ప్రేమించడం చాలా ఈజీ. కానీ, జీవితాంతం వాళ్లతో అన్యోన్యంగా, స్నేహంగా ఉండటమే చాలా కష్టం అలా ఉండాలంటే.. దానికి ఎమోషనల్ సేఫ్టీ కావాలి. పిచ్చిగా ప్రేమించినా... ఎమోషనల్ గా క్లోజ్ గా ఫీల్ కాననప్పుడు ఆ బంధం నిలబడుతుందా? అంటే.. వాళ్ళు కొంతకాలం కలిసి ఉన్నా.. చివరికి నిరాశే మిగులుతుంది. కాబట్టి ఎమోషనల్ సేఫ్టీ' రహస్యాన్ని చేధించాల్సిందే!
ఇద్దరు కలిసి ఉండటానికి ఏం కావాలి.. మంచి ఇల్లు సకల సౌకర్యాలు ఉంటే సరిపోతాయా? ఎవరినడిగినా సరిపోవు! దానికన్నా ముందు వాళ్లిద్దరి మధ్య ప్రేమ ఉండాలి' అని చెప్పేస్తారు. నిజమే కానీ కేవలం ప్రేమ ఉంటే సరిపోదు హృదయంలో ఫీలయ్యే ప్రేసుకూ, అనుభవంలోకి వచ్చే ఎమోషన్స్ కు మధ్య తేడా ఉంటుంది. ఎంత పిచ్చిగా ప్రేమించినా రిలేషన్స్ సక్సెస్ ఫుల్ గా కొనసాగాలంటే ఇద్దరి మధ్యలో 'నమ్మకం' ఎమోషనల్ సేఫ్టీ' ఫీలింగ్స్ కచ్చితంగా ఉండాలి. అన్యోనమైన బంధానికి 'ఎమోషనల్ సేఫ్టీ' అనేది పునాది లాంటిది. పార్ట్నర్స్ ఇద్దరి మధ్య ఎమోషనల్ కనెక్షన్ ఉండాలి. ఇద్దరూ 'ఎమోషనల్ సేఫ్టీ' కాగలిగినప్పుడే అది 'జెస్ట్ రిలేషన్ షిప్ 'గా పేరు తెచ్చుకుంటుంది.
Also Read:- పిల్లలు మిమ్మల్ని సతాయిస్తున్నారా
ఎమోషనల్ సేఫ్టీ అంటే...
బాధ, భయం, కోషం, సంతోషం, నమ్మకం.. ఇలా మనిషిలో రకరకాల ఎమోషన్స్ ఉంటాయి. సందర్భాన్ని బట్టి అవి బయటపడుతుంటాయి. ఎప్పుడైతే.. ఈ ఎమోషన్స్ అన్నిటిని తన పార్ట్ నర్స్ అర్ధం చేసుకుంటారో. .. అప్పుడే ఎమోషనల్‌గా సేఫ్ గా ఫీల్ అవుతారు. అప్పుడు ఆ వ్యక్తితో లోలోపల రిలాక్స్ గా ఉంటారు. మాట్లాడేటప్పుడు తమ రక్షణ కవచాలు తీసి మాట్లాడతారు. విశ్వాసంగా.. ఫ్రీగా ఫీలవుతారు. ఇందులో తమని బాధించిన విషయాల్ని, అసంతృప్తి కలిగించే విషయాల్నే కాకుండా విమర్శల తాలుకు ఎమోషన్స్‌ని కూడా గౌరవిస్తారు.
ఈ నాలుగు ఉంటే..
పెళ్లితో ఒక్కటైన బంధం సక్సెస్ కావాలంటే ఏంకావాలి? ఈ టాపిక్ మీద రీసెర్చ్ చేసిన జాన్ గాట్ మన్ రీసెర్చ్ ప్రకారం.. ముఖ్యంగా నాలుగు అంశాలు రిలేషన్ షిప్ ని ప్రభావితం చేస్తాయి అంటాడాయన. వీటిని సరిగ్గా వీటి చేయకపోవడం వల్లే చిక్కుల్లో పడతారని, ఆయన చెప్పాడు. ఆత్మరక్షణ, విమర్శ, తిరస్కారం ఎంత అడిగినా సమాధానం చెప్పకపోవడం బ్లేమ్ చేయడం, అవమానించడం, రిజెక్ట్ చేయడం లాంటి బాధతో కూడిన పీలింగ్స్ ని ఎదుర్కొవడానికి ఆత్మరక్షణలో పడతారు. కంటికి కనపడని ఆ గోడ గుండెను సున్నితంగా, ఓపెన్ గా ఉంచడానికి అనుమతించదు. "సేఫ్ గా లేము' అనే ఫీలింగ్ వచ్చినప్పుడు తమని తాము రక్షించుకోవడానికి మనను చాలాదారుల్ని వెతుకుతుంది. తమకు తాము ఒక కవచాన్ని ఏర్పరుచుకొని, తన పార్ట్నర్ కి దూరంగా ఉండటం మొదలు పెడతారు. కేవలం పార్ట్నర్ తోనే కాదు.. ఎదుటి వాళ్లను కూడా విమర్శిస్తారు. తమతో పాటు, ఎదుటి వాళ్ల పట్ల కూడా కఠినంగా మారుతారు. ఏం అడిగినా చెప్పరు. ..ఎమోషనల్ సేఫ్టీ లేనప్పుడు ఈ నాలుగు అంశాల చుట్టే మనసు పరుగులు తీస్తుంది.
సేఫ్ ఫీలింగ్
పార్ట్నర్ తో ఎప్పుడు సేఫ్ గా ఫీల్ అవుతారో అప్పుడు ఆత్మరక్షణలో పడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అన్ని ఎమోషన్స్ కు అక్కడ గౌరవం ఉంటుంది. తన పార్ట్నర్ గౌరవంతో ట్రీట్ చేసినప్పుడు లోలోపల రిలాక్స్ అవుతారు. "నిజంగా నేనేంటో తనకు తెలుసు. నేను చెప్పింది విని అర్థం చేసుకుంటారు. కొంచెం కోప్పడినా.. వాళ్లతోనే రిలాక్స్ అవుతాం' అనుకున్నప్పుడు వాళ్ల మధ్య నమ్మకం, అన్యోన్యత ఇంకా ఇంకా పెరుగుతుంది. నమ్మకం ఉన్నచోట సెల్ఫ్ డిఫెన్స్ ఉండదు. మనం ఏం కోరుకుంటామో. ..ముందుగా దాన్ని ఎదుటి వాళ్లకు ఇవ్వడం వల్ల ఆ బంధం బలపడుతుందని గుర్తుంచుకోవాలి.
ప్రేమ పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడాన్ని కోరుకుంటుంది. తన పార్ట్నర్ ప్రపంచం వైపు తనని తాను విస్తరించుకుంటూ ఉంటుంది. వాళ్లు ఎమోషనల్ గా సేఫ్ గా ఫీల్ అయ్యేలా చేస్తుంది. అప్పుడు అన్యోన్యతని ఎంజాయ్ చేస్తారు. దీన్ని ఇండిపెండెడ్ లవ్' అంటారు.ఈ లవ్‌కి తమ మీద తమకు అవగాహన కలిగినవాళ్లు... ఇద్దరు ఇండిపెండెడ్ పార్ట్నర్స్ ఉంటే సరిపోతుంది. వీళ్లు తమతో పాటు తన పార్ట్నర్ పట్ల ఎమోషనల్‌గా నిజాయితీగా ఉంటారు.
హింస ఉండదు
తమని మోసం చేసే వాళ్లలో ఎప్పటికీ సేఫ్‌గా పీల్ కాలేరు. వాళ్ల చేతలు అనుకూలంగా లేనప్పుడు నిజం చెప్పలేనప్పుడు వాళ్ల సమక్షంలో సేఫ్ గా ఉండలేరు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ పర్ఫెక్ట్ గా ఉండరనేది నిజం. కానీ మన లోపాల్ని వదిలిపెట్టి ఎదుటి వాళ్ల లోపాలు, తెలుసుకోవడం చాలా ఈజీ. బెస్ట్ రిలేషన్ షిన్ అని పేరు పడ్డా... లోపాలు వెతికినప్పుడు ఇది నమ్మకాన్ని దెబ్బ తీస్తుంది. ఎమోషనల్ సేఫ్టీ ఇద్దిరినీ ఎప్పటికప్పుడు కలుపు తుంది. ఎలాంటి అడ్డంకులు వచ్చినా.. ఇద్దరూ కూర్చోని మాట్లాడుకుంటారు తప్పా... హింసతో కూడిన గొడవకు దిగరు . అంటే ఎమోషనల్ సేఫ్టీ ఉన్న చోట హింసకు తాపు ఉండదు. అయితే ఎమోషనల్ గా ... సేఫ్ గా ఫీల్ కాకపోవడానికి ఒక్కోసారి గత రిలేషన్ షిప్ అనుభవాలు కూడా కారణం కావొచ్చు... లేదా ఫ్యామిలీలో కూడా అంతకుముందు ఉన్న రిలేషన్ షిప్స్ అసుభవాలూ భయపెట్టొచ్చు. అయితే... నిజమైన పీలింగ్స్ ని తన పార్ట్నర్ ముందు బయట పెట్టినప్పుడు మాత్రమే 'ఎమోషన్ సేఫ్టీ ఫీల్ అవుతున్నామా? లేదా? అని తెలిసొస్తుంది!
అలాంటప్పుడు జీవితం ఇంకా ఉన్నతంగా మారుతుంది. జీవితం విలువ మరింత పెరుగుతుంది. వాళ్లతో ఉండే మెంటల్కనెక్షన్... మనం ఎలా ఉన్నామో అలాగేవాళ్లు అంగీకరించారని ఫీల్ అయ్యేలా చేస్తుంది. వాళ్ల ముందు విమర్శ రిజెక్షన్ లాంటి భయాలేం లేకుండా సున్నితమైన ఫీలింగ్స్ ని... కోరికల్ని ఎక్స్ ప్రెస్ చేయగలుగుతారు.
-వెలుగు, లైఫ్–