మనిషి ఏం చేసినా చివరిగా కోరుకునేది సంతోషమే కదా! మరి సంతోషం ఎలా పుడుతుంది? లగ్జరీ లైఫ్, ఫ్రెండ్స్, మంచి శాలరీ, ఆస్తి, పేరు, హోదా.. ఇవన్నీ సంతోషాన్ని తీసుకొస్తాయా? అలా అయితే ఇవన్నీ ఉన్న మిలియనీర్స్ ఎంతోమంది నన్ను కలిశారు. చాలా విషయాలు నాతో పంచుకున్నారు. వాళ్లలో ఎక్కువమంది ఒత్తిడి, ఒంటరితనంతో లోలోపల బాధపడుతున్నట్లు చెప్పారు. అంటే సంతోషాన్ని డబ్బు, హోదాతో కొనలేం అన్నమాట!' అంటారు బౌద్ద గురు దలైలామా. నిజమైన సంతోషం ఏదీ? అది ఎక్కడ దొరుకుతుంది అనేది దలైలామా మాటల్లోనే..
కరుణ, ప్రేమ బ్రెయిన్ స్మూత్ గా పని చేయడానికి సాయపడతాయి. ఒకవేళ భయం, కోపం పుడుతున్నాయి. అంటే మెదడు బలహీనంగా పని చేస్తోందని అర్థం. తొంబై శాతం నెగెటివ్ నెస్ మన మెంటల్ ప్రొజక్షన్ వల్లే కలుగుతుంది. అది మనకు మనం తెచ్చిపెట్టుకునేది. కరుణ మనలో శక్తిని పెంచుతుంది. అది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింది.. భయాన్ని తగ్గిస్తుంది. మనము ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.. సంతృప్తికి, సంతోషానికి కారణమవుతుంది. శారీరక స్థితి ఎలా ఉన్నా.. మానసిక ప్రశాంతక చాలా అవసరం.
ఉదాహరణకు ఒలంపిక్స్ రెడీ అపుతున్న వ్యక్తిని తీసుకుంటే. వాళ్లు శారీరకంగా ఎంత బాధని అనుభవిస్తున్నా, ప్రాక్టీస్ తర్వాత. మెంటల్ గా వాళ్లు సంతోషంగా ఫీలవుతారు. ఫిజికల్ లెవెల్ కంటే మెంటల్ లెవెలే ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తుంది. మానసిక స్థితే డామినేట్ చేస్తుంది. సమస్యలన్నింటినీ వదిలించుకోవడం అంటే ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. మైండ్ ని కామ్ గా ఉంచగలగడమే దానికి పరిష్కారం. అది అసలైన సంతోషాన్నిస్తుంది.
ప్రియమైన సోదరీ సోదరీమణులారా నేను చాలా సంతోషంగా ఉన్నాను. సంతోషం గురించి నన్ను ఎవడు అడిగినా .. నువ్వు సంతృప్తి చెందుతున్నట్లు నీకు తెలియడాన్నే సంతోషం అంటాను. సంతోషం అనేది కచ్చితంగా ఒక ఇష్టమైన అనుభవం మాత్రమే కానవసరం లేదు. అది దుఃఖం కాదు. సుఖం కాదు. అదొక న్యూట్రల్ ఎక్స్ పీరియన్స్ ఇది జనంతమైన సంతృప్తిని తీసుకురాగలదు.
ఏది నిజమైన సంతోషం
ఏది నిజమైన సంతోషం అంటే ప్రశాంతమైన మనసే సంతోషం అని నేను నమ్ముతాను. హృదయంలో కరుణ, ప్రేమ ఉండటం వల్లనే మనసు ప్రశాంతంగా మారుతుంది. అవి ఎదుటి వాళ్ల పట్ల ఉండే ద్వేషం, కోపం, ఈర్ష్య లాంటి చెడు బావోద్వేగాలను తగ్గిస్తుంది. సందేహాల్ని తీరుస్తుంది. నేను చాలా ఓపెన్ గా ఉంటాను. నేను 'సమ్ థింగ్ స్పెషల్' అని ఎప్పుడూ అనుకోను. ఒకవేళ నేను మీ కన్నా సమ్ థింగ్ స్పెషల్, ప్రత్యేకం అని భావించుకున్నా. నేను బుద్ధిస్ట్ అనో.. దాని కన్నా ఎక్కువ. నేను బుద్దుడి మహత్యం అయిన దలైలామా అనో.. అని నాకు నేనే గొప్పగా అనుకుంటే నన్ను నేను జైలో బంధించుకున్నట్లే! నేను అవన్నీ మర్చిపోతాను ఈ భూమి మీద ఉన్న ఏడు వందల కోట్ల మంది మనుషుల్లో నేనూ ఒకడినని అనుకుంటాను. మానసికంగా. భావోద్వేగాల పరంగా బుద్ధిపరంగా మనుషులంతా ఒక్కటే..
సంతృప్తి ఎక్కడ దొరుకుతుంది?
సంతృప్తిని డబ్బులతో కొనగలమా.. కొనగలమా? షాప్ నకు వెళ్లి సంతోషం ఇవ్వమంటే నవ్వుతారు. అయితే, అదెక్కడో లేదు. సంతృప్తికి మూలం మనలోనే ఉంది. మీరు తప్పుడు పనులు చేస్తే ముఖ్యంగా ఇతరులకు హాని కలిగిస్తే కచ్చితంగా ప్రతికూల పరిణామాలు ఎదుర్కొంటారు. ఒకవేళ మీరు ఇతరులకు సాయం చేస్తే, ఇతరుల ముఖాల్లో సంతోషం తీసుకురాగలిగితే, దాని వల్ల నీవు లాభం పొందుతావు. మన లోపల అనంతమైన 'శక్తి ఉంటుంది. అది గొప్ప ఆత్మవిశ్వాసాన్ని సృష్టిస్తుంది. అదే మన జీవిత ప్రయోజనం ఏంటో చెప్తుంది. దాన్ని నెరవేర్చుకునే క్రమంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. యవ్వనంలో మనలో చాలా శక్తి ఉంటుంది. కానీ, విలువల గురించి మాట్లాడని సమాజంలో పెరుగుతున్నప్పుడు, చుట్టుఉన్నవాళ్లు కరుణ, ప్రేమ ప్రాముఖ్యత గురించి మాట్లాడనప్పుడు ఆ శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు కేవలం బయట జరిగే విషయాల గురించి. డబ్బు, రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు. ఇవీ శక్తిని తగ్గించేవే!
ALSO READ | అనుకున్నది సాధించాలంటే ఏం చేయాలో తెలుసా.. వివేకానందుడు చెప్పినవి ఇవే...
నిజానికి 20వ శతాబ్దం మొదటి అర్థభాగంలో సానుకూల మార్పులు వచ్చాయి. ఆ సమయంలోనే ప్రపంచం తీవ్రమైన సంక్షోభంలో ఉంది. కానీ, విలువలతో కూడినమంచి విషయాలు కూడా అప్పుడే ఎక్కువ జరిగాయి. మనిషి సోషల్ యానిమల్ కాబట్టి స్నేహంగా ఉండటం చాలా ముఖ్యం... నమ్మకం- నుంచే స్నేహం పుడుతుంది. భయం...నమ్మకం,మధ్య ఎప్పుడూ యుద్ధం జరుగుతుంది. భయం ఎక్కువగా ఉన్నప్పుడు, నమ్మకం అభివృద్ధి
చెందదు. భయంతో మనం స్నేహాన్ని ఎలాఅభివృద్ధి చేసుకోగలం?
ఒంటరితనం
ఈ ప్రపంచంలో ఎక్కువమంది. డిప్రెషన్ కికారణం. ఒంటరితనం దీని నుంచి ఎలా.బయటపడాలి?' అని నన్ను అడుగుతారు. ఒక పెద్ద పట్టణంలో చాలామంది మనుషులు ఉంటారు. ఫీలవుతుంటారు. ప్రేమ అనే భావన లేకపోవడం, ప్రతి దాన్ని కాంపిటీటివ్ గా ఫీలవడం, ఈర్ష తో ఉండటం వల్ల నమ్మకం పోతుంది. నమ్మకం లేనప్పుడు నిరాశ కలుగుతుంది. ఇది ఆటోమెటిక్ గా ఒంటరిగా ఉన్న పీలింగ్ లను తీసుకొస్తుంది. ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ చుట్టూ ఉన్న పర్యావరణం, మనుషులు క్రియేట్ చేయరు. తమ మానసిక ప్రవర్తనే దాన్ని క్రియేట్ చేస్తుంది. మనల్ని మనం లోతుగా అర్ధం చేసుకోవడం మొదలు పెట్టినప్పుడే మనలో కొత్త వ్యక్తి పరిచయమవుతాడు. "నేను ఇప్పుడు. కచ్చితంగా ఒక కొత్త మనిషిని తయారు. చేయాలి. అదే శరీరం కానీ, కొత్త వ్యక్తి! హృదయం నిందా ప్రేమ, కరుణ నిండిన కొత్త వ్యక్తి!!' అని ప్రార్థన చేయండి
జీవిత పరమార్థం
మనిషి లక్ష్యం. జీవిత ప్రయోజనం,రెండూ సంతోషమే కదా? ఆశ, సంతోషం. అనే సానుకూల అంశాల వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మన ఆరోగ్యం మనసులో ఉండే సంతోషం పైనే ఆధారపడి ఉంటుంది. మనం ఏదైనా మంచి పని చేసినప్పుడు మాత్రం సేఫ్ గా ఫీలవుతాం. అదేదైనా మనల్ని భయపెడితే అభద్రతకు గురవుతాం. కోపం తెచ్చుకుంటాం. కోపం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అంతే మన దగ్గర ఉన్న వాటిని దూరం చేస్తుంది. బుద్ధిజం కూడా అదే చెస్తోంది. నెగిటివ్ ఎమోషన్స్ కలిగినప్పుడు... రియాలిటీ చూడలేం. ఏదైనా ఒక నిర్ణయం. తీసుకోవాల్సి వచ్చినప్పుడు మైండ్ ను కోపం డామినేట్ చేస్తుంది. అప్పుడు. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాయి.. ఎవరూ చెడు నిర్ణయాలు తీసుకోవాలనుకోరు. కానీ, క్షణంలో మన మైండ్ బలహీనంగా పని చేయడం వల్లే అలా జరుగుతుంది
గొప్ప గొప్ప లీడర్లు కూడా దీన్ని చవి చూశారు.
-వెలుగు లైఫ్