ఫార్ములా ఈ - కార్ రేసింగ్ కేసు ఏంటీ.. కేటీఆర్ చేసిన తప్పేంటీ..?

ఫార్ములా ఈ - కార్ రేసింగ్ కేసు ఏంటీ.. కేటీఆర్ చేసిన తప్పేంటీ..?


ఫార్ములా ఈ - కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను A1గా చేర్చడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఏ1 గా కేటీఆర్ ను చేర్చడంతో అసలు కేటీఆర్ చేసిన తప్పేంటి.. ఈ వ్యవహారంలో కేటీఆర్ ప్రత్యక్షంగా అవినీతికి పాల్పడ్డారా?  ఇందులో కేటీఆర్ పాత్ర ఎంత? ఇప్పుడు తెలంగాణ అంతా ఇదే చర్చ. 

బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఫార్ములా ఈ-రేసింగ్ నిర్వహించింది. కేటీఆర్ అప్పటి మున్సిపాలిటీ మంత్రిగా ఉన్నారు. 2023లో హైదరాబాద్ నగరంలో ఫార్మూలా ఈ కార్ రేసింగ్ లో చెల్లింపులు జరిగాయి.  రేసింగ్ రోడ్డు, ఇతర మౌళిక సదుపాయాల కోసం HMDA రూ. 20 కోట్లు ఖర్చు చేసింది. అదే విధంగా రేస్ ప్రమోటర్ గా వ్యవహరించిన నెక్స్ట్ జెన్ అనే ఏజెన్సీ రూ.150 కోట్లు ఖర్చు చేసింది. ప్రచారంతో పాటు స్టాల్స్, సీటింగ్, స్ట్రీట్ లైట్స్ వంటి ఖర్చులను ఏజెన్సీనే భరించింది. 

ఈవెంట్ విషయంలో HMDA, నెక్స్ట్ జెన్, ఈ ఫార్ములాల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఈ రేసింగ్ నిర్వహణ వల్ల
HMDA , నెక్స్ట్ జెన్ సంస్థలు ఎలాంటి లాభం రాకపోవడంతో నష్టపోయాయి. 

అయితే ఈ రేసుకు సంబంధించి ఉన్నతాధికారి అర్వింద్ కుమార్ రహస్య ఒప్పందం చేసుకుని రూ.55 కోట్ల నిధులు విడుదల చేసినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో కేవలం ఫోన్ల ద్వారానే ఆదేశాలు అందుకుని నిధుల విడుదల చేసినట్లు తేలింది. మున్సిపాలిటీ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆమోదంతోనే నిధుల విడుదల జరిగిందనేది అభియోగం. 

అయితే  క్యాబినెట్ నిర్ణయం లేకుండా కేటాయించిన రూ.55 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాలని IAS అరవింద్ కుమార్ కు నోటీసులు పంపించారు అధికారులు.  కేసు నమోదు చేసిన ACB అధికారులు కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలతో పాటు మరికొందరిని కూడా విచారించనున్నది. విచారణకు హాజరు కావాలని ఏసీబీ వీరికి నోటీసులు ఇవ్వనుంది.