రిలేషన్ : టాక్సిక్ బిహేవియర్ అంటే ఏంటీ.. ఈ లక్షణాలు గుర్తించేది ఎలా.. అలాంటోళ్లను ఎలా డీల్ చేయాలి..?

రిలేషన్ : టాక్సిక్ బిహేవియర్ అంటే ఏంటీ.. ఈ లక్షణాలు గుర్తించేది ఎలా.. అలాంటోళ్లను ఎలా డీల్ చేయాలి..?

రిలేషన్షిప్స్ లైఫ్ ను బెటర్​ గా  మార్చాలి. ..ఎమోషనల్​ గా సపోర్ట్ ఇవ్వాలి. ..వీటి కోసమే అందరూ రిలేషన్స్​ ను  కోరుకుంటారు. కానీ అదే రిలేషన్ శత్రువుగా మారితే.. అప్పుడది రిలేషన్ కాదు.. 'టాక్సిక్ రిలేషన్' అవుతుంది. టాక్సిక్ రిలేషన్ అంటే. ..విషపూరిత బంధం అని అర్ధం. అంటే రిలేషన్ రానురాను విషపూరితంగా మారి, బంధాన్ని చంపేస్తుంది. ఎలాంటి లక్షణాలు టాక్సిక్ కిందకు వస్తాయో చూద్దాం.

బంధం ప్రమాదమైతే...

నీ కోసం చావడమేకాదు చంపడానికి కూడా రెడీ.. నన్ను ప్రేమించకపోతే, చంపేస్తా ....  నువ్వు నాతో తప్ప ఇంకెవరితో మాట్లాడకూడదు .... నువ్వు ఒప్పుకోకపోతే చచ్చిపోతా  ఇలాంటి మాటలన్నీ సినిమాల్లోనే కాకుండా బయట కూడా వినిపిస్తుంటాయి. అయితే ఇదంతా అమితమైన ప్రేమకు సింబల్ గా కొందరు భావిస్తారు. ప్రేమ బాగా ముదిరితేనో, ఆపుకోలేనంత ఇష్టం ఉంటేనో ఇలాంటి మాటలొస్తాయి అనుకుంటుంటారు. కానీ అది విషపూరితమైన ప్రేమ అని ఎక్స్ ఫర్ట్స్​  చెప్తున్నారు. ఒప్పుకోకపోతే చచ్చిపోతా  అంటున్నారంటే.. అది అమితమైన ఇష్టం కాదు. ప్రేమించమని ఎమోషనల్​ గా  చేస్తున్న బ్లాక్ మెయిల్ అని అర్ధం. ఇది ఒక టాక్సిక్ రిలేషన్​ కు  ఉదాహరణ అని రిలేషన్ షిప్​  నిపుణులు చెప్తున్నమాట. ఇదే కాదు ఇలాంటి టాక్సిక్ లక్షణాలు చాలానే ఉన్నాయి. వాటి గురించి ఎక్స్ ఫర్ట్స్​ ఏమంటున్నారంటే.....

ALSO READ Good Health : మంచి ఆలోచనలు రావాలంటే.. రోజూ వాకింగ్, రన్నింగ్ చేయండి..!

 

పెత్తనం

సాధారణంగా కొంతమంది భార్యాభర్తలో ఒకరిదే పెత్తనం ఉంటుంది. అయితే అది కొంత వరకు అయితే పరవాలేదు. కానీ పెత్తనం కాస్తా ఆధిపత్యంలా మారి, అవతలి వాళ్లు బానిసలా ఉండాలని కోరుకునేదాకా వెళ్తే.. అది టాక్సిక్ లక్షణం విషయం అర్థం చేసుకుని ఏయే విషయాల్లో ఎవరి డెసిషన్ కరక్ట్ అనేది ఆలోచించకుండా.. ప్రతీ విషయంలో "నీకేం తెలియదు' అన్నట్టు వ్యవహరిస్తే.  రానురాను బంధం బలహీనపడుతుంది. ఇంటి విషయంలో భార్యాభర్తల మధ్య పెత్తనం అనేది ఉండకూడదు. ఒకరి నిర్ణయాల్లో ఒకరు చొరవ చూపుతూ, ఇద్దరూ కలిసి డెసిషన్ తీసుకోవాలి.

వాదన

రిలేషన్ షిప్ లో  వాదించుకోవడం తరచూ జరుగుతుంటే ఇద్దరిలో ఎవరో ఒకరిది టాక్సిక్​ బిహేవియర్​ కింద లెక్క పార్ట్ నర్ తో చాలా దురుసుగా మాట్లాడుతూ, అదేపనిగా వాదిస్తున్నారంటే చాలా పెద్ద సమస్య నడుస్తోందని అర్ధం.   అందుకే సమస్య వచ్చినప్పుడు కూల్ గా వ్యవహరించి, నిదానంగా సమస్య గురించి చర్పించే ప్రయత్నం చేయాలి. లేకపోతే చిన్న వాదనే విడిపోయే దాకా తీసుకెళ్తుంది..

మార్చాలనుకోవడం

పార్ట్​ నర్స్ ఒకర్ని మార్చాలని మరొకరు ప్రయత్నించడం కరెక్ట్ కాదు. ఎదుటి వ్యక్తిని అలాగే అంగీకరించకుండా  వాళ్లకి నచ్చే విధంగా మార్చేందుకు  ప్రయత్నిస్తుంటే.. అది టాక్సిక్ లక్షణం. ఎదుటి వారిని మార్చాలని ట్రై చేసినప్పుడు.. ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. మార్చలేకపోతున్నామన్న కోపం కూడా వెంటాడుతుంది. అందుకే ఎదుటివారి మార్చాలనుకోవడం సరైన లక్షణం కాదని అర్థం చేసుకోవాలి.

ALSO READ : పిల్లలకు వీళ్లు చాలా ఇంపార్టెంట్​: అమ్మమ్మ, బామ్మ, తాతయ్యలు.. ఎందుకంటే ..

కించపరచడం..

పార్ట్​ నర్​ని పదేపదే కించపరచడం వల్ల వాళ్లు బాలా డిప్రెషన్ కి లోనవుతారు. ప్రతి చిన్న విషయాన్ని ఇతరులతో పోల్చడం.. చులకనగా చూడటం.. చాలా ఇబ్బంది కలిగిస్తాయి. అలాగే అర్ధం చేసుకోవాల్సిన పార్ట్​నరే  కించపరుస్తున్నారన్న ఫీలింగ్ ఎక్కువవుతుంది. ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తే బంధం ప్రమాదంలో చిక్కుకున్నట్లే. అందుకే రిలేషన్ హెల్దీగా ఉండాలంటే ఒకరినొకరు గౌరవించుకోవడం అవసరం. 

చేయి చేసుకుంటే..

కొందరు తమ పార్ట్​నర్ ను ఎంతగా ప్రేమిస్తున్నా. ఒక్కోసారి మాత్రం తమను తాము కంట్రోల్​  చేసుకోలేక పోతుంటారు. చిన్నచిన్న కారణాలకే తిట్టడం.... కొట్టడం చేస్తుంటారు. ఇది హెల్దీ రిలేషన్ కు అంత మంచిది కాదు. ఇగో... కోపం లాంటివి రిలేషన్స్ ని  ఎప్పుడూ డామినేట్ చేయకూడదు. అలా చేస్తే అది టాక్సిక్ లక్షణం అని గుర్తుంచుకోవాలి...

ప్రైవసీ విషయంలో..

సొంత విషయాల్లో ఎక్కువ జోక్యం కనిపిస్తే అది కూడా టాక్సిక్ లక్షణం కింద భావించొచ్చు. అంటే మొబైల్స్ చెక్ చేయడం పాస్​ వర్డ్​ లు అడగడం లాంటివన్నమాట. ఎదుటి వాళ్లకి ప్రైవసీ ఇవ్వకుండా... నాకు తెలియకుండా ఏదీ చేయకూడదు అనే ధోరణి రిలేషన్ కు మంచిది కాదు. ఒకరికొకరు స్పేస్ ఇచ్చిపుచ్చుకుంటేనే బంధం బలపడుతుంది.

అబద్దం

ప్రతి విషయంలో 'నువ్వు చెప్పేది అబద్దం' అన్నట్లు వ్యవహరిస్తే అది పూర్తి నెగెటివ్ లక్షణం కింద లెక్క. రిలేషన్​ షిప్​ లో నమ్మకం లేకపోవడం అన్నింటికంటే ప్రమాదకరమైన విషయం. ఏది చెప్పినా నమ్మకపోవడం...  అబద్దం అని కొట్టి పారేయడం లాంటివి పార్ట్​నర్స్ మధ్య ఎమోషనల్ గ్యాప్​ ను  పెంచుతాయి. రిలేషన్​ షిప్​లో  నమ్మకం ఉన్నప్పుడే అది ఎక్కువ కాలం నిలబడుతుంది.

చిన్నవి కూడా

అప్పుడప్పుడు చిన్నచిన్న విషయాలలో పెద్ద గొడవ అవుతుంటుంది. ఇది అన్ని ఇళ్లలో జరిగేదే .  అయితే దీనికంటూ ఓలిమిట్ ఉంటుంది.
ఇష్యూ పెద్దదవుతున్నప్పుడు కొంతకాలానికి ఇద్దరిలో ఎవరో ఒకరు సర్దుకు పోవడం సహజం. అయితే అలా సర్దుకుపోయినప్పటికీ ఇష్యూ క్లోజ్ అవ్వట్లేదంటే... ఎదుటివారిలో టాక్సిక్ బిహేవియర్ ఉన్నట్టు లెక్క. అర్ధం చేసుకోకుండా  పదే పదే ఒకేలా బిహేవ్ చేస్తుంటే.. వాళ్ళకి రిలేషన్​ ను  కాపాడుకోవాలనే ఉద్దేశం లేదేమో అన్న అనుమానం వస్తుంది. ఇలాంటి బిహేవియర్ రిలేషన్ షిప్​నకు  ఏమాత్రం మంచిది కాదు.

ALSO READ : Lifestyle: రోజంతా హుషారుగా ఉండాలంటే ఏంచేయాలో తెలుసా..

ఈ పదాలు తరచుగా

సారీ, నో అన్న పదాలు ఎక్కువగా వస్తున్నపుడు రిలేషన్ పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రతిసారి 'సారీ' చెప్పాల్సి రావడం... ఏది అడిగినా 'నో' అనడం లాంటివి మంచి సంకేతాలు కాదు. సారీ, నో అన్నపదాలు తక్కువగా ఉంటే రిలేషన్స్ ఎక్కువ కాలం హ్యాపీగా ఉన్నట్టు స్టడీస్ చెప్తున్నాయి.

నిద్రకు ముందు

ప్రతి రోజు నిద్ర పోయే ముందు నెగెటివ్ ఆలోచనలు రావడం. ..ఏదో తెలియని బాధతో  కుంగిపోవడం లాంటివి జరుగుతుంటే పార్ట్​ నర్​ది టాక్సిక్ బిహేవియర్ అని అర్ధం చేసుకోవచ్చు. మనిషిలో రోజంతా జరిగిన విషయాల్లో బెస్ట్ ఫీలింగ్స్ రాత్రి గుర్తుకువస్తాయి. అందుకే రాత్రి పడుకోబోయే ముందు బాధ పెట్టే విషయాలు ఎక్కువగా గుర్తుకొస్తే మీ లైఫ్ హ్యాపీగా లేనట్టు లెక్క. దానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. ఒకవేళ కారణం పార్ట్​నర్ బిహేవియర్ అయితే రిలేషన్ టాక్సిక్​ వలలో చిక్కుకున్నట్లే దాని గురించి పార్ట్​నర్​ తో  చర్చించి. ఇద్దరి మధ్య హెల్దీ క్రియేట్ చేసుకోవాలి. 

ఇదొక్కటే దారి

టాక్సిక్ బిహేవియర్ ఉన్న వాళ్లతో వీలైనంత వరకు సైలెంట్ గా ఉండడం మంచిది. కూల్​ గా  ఉన్నప్పుడు వాళ్ల బిహేవియర్ ఎంత ఇబ్బంది పడుతుందో చెప్పే ప్రయత్నం చేయాలి. అవసరమైతే.. టాక్సిన్ బిహేవియర్ నుంచి బయటపడేందుకు కౌన్సెలింగ్ తీసుకోవాలి. ఇలాంటి బిహేవియర్ ఇద్దరి భవిష్యత్తుకు ఎంత నష్టం చేస్తుందో వివరించాలి. లాంగ్ టైం రిలేషన్ నిలబడాలంటే టాక్సిక్ బిహేవియర్ నుంచి బయటపడాలి. లేకపోతే రిలేషన్ బ్రేక్ అయ్యే ప్రమాదముంది.

–వెలుగు, లైఫ్​–