దేవుడు అసలు ఉన్నాడా.. లేడా.ఉంటే నిజమైన దేవుడు ఎలా ఉంటాడు.. భూమిపై అన్నిటి కన్నా ఎక్కువ శక్తి ఎవరికి ఉంది.. పెద్దమనిషి అంటే ఎవరు.. నిజంగా సృష్టికర్త ఉన్నాడా.. పవిత్రత అనే పదానికి అర్దం ఏమిటి.. ఇలాంటి విషయాలకు ప్రముఖ ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీవాసుదేవ్ చెప్పిన వివరాల గురించి తెలుసుకుదాం. . .
మన కన్నా పెద్ద శక్తి!
మనకన్నా పెద్ద శక్తి ఏదో జ్ఞానం దేవుడేనని అనుకుంటారు అంతా. మరి ఆ దేవుడు ఎలా ఉంటాడు? అనేది ఎప్పటికీ సందేహమే! కానీ... ఒక్కో మతం ఒక్కో విధంగా దేవుడికి రూపం ఇచ్చింది. ఇంతకీ ఆయనకు రూపం ఉందా? ఉంటే ఎలా ఉంటాడు? ఎలా చూడాలి? తన ఫాలోవర్స్ అడిగిన సందేహాలకు సమాధానాలు ఇచ్చారు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీవాసుదేవ్.
అత్మ పవిత్రమైనది. శరీరం అపవిత్రమైనది అని అంటారు. ఇది సాధ్యమేనా? అంటే ఒకసారి ఆలోచించాలి. దేవుడు పవిత్రమైనవాడు అయినప్పుడు.. ఆయన సృష్టించిన సృష్టి ఎలా అపవిత్రం అవుతుంది? దేవుడు అనే ఒక శక్తి ఉందనే ఆలోచన రావడానికి ఈ సృష్టికదా కారణం! పుట్టగానే. ... కళ్లు తెరిచి చుట్టూ చూస్తే.. కంటికి అందనంత పెద్దగా ఈ సృష్టి కనపడుతుంది. ఇక్కడికి రావడానికి ముందే ఏదో జరిగింది.. కచ్చితంగా దాన్ని నేను సృష్టించలేదు. కాబట్టి. కచ్చితంగా నన్ను మించి ఒక సృష్టికర్త ఉన్నాడన్నమాట!" అనే ఆలోచన పుడుతుంది.
పెద్ద మనిషి
సృష్టికర్త ఉన్నాడు అనే ఆలోచన రాగానే.. తాను మనిషి రూపంలో ఉన్నాడు కాబట్టి ఎవరో తనకంటే పెద్ద మనిషి ఉన్నాడని అనుకుంటారు. తనలాంటి మామూలు మనిషి ఇవన్నీ ఆలోచన చేయలేడు కాబట్టి ఈ సృష్టి వెనక ఉన్నది కచ్చితంగా ఒక పెద్ద మనిషే! ఎందుకంటే.. రెండు చేతులతో ఇంత పెద్ద సృష్టిని ఎలా చేయగలిగాడు? కచ్చితంగా అతనికి ఓ ఎనిమిదో... ఎనిమిది వందలో చేతులు ఉంటాయనుకుంటాడు. దానికి తగ్గట్టు అతని రూపాన్ని ఊహించుకుంటాడు. ఒకవేళ మీరు పులి అయితే.... మీరు దేవుడు... ఒక పెద్ద పులి అని ఆలోచించగలరా?.. ఇదే విషయాన్ని వెళ్లి ఒక పులిని అడిగితే.. 'దేవుడు అంటే చాలా పెద్ద పులి.. నాలుగు కొమ్ములు ఉంటాయేమో అని చెప్తుంది.
ఏ రూపం?
ఉగండాకి చెందిన ఈదీ అమీన్ అనే వ్యక్తి 'దేవుడు నల్లగా ఉంటాడు' అని డిక్లేర్ చేశాడు. నేను అతనితో ఏకీభవిస్తాను. తెల్లవాడికి తెల్లగా ఉండే దేవుడు ఉన్నప్పుడు.... నల్లవాళ్లకు నల్లగా ఉండే దేవుడు ఎందుకు ఉండకూడదు? నల్లవాళ్లు,... తెల్లవాళ్లు ఇద్దరూ కనఫ్యూజ్ అయ్యారు. 'మాకు తెలుసు దేవుడు బూడిద రంగులో ఉంటాడు' అని భారతీయులు అంటారు. ఎందుకు అని అడిగితే.. ఫలానా యుగంలో ఆయన ఈ భూలోకానికి వచ్చి వెళ్లాడని చెప్తారు.
కొన్నాళ్ల క్రితం అమెరికాలోని టెన్నెస్సీలో... కొంతమంది తెలిపిన వివరాల ప్రకారం ... ఒక జోక్ చెబుతూ.. ఆ జోక్ లో దేవుడిని పిలిచారు.. అప్పుడు వెంటనే కొంతమంది ఆడవాళ్లు లేచి దేవుడు అంటే పురుషుడే అని మీరు నమ్ముతున్నారా? అని అడిగారు. అది ఎంత వరకు తీసుకెళ్తుందో నాకు తెలియదు కాని.. చూడండి నేను మీరు జోక్ మాత్రమే చెప్తున్నాను అన్నాను వాళ్ళు. జోక్స్ సీరియస్ గా తీసుకొని దేవుడు అంటే పురుషుడని నమ్ముతున్నారా? ముందు ఇది చెప్పండి అని అడిగారు. అప్పుడు ఆడవాళ్లంతా లేచి దేవుడు అంటే స్త్రీ ఎందుకు కాకూడదు? అని అడగటం మొదలు పెట్టారు. ఇలాంటి సమస్యలు అక్కడి కల్చర్ లో ఉన్నాయి. కానీ ... మన దేశంలో దేవుళ్లు అంటే స్త్రీలు పురుషులు ఇద్దరూ ఉన్నారు. అంతేకాదు.... ఆవు రూపంలో... ఏనుగు రూపంలో.. ఇలా ప్రతి రూపంలో మనకు దేవుడు ఉన్నాడు. కొంతమంది దేవుళ్లు నీళ్లలో ఈదుతారు. కొంతమంది ఎగిరే దేవుళ్లు ఉన్నారు. ఎందుకంటే మనం భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా ముందే చూసి తెలుసుకుంటాం కదా! అని నవ్వుతూ అన్నారు.
శక్తివంతమైనదే....
ఈ భూమి మీద అన్నిటికంటే శక్తివంతమైన జీవి ఏది అంటే మనిషి.. కాబట్టి సహజంగానే మనిషి దేవుడు . వాళ్లలో ముందు నుంచి మగవాళ్ల ఆధిపత్యం నడుస్తూ వస్తోంది కాబట్టి ... దేవుడు అంటే పురుషుడే అనే భావన కలిగింది. ఇప్పుడు మహిళలు కూడా శక్తివంతులు అవుతున్నారు. కాబట్టి మహిళలు ఎందుకు దేవుడు కాదు ! అని అడుగుతున్నారు. రేపు ఏదో ఒక విధంగా జంతువులు కూడా శక్తివంతంగా మారితే.. 'జంతువులు ఎందుకు దేవుడు కాకూడదు?" అని అడుగుతాయి. దేవుడు అంటే... ఎవరికి వాళ్లుగా అతిశయోక్తులను కలుపుకుని చేసుకొని, సృష్టించుకున్నదే! అంటే దేవుడు అనే ఆలోచన... మన అతిశయోక్తికి రూపం అన్నమాట...
మీరెవరు ?
ఇప్పటికీ మిమ్మల్ని మీరు నిర్వచించుకోలేక పోతే... ఎవరు ఎలా నిర్వచించినా అది కరెక్ట్ కాదు. వేరే ఏ నిర్వచనం మిమ్మల్ని వివరించలేదు. ఇంత పెద్ద క్రియేషన్లో లో అతి చిన్న భాగాన్ని మీరు నిర్వచించలేనప్పుడు.. ఈ సృష్టికి కారణమైన వాళ్లని ఎలా నిర్వచిస్తారు? దాన్ని నిర్వచించలేరు. అర్ధం చేసుకోలేరు. అది మీ అనుభవంలోకి వచ్చినా... తెలుసుకోలేరు. దాని నుంచి ఎలాంటి జ్ఞానాన్ని పొందలేదు. ఇప్పటి వరకు మీకు దేవుడిపై ఎలాంటి జ్ఞానం ఉన్నా.. అది పనికిరానిదే. అది కల్చరల్ నాన్సెన్స్! అప్పుడు మీరు ఏకల్చర్ లో ఉంటే... ఆ కల్చర్ దేవుడే మీకూ ఉంటాడు. నిజమైన దేవుడు ఎలా ఉంటాడనేది అనుభవంతోనే తెలుస్తుంది. అనుభవం అంటే తినేది కాదు. దాన్ని గ్రహించేది కాదు. దానిలో కలిసిపోయినప్పుడే తెలుస్తుంది. మరో దారి లేదు దానికి. ...కాబట్టి మనం పరమాత్మలో కలిసిపోవడానికి మార్గాలను చూడాలి. అప్పుడే మన కన్నా చాలా పెద్ద శక్తిని చూస్తామని తెలిపారు.
- సద్గురు జగ్గీవాసుదేవ్,ఆధ్యాత్మిక గురువు-