రీసెంట్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్లో.. టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయంటే

రీసెంట్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్లో.. టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయంటే

ఈమధ్య బుల్లితెర ఆడియన్స్ మైండ్ సెట్ ను ఎవ్వరూ అంచనా వేయలేకపోతున్నారు. ఎందుకంటే, థియేటర్లలో హిట్టయిన సినిమా టీవీల్లో ఫ్లాప్ అవుతోంది. అస్సలు భారీ స్థాయిలో ఊహించిన సినిమాలకు మాత్రం టీఆర్పీ రేటింగ్స్ రావడం లేదు. ఇక థియేటర్లలో ఫ్లాప్ అయిన సినిమాను ఒకలా..హిట్ అయిన  సినిమాకు ఒకలా రేటింగ్స్ వస్తుండటంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇప్పుడు జైలర్ కూడా అదే లిస్ట్ లోకి చేరడం బాధాకరం. 

  • లేటెస్ట్ గా..వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా జైలర్ సినిమాను జెమినీ టీవీలో ప్రసారం చేస్తే, కేవలం 5.39 టీఆర్పీ వచ్చింది. ఇది మన సూపర్ స్టార్ ఫ్యాన్స్కు షాకింగ్ నంబర్ అని చెప్పుకోవాలి. తమిళనాట మాత్రం జైలర్ కు 15.59 TRP తో బంపర్ టీఆర్పీ వచ్చింది. తెలుగులో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. 
  • వేణు వెల్డండి తెరకెక్కించిన బ‌ల‌గం మూవీ రికార్డ్ టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకొని బుల్లితెర‌పై సంచ‌ల‌నం సృష్టించిన విషయం తెలిసిందే.  స్టార్ మా ఛానెల్‌లో ఈ సినిమా టెలికాస్ట్ అయ్యి..ఫ‌స్ట్ టీవీ ప్రీమియ‌ర్ కు 14.30 టీఆర్‌పీ రేటింగ్ వ‌చ్చింది. 
  • రవితేజకు ఒక రకంగా మళ్లీ ఊపిరి పోసిన ధమాకా మూవీ మాత్రం టీవీలోనూ దుమ్ము రేపింది. టెలివిజన్ ప్రీమియర్ రాగా.. దానికి ఏకంగా 10.08 టీఆర్పీ రేటింగ్ రావడం విశేషం. మార్చి 26న స్టార్ మాలో వచ్చిన ధమాకా..మంచి టీఆర్పీని సొంతం చేసుకోవడం విశేషం.
  • ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల‌ ఆస్కార్ విన్నింగ్ మూవీ ఆర్ఆర్ఆర్ (8.17), అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ (13.7) 

ప్రభాస్ రామాయణంని బుల్లెతెరపై  బంపర్ హిట్ మూవీగా నిలిచేలా చేశారు ఆడియన్స్. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా ఛానెల్ లో ప్రసారం చేయగా..ఈ సినిమాకు ఏకంగా 9.47 (అర్బన్) రేటింగ్ వచ్చింది. అంతేకాదు ఈ మధ్య కాలంలో వచ్చిన రేటింగ్స్ అన్నిటినీ చూసుకుంటే..ఆదిపురుష్ సినిమా బుల్లితెరపై బ్లాక్ బస్టర్ హిట్టని చెప్పుకోవాలి. 

రిలీజ్ టైములో ఆదిపురుష్ మూవీపై వచ్చిన నెగిటివిటీ అంత..ఇంత కాదు. అలాంటి మూవీ ఓటీటీలో,టెలివిజన్ లో హిట్ అవ్వడం చాలా గొప్ప విషయమని సినీ క్రిటిక్స్ చెబుతున్నారు. అంతేకాకుండా ఈ మూవీ ప్రసారం అయ్యే టైంలోనే..వరల్డ్ కప్ మ్యాచ్ కూడా టీవీ లలో ప్రసారం అవుతున్న..ఇంత పెద్ద రేటింగ్ తెచ్చుకోవడం విశేషం. 

  • ఇక రీసెంట్ సూపర్ హిట్ మూవీస్ గా నిలిచిన బాలయ్య వీర సింహారెడ్డి (8.83),  చిరంజీవి వాల్తేరు వీరయ్య (5.41) టీఆర్పి రేటింగ్స్ రాగా.. పవన్ కళ్యాణ్ బ్రో, గాడ్ ఫాదర్, కార్తికేయ-2, సర్దార్ సినిమాలు కూడా టెలివిజన్ షో లో అంతగా రేటింగ్ తెచ్చుకోలేదు.