలా మంది గుర్తించలేరు. ఎవరైనా దాన్ని గుర్తించినా అప్పటికే చాలా ఆలస్యమైపోతుంది.
అనంత శక్తి మనలోనే!: మనం ఒత్తిడికి గురి కావడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయి. ఒకటి మన శక్తిని తక్కువగా అంచనా వేసుకోవడం, లేదంటే మన శక్తికి మించిన కోరికలు కలిగి ఉండడం. ఒకవేళ నిజంగానే మన శక్తికి మించిన కోరికలు మనలో ఉంటే వాటిని వదిలేయడం తప్పనిసరి అవుతుంది.
లోపించడం వల్ల వచ్చినవే! అనుకున్నది సాధించుకోవడానికి మనిషి పగలూ రేయీ శ్రమిస్తున్నాడు. ఇది అతడిని ఎంతో ఒత్తిడికి గురి చేస్తోంది. నిజానికి మనం చేస్తున్న పని వల్ల మనకు ఆనందం కలిగితే దాని వల్ల ఎప్పుడూ ఒత్తిడి కలుగదు. అయితే, ఆ ఆనందం ఉన్నత లక్ష్యాల కోసం, ఉన్నత విలువల కోసం చేసే పనులలో మాత్రమే కలుగుతుంది.
అలా కాకుండా అపరిమితంగా కోరికలు, వ్యాపకాలు పెంచుకుంటూ పోతే అది ఒత్తిడినే నింపుతుంది. అది శరీరాన్నీ, మనస్సునూ దెబ్బ తీస్తుంది. అయినా దాన్ని మనం పట్టించుకోం. ఫలితంగా కొద్దిరోజుల్లో శరీరం, మనస్సు తమ చైతన్యాన్ని కోల్పోతాయి. అప్పుడు ఆశల సాధనలో సహకరించడం మానేస్తాయి.
మౌలికంగా మనిషి ఆనంద స్వరూపుడు. శాశ్వత ఆనందం శారీరక, భౌతిక విషయాల నుంచి రాదు. కానీ ఆధునిక మానవుడు ఆ సత్యాన్ని గమనించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ ఆనందం కోసం బయట వెతుకుతూ ఉన్నారు కానీ, నిజానికి అది ఉన్నది మనలోనే! ఒత్తిడి ఎక్కువగా పోటీతత్త్వం నుంచి వస్తుంది. అది ఆరోగ్యకరంగా ఉంటే నష్టమేమీ ఉండదు. కానీ, చాలాసార్లు అది అసూయ, ద్వేషాల మధ్య కాలిపోతోంది. ఎదుటి వారిని తనలో భాగమనుకునే ఆధ్యాత్మిక తత్త్వం లేకపోవడమే
మౌలికంగా మనిషిది ఆధ్యాత్మిక సంస్కృతి. భౌతిక ఇందుకు కారణం. అది అతని సంతోషాన్ని హరించి వేస్తుంది. విషయాలకు తక్కువ ప్రాధాన్యాన్నీ, ఆధ్యాత్మిక విషయాలకు ఎక్కువ ప్రాధాన్యాన్నీ ఇచ్చే సంస్కృతి. అదే మనల్ని క్రమశిక్షణలో నడిపిస్తుంది. ఈ క్రమశిక్షణను కోల్పోయినప్పుడే మనిషికి దేని మీదా అదుపు ఉండదు. నేడు మనిషి ఎదుర్కొంటున్న సమస్యల్లో చాలావరకు ఈ క్రమశిక్షణ
వాస్తవానికి సంతోషంగా లేని వారే ప్రతి పనిలోనూ ఒత్తిడికి గురవుతుంటారు. మనస్సులోసంతోషమే ఉంటే అది ఎన్ని ఒత్తిళ్ళనైనాఅధిగమించేలా చేస్తుంది. ఒత్తిడి దశలు వేరు కావచ్చు కానీ, అసలే ఒత్తిడి లేని వారంటూ ఎవరూ ఉండరు. కాకపోతేఒత్తిడిని సానుకూలంగాచూస్తున్నారా, లేక ప్రతికూలంగాచూస్తున్నారా అన్నది ముఖ్యం. సమాజం నుంచి మనల్ని మనం విడదీసుకుని చూసుకోవడం కూడా ఈ ఒత్తిడికి కారణం. ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ మనిషి మానసికంగా ఇతరులతో కలిసిపోతాడు. అప్పుడు ఇతరుల కష్టాలే కాదు, ఇతరుల ఆనందాలూ తనవవుతాయి. అలా అతని పరిధి పెరుగుతుంది. ఇది మానసిక ఒత్తిళ్ళను అధిగమించేలా చేస్తుంది.
మానసిక ఒత్తిళ్ళ విలువలను సరిగ్గా అంచనా వేయడం వల్ల కూడా వాటిని అధిగమించే శక్తి వస్తుంది. ఇప్పుడున్న ఈ కాస్త మెరుగైన స్థితికి ఒకప్పుడు మనం ఎదుర్కొన్న ఒత్తిళ్ళే కారణమని గ్రహిస్తే చాలు. ఇప్పుడున్న ఒత్తిళ్ళను మనం సానుకూలంగా తీసుకునే శక్తి వచ్చేస్తుంది.
హృదయం సంకుచితమైతే ప్రతిదీ బాధిస్తుంది. విశాలమైతే అదే ఆనందాన్నిస్తుంది. అలా హృదయాన్ని విశాలం చేసే తత్త్వం ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల కలుగుతుంది. అందరి నుంచీ తాను విడి పోకుండా అందరిలో తానూ కలిసిపోయే వేళ ఏదీ ప్రత్యేకంగా అతణ్ణి తాకదు. అందరి కష్టాలూ తన కష్టాలవుతాయి. అందరి సంతోషాలూ తన సంతోషాలవుతాయి. భిన్నత్వంలోనే ఏకత్వం అతనికి బోధపడుతుంది. అందరి నుంచి విడిపోతే, ఒక చిన్న సమస్య కూడా కొండంతలా కనిపిస్తుంది. అందరితో కలిసిపోతే ఎంత పెద్ద సమస్య అయినా చిన్నదై పోతుంది.
పంచభూతాలతో తయారైన మనిషిలో అనంతమైన శక్తి ఉంది. ఆ శక్తిని గుర్తించలేని వారే ఆత్మన్యూనతా భావానికి గురవుతారు, వారికి ప్రతి పనీ ఎంతో భారంగా కనిపిస్తుంది. కొందరిలో చేస్తున్న పని మీద అనిష్టం కూడా మానసిక ఒత్తిడికి కారణం కావచ్చు. ఎంతటి పనినైనా చేసేయగలనన్న ఆత్మ విశ్వాసంతో ఉండడం అన్నిటి కన్నా ముఖ్యం. అప్పుడు ఒత్తిడిని ఒక సవాలుగా, ఒక గొప్ప అవకాశంగా తీసుకునే స్థితికి మనస్సు చేరుకుంటుంది. ఒత్తిడి మీద విజయం సిద్ధిస్తుంది.