భూమిపైనే కాదు ఆకాశంలో కూడా నదులు ఉంటాయని శాస్త్రవేత్తలు ధృవీకరించారు. ఇవి కూడా ప్రవహిస్తూనే ఉంటాయని... అతివృష్టి.. కొండ చరియలు విరిగి పడటం.. వరదలు వంటి ప్రకృతి విపత్తులు ఆకాశంలోని నదుల వల్ల సంభవిస్తాయని చెబుతున్నారు. వీటినే శాస్త్రవేత్తలు అట్మాస్ఫిరిక్ రివర్స్' లేదా 'ఫ్లయింగ్ రివర్స్' అని పిలుస్తారు. ఇవి ఎలా ఏర్పడుతాయో తెలుసుకుందాం..
ఆకాశ నదులు అంటే ఏమిటి?
భారీ మొత్తంలో నీరు ఆవిరయి.. భూమి నుంచి ఆకాశానికి పొడవుగా.. వెడల్పుగా.. పట్టీల మాదిరిగా.. గాలిలో ఆకాశం వైపు ప్రవహిస్తాయి. ఇవి మన కంటికి కనపడవు కాని చాలా ప్రమాదకరమని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే వీటిని మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీలు... ఇన్ ఫ్రారెడ్ ద్వారా వీటిని గుర్తించవచ్చు. గ్లోబల్ వార్మింగ్ హెచ్చరికల ప్రకారం.. భూమి వేడెక్కే ప్రక్రియలో ... సముద్రాల నుంచి ఎక్కువ నీరు ఆవిరి అవుతుంది. ఇది వాతావరణంలోని గాలితో కలిసి.. పైకి వెళుతూ ఆకాశంలో నదులు ఏర్పడుతాయి. ఇవి ప్రవహిస్తూ విపత్తులకు కారణమవుతాయని శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో తేలింది. ఆకాశ నదులు చాలా తక్కువ సమయంలో కురిసే భారీ వర్షాలకు,వరదలకు కారణమవుతున్న అదృశ్య శక్తి.... ఇదే భూ ప్రపంచాన్ని వణికిస్తుంది.
ఆకాశ నదులు చాలా ప్రమాదకరం
కొంత ప్రాంతంపై ఆకాశ నదులు కేంద్రీకృతమై ఉంటాయి. ఇవి భూమివైపు ప్రవహిస్తే అతివృష్టిని కలుగజేస్తాయి. ఇవి అతి తక్కువ సమయంలో ... అతిపెద్ద భారీ వర్షాన్ని కలుగజేస్తాయి. వీటి తీవ్రత ఎక్కువైతే వరదలు.. కొండ చరియలు విరిగి పడటం లాంటి విపత్తులు సంభవిస్తాయి. ఈ నదుల తాకిడి ఎక్కువైతే... ఒకేసారి అధిక వర్షాన్ని కురిపిస్తాయి. వీటినే రెయిన్ బాంబ్స్ అంటారు.. ఇలా అకస్మాత్తుగా కురిసే వర్షాల పంటలు దెబ్బతింటాయి. ఇంకా ఎక్కువగా పడితే వాటి ప్రభావం వల్ల కొన్ని సంవత్సరాల వరకు ఆ ప్రాంతంలో పంటలు పండే అవకాశం కూడా ఉండదు. అప్పుడు కరువు.. కాటకాలు సంభవిస్తాయి. ఇంకా జీవులపై కూడా వాటి ప్రభావం ఉంటుంది. అడవులు.. జంతువల ఆవాసాలు నాశనమవుతాయి.
ఆకాశ నదుల ప్రభావం ఎలా ఉంటుందంటే...
భారతదేశం వంటి ఉపఉష్ణమండల దేశాలపై ఆకాశ నదుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇటీవల కాలంలో భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడటానికి ఆకాశ నదులే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.ఆకాశ నదులు మనం అనుకున్నదానికంటే చాలా ప్రమాదకరమైనవి. గ్లోబల్ వార్మింగ్ తీవ్రత పెరిగే కొద్దీ, ఈ ఆకాశ నదుల సంఖ్య మరియు తీవ్రత పెరిగే అవకాశం ఉంది. అందుకే, వాతావరణ మార్పులను అరికట్టడానికి ప్రతి ఒక్కరం కృషి చేయాలి.
Also Read : ఆలుగడ్డ బోలెడు అందాన్ని ఇస్తుంది..
ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న అత్యంత ముఖ్యమైన సమస్యలలో గ్లోబల్ వార్మింగ్ ఒకటి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి, వాటిలో కొన్ని ప్రధానమైనవి:
గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలు:ప్రజలు చేసే పనుల వల్ల వాతావరణంలో గ్రీన్‌హౌస్ వాయువుల (కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ మొదలైనవి) శాతం అధికంగా పెరుగుతోంది. ఈ వాయువులు సూర్యుని నుండి వచ్చే వేడిని అడ్డుకోలేవు. దీని ఫలితంగా భూమి అత్యంత ఉష్ణమండలంగా మారుతుంది. గ్రీన్ హౌస్ వాయువులు వాతారణంలో సరైన మోతాదులో ఉంటే .. సూర్యుని నుంచి వచ్చే వేడిని అడ్డుకుంటాయి. ప్రస్తుతం సైంటిస్టులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రీన్ హౌస్ వాయువులు చాలా ఎక్కువుగా ఉండటంతో సూర్యుని వచ్చే వేడి భూమిని చేరుకుంటుంది. దీని ఫలితంగా భూమి యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది.
కార్బన్ డయాక్సైడ్ : జీవ ఇంధనాలను మండించడం ద్వారా కార్బన్ డయాక్సైడ్ ఏర్పడుతుంది. విద్యుత్ ఉత్పత్తి, వాహనాలు... పరిశ్రమల నుంచి వ్యర్ధాలను కాల్చడం .. .. పొగ గొట్టాల ద్వారా విడుదల చేసే వాయువు వలన వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ వృద్ది చెందుతుంది.
అడవులు నరికివేయడం : అడవులు కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహిస్తాయి ... ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. అడవులను నరికివేయడం వల్ల వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ పరిమాణం పెరుగుతుంది.
పరిశ్రమలు విడుదల చేసే వాయువులు: కర్మాగారాల నుండి వెలువడే వాయువులు విషపూరిత వాయువులు వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయి.
కూలింగ్ పరికరాలు: ఎయిర్ కండిషనర్లు మరియు రిఫ్రిజిరేటర్లలో ఉపయోగించే క్లోరోఫ్లోరోకార్బన్లు (CFCs) ఒజోన్ పొరను దెబ్బతీసి గ్లోబల్ వార్మింగ్‌ను తీవ్రతరం చేస్తాయి.
గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలు:
- సముద్ర మట్టాలు పెరగడం: మంచు కరిగిపోవడం వల్ల సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంతాలకు ముప్పు వాటిల్లుతుంది.
- వాతావరణంలో మార్పులు: అతివృష్టి, కరువు, తుఫానులు వంటి వాతావరణ విపత్తులు తరచుగా సంభవిస్తాయి.
- జీవవైవిధ్యం నష్టం: అనేక జీవజాతులు అంతరించిపోయే ప్రమాదం ఉంది.
- ఆహార ఉత్పత్తిలో తగ్గుదల: వ్యవసాయానికి అనుకూలమైన భూమి తగ్గడం వల్ల ఆహార ధరలు పెరుగుతాయి.
- ఆరోగ్య సమస్యలు: వేడి తీవ్రత పెరగడం వల్ల వ్యాధులు వ్యాప్తి చెందుతాయి.
గ్లోబల్ వార్మింగ్‌ను నివారించడానికి మనం చేయగలిగేవి:
- శక్తి సామర్థ్యం: విద్యుత్, నీరు మరియు ఇతర వనరులను మితంగా వినియోగించాలి.
- పునరుత్పాదక ఇంధనాలను ప్రోత్సహించడం: సోలార్, విండ్, హైడ్రో ఎనర్జీ వంటి పునరుత్పాదక ఇంధనాలను ఉపయోగించాలి.
- పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఉపయోగించడం: వ్యక్తిగత వాహనాలను తగ్గించి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఉపయోగించాలి.
- పర్యావరణ స్నేహపూర్వక ఉత్పత్తులను ఉపయోగించడం: ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణ స్నేహపూర్వక ఉత్పత్తులను ఉపయోగించాలి.
- ప్రభుత్వం మరియు ఇతర సంస్థలతో కలిసి పని చేయడం: గ్లోబల్ వార్మింగ్‌ను నిరోధించడానికి ప్రభుత్వం మరియు ఇతర సంస్థలతో కలిసి పని చేయాలి.
గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రపంచ సమస్య. దీనిని నివారించడానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరం. మనం చిన్న చిన్న మార్పులను చేయడం ద్వారా భవిష్యత్తు తరాల కోసం మన గ్రహాన్ని కాపాడవచ్చని సైంటిస్టులు అంటున్నారు.