అమ్మ స్కీమ్స్ అటకెక్కినట్లేనా..?

అమ్మ స్కీమ్స్ అటకెక్కినట్లేనా..?

1991 లో జయలలిత తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి తమిళనాట సంక్షేమ పథకాలు స్పీడందుకున్నాయి . 2011 లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆడవారికి కానుకగా మిక్చర్ – గ్రైండర్ లను జయ సర్కార్ అందచేసింది. కనీసం 1.83 కోట్ల మంది మహిళలకు ఈ స్కీం ద్వారా ప్రయోజనం కలిగింది. 2014 లో‘ అమ్మ బేబీ కేర్ కిట్  పథకాన్ని జయ సర్కార్ ప్రారంభించింది. ఈ పథకం ప్రకారం సర్కార్ దవాఖానాల్లో కాన్పు చేయించుకున్నవారికి బేబీ సోప్, టవల్ సహా వెయ్యి రూపాయల విలువైన 16 రకాల ఐటమ్స్ ను అందచేశారు. 2016 లో చనిపోయేంత వరకు పోయేంత వరకు ఇలాంటివే మరికొన్ని సంక్షేమ పథకాలను జయలలిత ప్రవేశపెట్టారు. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ సక్సెస్ ఫుల్ గా అమలు కావడంతో అన్నా డీఎంకే కు ఆడవారి మద్దతు పెరిగింది. తమిళనాడులో వయస్సు మీద పడ్డ వారికి 1962 లో పెన్షన్లు ఇవ్వడం ప్రారంభించారు. 1975లో వితంతువులకు కూడా పెన్షన్లు ప్రారంభమయ్యాయి . 2011 లో ఈ నెలవారీ పెన్షన్ ను ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలకు జయలలిత సర్కార్ పెంచింది. తర్వాత ఈ అమౌంట్ ను రూ.1,500కు పెంచుతామని అన్నాడీఎంకే ఎన్నికల హామీ కూడా ఇచ్చింది. అయితే జయలలిత చనిపోయిన తర్వాత ఈ ఎన్నికల హామీని పట్టించుకున్న వారే లేరంటున్నారు సామాన్య ప్రజలు. జయకు రాజకీయ వారసురాలిగా తమను తాము ఎస్టాబ్లిష్ చేసుకోవడంలో ఉన్న శ్రద్ధ ఎన్నికల హామీలను అమలు చేయడంలో లేదని మండిపడుతున్నారు. అంతేకాదు అధికారంలో ఉంది అన్నా డీఎంకే సర్కార్ అయినా గత రెండేళ్లుగా పళనిస్వామి ప్రభుత్వం కొత్తగా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేదన్నారు. ముఖ్యంగా సర్కార్ నెల కింత అని ఇచ్చే పెన్షన్ మీద ఆధారపడి బతికే వృద్ధుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ నేపథ్యం లో జయ ప్రవేశపెట్టిన వెల్ఫేర్ స్కీమ్ ను కొనసాగిస్తారా లేక నిధులు లేవన్న సాకు చూపించి మెల్లమెల్లగా ఒక్కో స్కీమ్ ను అటకెక్కిస్తారా అనే అనుమానాలు కూడా ప్రజల్లో కలుగుతున్నాయి .

అమ్మ క్యాం టీన్లు సూపర్ హిట్ (బాక్స్ )….

2013 ఫిబ్రవరిలో అమ్మ క్యాంటీన్లు అప్పటి జయలలిత సర్కార్ ప్రారంభించింది. చాలా తక్కువ రేట్లను పేదవారికి కడుపునిండా తిండి పెట్టడమే ఈ క్యాంటీన్ల అసలు లక్ష్యం.ఈ క్యాంటీన్లలో ఎవరైనా నాలుగు రూపాయలు పెట్టి ఘుమఘుమలాడే నాలుగు వేడి వేడి ఇడ్లీ తినొచ్చు. టిఫిన్ వద్దు….రైస్ తినాలన్నా నో ప్రాబ్లమ్. అయిదు రూపాయలిస్తే కడుపునిండా సాంబార్ అన్నం తినొచ్చు. సాంబా రన్నం తినే ఓపిక లేదు…కొద్దిగా పెరుగన్నం తిని సరిపెట్టుకోవాలనకున్నా నో ప్రాబ్లమ్. మూడు రూపాయలకు కమ్మని గడ్డ పెరుగుతో అన్నం పెడతారు.తర్వాత మే నెలలో క్యాంటీన్ల మెనూలో సర్కార్ మార్పులు చేసింది. మూడు రూపాయలకే రోటీ, దాల్ ఇవ్వడం ప్రారంభించారు. అలాగే ఐదు రూపాయలకు తిన్నంత పొంగల్ వడ్డిస్తారు. సెల్ఫ్ హెల్ప్​ గ్రూప్స్ కు ఈ క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను అప్పగించింది జయ సర్కార్. అమ్మ క్యాంటీన్లు చాలా తక్కువ టైమ్ లోనే సూపర్ డూపర్ హిట్టయ్యాయి. పేదలే కాదు, అప్పర్ మిడిల్ క్లాస్ ప్రజలు కూడా తెల్లవారగానే ఈ క్యాంటీన్లకు బారులు తీరుతున్నా రు. ప్రస్తుతం చెన్నై నగరంలో 407 అమ్మ క్యాంటీన్లు నడుస్తున్నాయి . చెన్నై నగరంలో సాధించిన విజయంతో తమిళనాడులోని మరో తొమ్మిది నగరాల్లో అమ్మ క్యాంటీన్లను ప్రారంభించారు.

జయ చనిపోయిన తర్వాత మారిన పరిస్థితులు….

2016 డిసెంబర్ లో జయలలిత చనిపోయిన తర్వాత తమిళనాడు లో రాజకీయ పరిస్థితులు మారాయి. ఈ ప్రభావం జయలలిత ప్రారంభించిన సంక్షేమ పథకాలపై పడింది. జయలలిత ఉన్నప్పుడు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ పై ఉన్నంత శ్రద్ధ ఇప్పటి సర్కార్ కు లేదంటున్నారు ఆడవారు. కనీసం 20 శాతం అమ్మ క్యాంటీన్లు మూసివేతకు రెడీ గా ఉన్నాయని తెలుస్తోంది. జయ హయాం లో ఒక్కో క్యాంటీన్ కు ప్రతి రోజూ 200 మందికి పైగా వచ్చేవారు. ఇప్పుడు ఈ సంఖ్య వందలోపే ఉందంటున్నారు సామాజిక కార్యకర్తలు. దీని ప్రభావం క్యాంటీన్లను నిర్వహించే సిబ్బందిపై కూడా పడిం ది.అనేక మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులను క్యాంటీన్ల నుంచి తీసివేస్తున్నారు. దీని ప్రభావం చెన్నై కార్పొరేషన్ ఆదాయంపై కూడా పడుతోం ది. 2017 లో అమ్మ క్యాంటీన్ల నుంచి కార్పొరేషన్ కు 34.5 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది తక్కువే. ఫుడ్ క్వాలి టీ విషయంలో ఎలాంటి రిమార్క్ లేకపోయినా అసలు క్యాంటీన్ల నిర్వహణపైనే సర్కార్ కు చిత్తశుద్ధి లేదంటున్నా రు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులు. అమ్మ బతికి ఉంటే ఈపాటికి తమ కొలువులు పర్మినెంట్ అయి ఉండేవని వీరన్నా రు.

లోక్ సభ ఎన్నికలపై ప్రభావం ?….

తమిళనాడులోని మొత్తం 39 లోక్ సభ నియోజకవర్గాలకు రెండో విడత ఈనెల 18న పోలింగ్ జరుగుతుంది. లోక్ సభ ఎన్నికలతో పాటు రాష్ట్రం లో మొత్తం18 అసెంబ్లీ బై ఎలక్షన్ల కు కూడా అదే రోజు పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యం లో జయలలిత ప్రారంభించిన సంక్షేమ పథకాలను పళనిస్వా మి ప్రభుత్వం లైట్ గా తీసుకున్న ప్రభావం అటు లోక్ సభ ఎన్నికలు ఇటు అసెంబ్లీ బై ఎలక్షన్స్ పై పడుతుందని రాజకీయ పండితులు భావిస్తున్నారు. ఏమైనా సంక్షేమ పథకాల అమలు చుట్టూనే తమిళనాడు రాజకీయాలు తిరుగుతాయనడంలో ఎలాంటి డౌటూ లేదు.

నత్తనడకన ‘ అమ్మ టూ వీలర్ స్కీం ’…

ఉద్యోగాలు చేసే ఆడవారి కోసం ‘అమ్మ టూ వీలర్ స్కీం ‘ ను ప్రారంభిస్తా మని 2016 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జయలలిత చెప్పారు. వర్కింగ్ ఉమెన్ టూ వీలర్ కొనుక్కోవాలనుకుంటే వారికి పాతిక వేల రూపాయలు సర్కార్ సబ్సిడీగా ఇస్తుంది. 2018 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇప్పటివరకు ఈ స్కీం కోసం కనీసం లక్ష మంది వర్కింగ్ ఉమెన్ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అయితే ఎంతమంది ఈ పథకం ద్వారా ఇప్పటివరకు ప్రయోజనం పొందారు అనే వివరాలను మాత్రం అధికారులు బయటపెట్టలేదు. ఈ స్కీం అమలును సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని ఉద్యోగాలు చేస్తున్న ఆడవారు విమర్శిస్తున్నారు.