ఇతర రాష్ర్టాల్లో బడుల పరిస్థితి ఎట్లుంది?
విద్యాశాఖను నివేదిక ఇవ్వాలని కోరిన సీఎస్
హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో బడుల ప్రారంభంపై సర్కారు కసరత్తు షురూ చేసింది. దాదాపు 9 నెలలుగా స్కూళ్లు నడవడం లేదని, వెంటనే తెరవాలని పేరెంట్స్, టీచర్స్ నుంచి కూడా డిమాండ్లు మొదలయ్యాయి. దీంతో ఇతర రాష్ర్టాల్లో పరిస్థితి తెలుసుకోని, రిపోర్టు ఇవ్వాలని సీఎస్సోమేశ్ కుమార్ విద్యాశాఖను ఆదేశించినట్టు తెలిసింది. దాదాపు 10 రాష్ర్టాల్లో 9,10 క్లాసులకు ఫిజికల్ తరగతులు ప్రారంభమయ్యాయి. కొన్ని రాష్ర్టాల్లో బడులు ప్రారంభించి, కరోనా తీవ్రత నేపథ్యంలో మళ్లీ మూసివేశారు. వివిధ రాష్ర్టాల్లోని పరిస్థితుల గురించి తెలుసుకున్నాక, స్కూళ్ల ప్రారంభంపై ముందుకు పోవాలని సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ర్టాల వివరాలను సేకరించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. రిపోర్టు ఆధారంగా విద్యాశాఖ అధికారులతో సమీక్షించి, బడుల ప్రారంభంపై సర్కారు నిర్ణయం తీసుకునే అవకాశముందని ఈ శాఖ వర్గాలు తెలిపాయి. స్కూళ్ల ప్రారంభంపై సర్కారు కనీసం సమీక్ష కూడా చేయడం లేదంటూ గురువారం ‘ఈ ఏడాది బడి బందేనా’ హెడింగ్తో ‘వెలుగు’ ఒక కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే.
For More News..