ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తే మనకేంటి లాభం..? లోన్లు, EMI లు తగ్గుతాయా.. పెరుగుతాయా?

ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తే మనకేంటి లాభం..? లోన్లు, EMI లు తగ్గుతాయా.. పెరుగుతాయా?

ఇవాళ (ఫిబ్రవరి 7) ఆర్బీఐ (Reserve Bank of India) మానెటరీ పాలసీ ఉంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్ర ఇవాళ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తారని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆర్థికమంత్రిత్వ శాఖ కూడా రేట్ కట్స్ అంశాన్ని గవర్నర్ నిర్ణయానికే వదిలేసినట్లు తెలిపింది. 

వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తే రెపో రేట్లు 6.5% నుంచి 6.25%కు తగ్గనున్నాయి. ఎకానమీ మందగిస్తున్న క్రమంలో కన్జంప్షన్ పెంచేందుకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకోనున్నారు. రెపో రేట్లు అంటే బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే లోన్లపై వడ్డీ రేట్లు. 

సామాన్యుడికి ఏం లాభం..?

తక్కువ వడ్డీకే లోన్లు:

రెపో రేట్లు తగ్గడం వలన బ్యాంకులకు తక్కువ వడ్డీకే ఆర్బీఐ నుంచి రుణాలు(లోన్లు) అందుతాయి. దీంతో బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే లోన్లపైన వడ్డీలు తగ్గించనున్నాయి. పర్సనల్ లోన్లు, హోమ్, వెహికిల్ లోన్లపై వడ్డీలు తగ్గనున్నాయి. దీంతో ప్రజల వినియోగం పెరగడం, కొనుగోలు శక్తి పెరగడం, పెట్టుబడి పెరగడం జరుగుతుంది. ఇది ఎకానమీని బూస్ట్ చేస్తుంది.

తగ్గనున్న ఈఎమ్ఐలు(EMI): 

ఆర్బీఐ రేట్ కట్స్ ద్వారా ఇప్పటి వరకు ఉన్న నెలవారీ ఈఎమ్ఐ లు కాస్త తగ్గుతాయి. దీంతో కామన్ మ్యాన్ కు ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది.

ఫిక్స్ డ్ డిపాజిట్లు, సేవింగ్ అకౌంట్లు:

ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించడం వలన ఫిక్స్ డ్ డిపాజిట్లు చేసే వారికి కొంత నెగెటివ్ న్యూస్ అని చెప్పవచ్చు. కస్టమర్లకు ఇచ్చే వడ్డీలను బ్యాంకర్లు తగ్గిస్తాయి. దీంతో సేవింగ్స్ పైన, ఫిక్స్ డ్ డిపాజిట్లపైన వచ్చే ఆదాయం తగ్గుతుంది. 

అదుపులోకి ద్రవ్యోల్బణం (inflation) : 

ఆర్బీఐ రేట్ కట్స్ వలన ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది. వడ్డీ రేట్లు తగ్గడం వలన వినియోగం పెరగడం, జనాలకు ఖర్చు చేసే సామర్థ్యం పెరగడం జరుగుతుంది. అదేవిధంగా వస్తు సేవలు కూడా తక్కువ ధరలకు అందుబాటులోకి వస్తాయి. 

స్టాక్ మార్కెట్ పై ప్రభావం:

ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించడం స్టాక్ మార్కెట్లకు మంచి న్యూస్ అని చెప్పవచ్చు. మార్కెట్లు బుల్లిష్ ట్రెండ్ లోకి వచ్చే చాన్స్ ఉంటుంది. లాభాల పట్టే అవకాశం ఉంటుంది.