జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుట్టు మచ్చలకు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. పుట్టు మచ్చల ప్రకారం అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష్య పండితులు అంటూ ఉంటారు. పుట్టు మచ్చ ఉన్న ప్రదేశానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పుట్టు మచ్చలు.. మనిషి వ్యక్తిత్వం, భవిష్యత్తు గురించిన సమాచారాన్ని చెప్తాయని అంటూంటారు. మరి పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటే అదృష్టమో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మందికి పెదవులపై పుట్టు మచ్చలు ఉంటాయి. పై పెదవి బయట అంచుపై పుట్టు మచ్చ ఉంటే శుభ ప్రదంగా చెబుతూ ఉంటారు. కానీ కింద పెదవిపై పుట్టు మచ్చ ఉండటం అంత మంచిది కాదని అంటూ ఉంటారు. ఇది చెడు అలవాట్లను సూచిస్తుందట.
అదే విధంగా కుడి అర చేతిలో పుట్టు మచ్చ ఉండటం కూడా చాలా శుభ ప్రదంగా భావిస్తారు. కుడి చేతిలో పుట్టు మచ్చ ఉంటే సంపన్నమైన, విజయవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఇలా వారు డబ్బును ఎక్కువగా సంపాదిస్తారు. విజయం వైపు దూసుకెళ్తారు.
ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. చెవి లోపల, వెలుపల బాగంలో పుట్టు మచ్చ ఉంటే.. ఇది విలాసాల కోరికను సూచిస్తుంది. అదే విధంగా డబ్బును కూడా ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఈ భాగంలో పుట్టు మచ్చ ఉండటం అదృష్టంగా భావించినా.. వీరు డబ్బును మాత్రం ఎక్కువగా ఖర్చు చేస్తారు.
మగవారు తమ కుడివైపు శరీర భాగాలపై పుట్టుమచ్చలు కలిగివుంటే అదృష్టమని పండితులు చెబుతున్నారు. అదే మహిళలైతే... ఎడమవైపు శరీరంపై పుట్టుమచ్చలు కలిగివుంటే మేలు అంటున్నారు.
ఓ వ్యక్తి శరీరంపై 12 కంటే ఎక్కువ పుట్టుమచ్చలు ఉంటే... అది చెడు సంకేతాలకు గుర్తు అని చెబుతున్నారు. వారి జీవితంలో ఆనందం, మనస్శాంతి ఉండవని అంటున్నారు.
కుడి కనుబొమ్మపై పుట్టుమచ్చ ఉంటే... వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుందట. అదే ఎడమ కనుబొమ్మపై పుట్టుమచ్చ ఉంటే... వైవాహిక జీవితంలో మనస్పర్థలు, గొడవలు పెరిగి... విడిపోతారని అంటున్నారు. ఐతే... ఇలా కనుబొమ్మలపై పుట్టుమచ్చలు ఉన్నవారు... ప్రయాణాలు బాగా చేస్తారట.
ముఖం మధ్యలో మోల్ (పుట్టుమచ్చ) ఉంటే... అది ప్రేమకు గుర్తు. అదే మోల్ ముఖంపై కుడివైపు ఉంటే ఆ వ్యక్తి ఏదైనా ఒక సబ్జెక్టుపై విపరీతమైన నాలెడ్జిని పొందగలరు. అదే మోల్ ముఖంపై ఎడమవైపు ఉంటే... వారు డబ్బును వృథా చేస్తారు. ముఖంపై కుడివైపు ఉండే పుట్టుమచ్చ... సంపద, తెలివితేటలకు గుర్తు. అదే ముఖంపై ఎడమవైపు ఉండే పుట్టుమచ్చ... నిరాశకు గుర్తు. జీవితం ఆనందంగా ఉండదు. కళ్లలో పుట్టుమచ్చ ఉన్నవారు... బాగా ఆలోచించగలరు. కుడివైపు కంటిలో ఉంటే... వాళ్లు క్రియేటివ్‌గా ఆలోచిస్తారు. ఇతరుల్ని అంచనా వేయడంలో వారికి తిరుగుండదు
కళ్లలోపల పుట్టుమచ్చ ఉండేవారు సెన్సిటివ్‌గా ఉంటారు. చిన్న చిన్న విషయాలపైనా లోతుగా స్పందిస్తారు. చెవిలో పుట్టుమచ్చ ఉంటే... ఎక్కువ కాలం జీవిస్తారు. ముఖం చుట్టుపక్కల పుట్టు మచ్చ ఉంటే... వారు ఆనందంగా ఉంటారు. మర్యాదస్తులలా ఉంటారు. నోట్లో పుట్టుమచ్చ ఉంటే... సంపన్నులవుతారు. అదృష్టం మామూలుగా ఉండదు. ఆ వ్యక్తిని చేసుకునే మహిళ అత్యంత ఆనందంగా ఉంటారు. ముక్కులో, ముక్కుపైన ఉంటే... ఆ వ్యక్తి చాలా టాలెంట్ కలిగి ఉంటారు. ఆనందంగా ఉంటారు.
పై పెదవిపై పుట్టుమచ్చ ఉన్నవారికి... హృదయమంతా ప్రేమతో నిండి ఉంటుంది. వారిలో లైంగిక కోరికలు చాలా బలంగా ఉంటాయి. అదే పుట్టుమచ్చ కింది పెదవిపై ఉంటే... వారి జీవితంలో పేదరికం ఉంటుంది. ఎడమ బుగ్గపై పుట్టుమచ్చ ఉంటే నిరాశతో ఉంటారు. కుడి బుగ్గపై పుట్టుమచ్చ ఉంటే... సంపన్నులు అవుతారు.
కుడి భుజంపై పుట్టుమచ్చ ఉంటే... ఆ వ్యక్తి నిబద్ధత కలిగి ఉంటారు. ఎడమ భుజంపై పుట్టుమచ్చ ఉంటే... వారు కొద్దిగా కోపంగా ఉంటారు. చేతులపై పుట్టుమచ్చలు ఉండేవారు తెలివైన వారు. కుడి చేతిపై పుట్టుమచ్చ ఉంటే... వారు చాలా బలవంతులు అవుతారు. కుడివైపు వెనకవైపున పుట్టుమచ్చ ఉంటే సంపన్నులు అవుతారు. ఎడమ చేతికి పుట్టుమచ్చ ఉంటే... ఆ వ్యక్తి చాలా డబ్బు ఖర్చు పెడతారు. అదే పుట్టుమచ్చ ఎడమ చేతి వెనకవైపు ఉంటే... ఆ వ్యక్తికి జాలి, దయ అంతగా ఉండవు.
తలపై కుడి భాగంలోనూ, నుదురు మధ్య భాగంలో, కుడి కణతపై, ఎడమ కణతపై, కుడి కన్ను రెప్పపై, కుడి కన్ను లోపలి భాగంలో పుట్టుమచ్చలు ఉంటే ధనయోగం కలుగుతుంది.ముక్కు కుడి భాగంలోనూ, కుడి చెంపపై, చెవులపై,. నాలుక చివరి భాగంలోనూ ఉండే పుట్టుమచ్చలు ధనవంతులను చేస్తాయి.
మెడ ముందు భాగంలో ఏ వైపున ఉన్నా కుడి భుజం పైన, పొట్ట పైన, హృదయ స్థానంలోను, మోచేతి పైన, కుడి అరచేతిపై, కుడి తొడపై, కుడి మోకాలుపై గల పుట్టుమచ్చలు శ్రీమంతులను చేసేవిగా చెప్పబడుతున్నాయి.ఈ ప్రదేశాల్లో గల పుట్టుమచ్చల వలన కష్టపడటం వలన గానీ కాలం కలిసిరావడం వలన గాని ధనయోగం కలుగుతుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.