
నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఏ పని చేసినా కలిసిరాదు. వాస్తు ప్రకారం నెగిటివ్ ఎనర్జీ అసలు పనికి రాదు. అసలు నెగెటివ్ ఎనర్జీ అంటే ఏమిటి.. దీనికి భారత వాస్తు విజ్ఞాన సర్వజ్ఞ, ఆలయ బ్రహ్మ కాశీనాథుని సుబ్రహ్మణ్యం గారి వివరణ తెలుసుకుందాం. .
వాస్తు గురించి మాట్లడేటప్పుడు నెగెటివ్ ఎనర్జీ అనేపదాన్ని వాడుతుంటారు. అసలు దాని అర్ధం ..ఏంటి? కొందరు ఇల్లు కొనుక్కుంటారు లేదా కట్టుకుంటారు. తర్వాత ఏ కారణం వల్లనో అందులోకి గృహప్రవేశం చేయరు. అప్పుడు ఆ ఇల్లు కొన్ని రోజుల వరకు ఖాళీగా ఉండటం వల్ల దీపారాధన ఉండదు. ఎప్పుడైనా దీపారాధన లేని ఇంటిలో .. మనుషులెవరూ లేరు కదా అని క్షుద్ర శక్తులు ఆక్రమిస్తా యి. దాన్నే నెగెటివ్ ఎనర్జీ అంటారు. అందుకే ఊళ్లకు వెళ్లేటప్పుడు కూడా ఇంట్లో లైట్ వేసి వెళ్లాలని భారత వాస్తు విజ్ఞాన సర్వజ్ఞ, ఆలయ బ్రహ్మ కాశీనాథుని సుబ్రహ్మణ్యం చెబుతున్నారు.
–వెలుగు,లైఫ్–