కొత్త సంవత్సరం రోజు ఉగాది పచ్చడి ఎందుకు తినాలి.. తినేటప్పుడు చదవాల్సిన మంత్రం ఏది..

కొత్త సంవత్సరం రోజు ఉగాది పచ్చడి ఎందుకు తినాలి.. తినేటప్పుడు చదవాల్సిన మంత్రం ఏది..

ఉగాది రోజు కచ్చితంగా హిందువులందరూ ఉగాది  పచ్చడి తింటారు.  అది తినకుండా మంచినీళ్లు కూడా తాగరు.  అయితే గుళ్లో తీర్థం తీసుకుంటున్నప్పుడు అయ్యగారు అకాల మృత్యుహరణం.. అంటూ మంత్రం చదువుతూ తీర్థం ఇస్తారు. కాని  కొత్త సంవత్సరం రోజు ఉగాది పచ్చడి ఇంట్లో తిన్న తరువాతే దేవాలయాలకు సందర్శిస్తాం.. ఉగాది పచ్చడి తినేముందు కూడా ఒక మంత్రం చదవుకోవాలని పండితులు చెబుతున్నారు.. ఇప్పుడు ఆ మంత్రం గురించి తెలుసుకుందాం. .  

ఉగాది పచ్చడి ఈ పండుగకు మాత్రమే  షడ్రుచుల మేళవింపు  పచ్చడిని  తీర్థంగా తీసుకుంటాం.  - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడిని ఉగాది రోజున విధిగా తీసుకోవాలి. సంవత్సరం అంతా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలైనవి వాడుతుంటారు.

ఉగాది పచ్చడిని తినేటప్పుడు పఠించవలసిన మంత్రం 

శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ 
సర్వారిష్ట వినాశాయనింబకం దళబక్షణం

వేపపూతతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం వజ్రసదృశమై , సర్వారిష్టాలూ తొలగిపోతాయనీ.... నూరేళ్లు సుఖంగా జీవిస్తారనీ ఈ శ్లోకం అంతరార్థం.

ఇక ఉగాది ప్రాశస్త్యాన్ని గురించి చెప్పే మరో శ్లోకం కూడా ధర్మసింధు గ్రంధంలో ఉంది:-

అబ్దాదౌ నింబకుసుమం
శర్కరామ్ల ఘృతైర్యుతమ్‌
భక్షితం పూర్వయామేస్యా
తద్వర్షం సౌఖ్యదాయకమ్‌॥

ఉగాదినాడు వేపపూత, పంచదార (బెల్లం), చింతపండు, నెయ్యితో కూడిన పచ్చడిని తింటే... రాబోయే ఏడు అంతా సౌఖ్యంగా సాగిపోతుందని దీని అర్థం.

ఉగాది నాడు ఈ శ్లోకాన్ని చదివి ఉగాది పచ్చడిని తీసుకోవాలి.  ఈ పచ్చడిని ఉగాది రోజున మొదలుపెట్టి, శ్రీరామనవమి వరకు ప్రతిరోజూ తీసుకుంటే మంచిదని శాస్త్రాలు చెప్తున్నాయి. దీన్ని తీసుకోవడం మూలంగా ఋతువుల్లో మార్పు కారణంగా ఆరోగ్య సమస్యలేవీ రాకుండా ఉంటాయి.  

ALSO READ : Ugadi Special 2025: ఉగాది అంటే ఏమిటి.. కొత్త సంవత్సరం గురించి కొన్ని విశేషాలు..

బ్రహ్మ ప్రళయం' పూర్తి అయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించే సమయాన్ని 'బ్రహ్మకల్పం' అంటారు ఇలా ప్రతికల్పంలోనూ మొదటవచ్చే యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభసమయాన్ని 'ఉగాది' అని వ్యవహరిస్తారు. ఈ 'ఉగాది' పండుగ మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆరోజు నుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణించి, లెక్కించుటకు వీలుగా ఉండేందుకే ఉగాది పండుగను మనకు ఋషులు ఏర్పాటు చేశారు.