రిలేషన్ షిప్ అంటే ఏమిటి.. స్వేచ్చకు.. ప్రేమకు తేడా ఏంటి.. పూర్వకాలంలో స్వేచ్చను ఎలా అనుభవించేవారు. ప్రేమను ఎలా స్వీకరించేవారు.. వీటి గురించి సద్గురు ఏం చెప్పారు.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం, , ,
పూర్వకాలం నుంచి నేటి వరకు దీనిని అర్ధం చేసుకోవడం అనేది స్వేచ్ఛకు సంబంధించింది. మానవ చరిత్రలో అంటే గతంలోనూ, ఇప్పుడు లేదా భవిష్యత్తులో మానవ సంబంధాలు అనేవి స్వేచ్ఛకు సంబంధించినవే. ప్రతి మనిషి కొంచెం రొమాంటిక్ గా ఉంటారు. అలా ఉండటాన్నే అన్ కండిషనల్ అని... అదే నిజమైన, స్థిరమైన ప్రేమ అని అనుకుంటారు.
కానీ, రిలేషన్ షిప్స్ అంటేనే రోజూ మారుతూ ఉంటాయి. వాటిని, రోజువారీ బాధ్యతలు నిర్వహించినట్టుగానే.. మేనేజ్ చేయాలి. ఒక్కరోజు సరిగ్గా మేనేజ్ చేయలేకపోయినా.. అది ఎక్కడికో వెళ్తుంది. వేల ఏళ్లుగా మానవ సంబంధాలు ఇలాగే నడుస్తున్నాయి. రిలేషన్ షిప్ అనే గేమ్ లో నాలుగు రాళ్లు పైకి విసిరి.. కిందపడకుండా ఆడటం లాంటిదే.. ఒకేసారి నాలుగు రాళ్లను పైకి ఎగరేసి ఆటాడితే.. ఏదో ఒకటి కింద పడిపోతుంది. కిందపడకుండా మేనేజ్ చేయాలంటే.. ఏకాగ్రత... స్కిల్స్ అవసరం. శ్రద్ధగా ఉండకపోతే.. ఏం జరుగుతుందో కూడా మీకు తెలియదు.
మానవ సంబంధాలు ఎప్పుడూ మారుతూ ఉంటాయి. అవి స్థిరంగా ఉండవు. స్థిరంగా ఉండాలంటే.. దానికి చాలా ఏకాగ్రత ఉండాలి. ఇలాంటి ఏకాగ్రత లేకపోవడం వల్లే కొంతమందికి రిలేషన్ షిప్స్ మేనేజ్ చేయడానికి సమయం.. శక్తి రెండూ ఉండవు. అప్పుడు వాళ్లు వాళ్లు వేరే దారిలో వెళ్తుంటారు. ఆ దారిలో ఇలా నియమ నిబంధనలేం ఉండవు. వాళ్లు కళ్లు మూసుకుంటారు. ధ్యానంలో మునిగిపోతారు. వాళ్ల చుట్టూ ఏముంది? వాళ్ల చుట్టూ ఎవరున్నారు? అనే విషయాలేం పట్టించుకోరు. అది మీరు చేయలేదు. అందుకే తమను తాము శిక్షించుకుంటారు.
ఒక్కసారి ఆలోచిస్తే...
అసలు మీ జీవితంలో దేన్ని కావాలనుకుంటున్నారు? ఎదుటివాళ్లు అన్న ప్రతి మాటకు ఇంకోమాట అంటే సమస్య తీరిపోతుందా? ఒక్కసారి కూర్చొని ఆలోచించండి. మీ భ్రమలన్నీ పటాపంచలవుతాయి. భ్రమలు ఆవిరైనప్పుడే.. జీవితాన్ని మరింత దగ్గర నుంచి చూడటం.. మొదలు పెడతారు. అప్పుడే రియాలిటీ ఏంటో తెలిసివస్తుంది.
నా జీవితం ఏంటీ? దాని స్వభావం ఎలాంటిది? ఎందుకు ఇలా జరుగుతోంది?' అని ఆలోచించడానికి ఇదే మంచి అవకాశం జీవితం అంటే సంపూర్ణమైనది కదా? మరి ఎందుకు ఈ జీవితం అసంపూర్ణంగా అనిపిస్తుంది? ఈ లోటుని తీర్చడానికి మరో వ్యక్తి కావాలని ఎందుకనిపిస్తుంది? ఒక్కసారి ఆలోచించండి.
వాస్తవానికి ఈ జీవితం సంపూర్ణమైనది. కానీ, వాళ్లు ..వీళ్లు తమ జీవితంలో ఉంటేనే సంపూర్ణం అవుతుందని ఎందుకనుకుంటున్నారు? వాళ్లెవరో లేకుంటే జీవితమే లేనట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఈ ఆలోచనే జీవితాన్ని అసంపూర్ణంగా మారుస్తుంది. క్రియేటర్, క్రియేషన్ కలిసి ఉంటాయి. ఇదే అన్నింటికంటే గొప్పంబంధం.
ఇదే మంచి అవకాశం
జీవిత భాగస్వామి మిమ్మల్ని మోసం చేయగలరు. వాళ్ళు ఇల్లు విడిచి వెళ్లగలరు. వాళ్లు విడాకులూ ఇవ్వగలరు. లేదంటే వాళ్లు చనిపోవచ్చు. ఒకవేళ వాళ్లు చనిపోతే... మోసం చేశారని అంటారా? అలాంటి ఆలోచన వస్తుంది. వాళ్లు ఏ విధంగా మిమ్మల్ని వద్దనుకున్నది సమస్య కాదు. మోసం చేసినా, విడాకులు ఇచ్చినా, విడిచిపోయినా, చనిపోయినా .. ఏమైనా కావొచ్చు. ఈ సగం జీవితం.. ఇంకో వ్యక్తితో పరిపూర్ణమవుతుంది. అనే ఒక భ్రమ పటాపంచలవుతుంది. ఇది అర్థం చేసుకుంటే పరిపూర్ణమైన జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఆ రోజు నుంచి రిలేషన్ పిప్స్ చూసే తీరు పూర్తిగా మారిపోతుంది. అప్పుడు మీరు ఏ వ్యక్తికైనా మరింత దగ్గరవుతారు వాళ్లతో అన్ని షేర్ చేసుకుంటారు. అదే మార్పు కాబట్టి.. దీన్ని మారడానికి వచ్చిన అవకాశంగా భావించాలి. ఒక భ్రమ నుంచి రియాలిటీ వైపు మళ్లించినందుకు ఆ వ్యక్తికి థ్యాంక్స్ చెప్పుకోండి.
జీవితాంతం ఒక భ్రమలో బతకకుండా. వాళ్లు చాలా తక్కువ టైమ్ లోనే మీరు రియలైజ్ అయ్యేలా చేశారు. లేదంటే ఈ విషయం మీరు చనిపోయే ముందు తెలిస్తే. నాకు భయమేస్తోంది! నువ్వు నాతో రాకూడదా? అంటే పార్ట్ నర్ కచ్చితంగా నో అంటారు. చేదు నిజం చివరి ఘడియలో తెలియడం కంటే ఇప్పుడు తెలుసుకోవడమే బెటర్!
-వెలుగు,లైఫ్-