ఐటీ కంపెనీల్లో హుష్డ్ ​ట్రెండ్..​ అంటే ఏంటి.?!

ఐటీ కంపెనీల్లో హుష్డ్ ​ట్రెండ్..​ అంటే ఏంటి.?!

ఒక డైలీ రొటీన్​కు అలవాటు పడితే.. మార్చుకోవడం అంత ఈజీ కాదు. అలాంటిది రెండు మూడేండ్ల పాటు ఫాలో అయిన వర్క్​కల్చర్​  నుంచి అంత తొందరగా ఎలా బయటడతారు? అందుకే కార్పొరేట్​ కంపెనీలు వర్క్​ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగుల కోసం హుష్డ్​ హైబ్రిడ్​ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చాయి. కరోనా వచ్చినప్పటి నుంచి వర్క్​ ఫ్రం హోమ్​ చేస్తున్న ఉద్యోగులను వారంలో సగం రోజులైనా ఆఫీస్​కు రప్పించేందుకే దీన్ని తీసుకొచ్చాయి కార్పొరేట్​ కంపెనీలు. హైదరాబాద్ సిటీ, వెలుగు

ఇప్పుడు ఐటీ కంపెనీల్లో హుష్డ్ హైబ్రిడ్ విధానం ట్రెండింగ్​లో ఉంది. కరోనా ఆపత్కాలంలో ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లి పని చేసే పరిస్థితి లేదు. పైగా ఐటీ కంపెనీలకు పెద్దగా  ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లు లేవు. దాంతో నష్టాల నుంచి తప్పించుకునేందుకు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం వెసులుబాటు కల్పించాయి. అయితే.. కరోనా ఎఫెక్ట్​ పూర్తిగా తగ్గిన తర్వాత కూడా ఇంకా చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోంని కొనసాగిస్తున్నాయి. కానీ.. దాని వల్ల వర్క్ ఎన్విరాన్​మెంట్​ దెబ్బతింటుండడం, పని ఎఫెక్టివ్​గా ఉండకపోవడంతో కొన్ని ఐటీ కంపెనీలు మళ్లీ ‘బ్యాక్ టు ఆఫీస్​’కు పిలుపునిస్తున్నాయి.

అయితే, చాలా రోజులు వర్క్ ఫ్రం హోంకు అలవాటు పడి, మళ్లీ ఆఫీసులకు వెళ్లడానికి చాలామంది ఇష్టపడటం లేదు. వర్క్  ఫ్రం హోమ్​లో అయితే.. నచ్చిన టైంలో వర్క్  చేసుకునే వెసులుబాటు ఉండేది. కానీ.. ఇప్పుడు ఆఫీస్​కు వచ్చి పనిచేయాలని చెప్పడంతో కొందరు ఇబ్బంది పడుతున్నారు. ఆఫీస్​లోనే ఉండి గంటల తరబడి పనిచేయడానికి ఇష్టపడడం లేదు. అందుకే ఉద్యోగులు మళ్లీ​ ఆఫీస్ ​వాతావరణానికి అలవాటు పడడానికి ‘హుష్డ్ హైబ్రిడ్’ విధానాన్ని తీసుకొచ్చాయి కొన్ని కంపెనీలు. 

ఏమిటీ హుష్డ్ హైబ్రిడ్ 

హుష్డ్​ హైబ్రిడ్​ అంటే ఉద్యోగులకు వాళ్ల ఇష్టానికి అనుగుణంగా సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేయడం. ఈ విధానంలో ఉద్యోగి వారంలో రెండు లేదా మూడు రోజులు తప్పనిసరిగా ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది. మిగతా రోజుల్లో ఎలా పని చేయాలన్నది ఉద్యోగి ఇష్టానికి వదిలేస్తారు. ఇప్పుడు ఐటీ కంపెనీల్లో ఇదే ట్రెండ్​ కొనసాగుతోంది. గతంలో ఉన్న కాఫీ బ్యాడ్జింగ్ ట్రెండ్​కి ఇది ఆల్టర్నేట్​అని చెప్పొచ్చు. దీనివల్ల ప్రొడక్టివిటీ పెరగడం, ఎంప్లాయ్స్​ సంతృప్తిగా ఉండటంతో టీం మేనేజర్లు కూడా ఈ హుష్డ్ హైబ్రిడ్ ట్రెండ్​ను ప్రోత్సహిస్తున్నారు. అయితే ఈ కొత్త ట్రెండ్​పై కొన్ని ఐటీ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ట్రెండ్​తో ఎంప్లాయ్స్​ని భవిష్యత్తులో రెగ్యులర్​గా ఆఫీసులకు రప్పించడం కష్టంగా మారుతుందని కలవరపడుతున్నాయి.  

హుష్డ్ హైబ్రిడ్​లో ఇట్లా చేస్తరు  

టీమ్ మేనేజర్లు రిమోట్ వర్క్ షెడ్యూల్ సెట్ చేసుకునేందుకు టీం సభ్యులకు అనుమతిస్తారు. టీం సభ్యుల అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు ఉంటాయి. అనధికారికంగా అటెండెన్స్ సర్దుబాటు చేస్తారు. టీం సభ్యులకు అనుగుణంగా రిమోట్ వర్క్ ఇస్తారు. 

ఇదీ ప్రయోజనం..

రోజూ ఆఫీసులో కలిసి పని చేయడం వల్ల టీం లీడర్​తో డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఉద్యోగుల స్కిల్స్​ని బయటకి తీయడానికి ఉపయోగపడుతుంది. ఫ్లెక్సిబిలిటీ వర్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్ స్పేస్‌‌‌‌‌‌‌‌ను అందించడమే కాకుండా, కంపెనీ, వారి మేనేజర్ల పట్ల విధేయతను పెంచడంలో కూడా సహాయపడుతుంది. కలిసి పని చేయడం వల్ల వాళ్లు వ్యక్తిగతంగా ఎదగడంతోపాటు వాళ్ల లక్ష్యాలను వేగంగా సాధించడానికి వీలుంటుంది. 

టీం కో‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–ఆర్డినేషన్ పెరుగుతుంది 

ఈ హైబ్రిడ్ విధానం వల్ల అటు ఎంప్లాయ్స్​​కి.. ఇటు ప్రాజెక్ట్ మేనేజర్స్​కి బెనిఫిట్​ఉంటుంది. వారం పూర్తిగా ఇంటి దగ్గర ఉండకుండా కనీసం ఒకట్రెండు రోజులు ఆఫీసుకు వెళ్లడం వల్ల టీం కో‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–ఆర్డినేషన్ పెరుగుతుంది. వర్క్ మీద కూడా కమాండింగ్ పెరుగుతుంది. డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. ప్రతి రోజూ ఆఫీసుకు రావడం అందరికీ కుదరకపోవచ్చు. కాబట్టి వీలైన వాళ్లు ఆఫీసులకు వచ్చి పనిచేస్తున్నారు. రాలేని వాళ్లని కనీసం వారంలో ఒకట్రెండు రోజుల మాత్రం ఆఫీసుకి వచ్చి వర్క్ చేసుకునేలా ప్రోత్సహిస్తున్నాం. 

- పవన్ సిరిమల్ల, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్