ప్రతి ఒక్కరూ రోజులో తన గురించి తాను ఆలోచించే దానికన్నా ఇతరుల గురించి ఆలోచించేదే ఎక్కువ. బంధువులు, స్నేహితులు, ఆఫీసులో కొలీగ్స్... ఇలా ఎవరెవరి గురించో ఆలోచిస్తారు తప్ప వాళ్ల గురించి ఆలోచించరు. చాలమందికి తన ఆరోగ్యం, మనసు, ఆలోచనలు, ఇష్టాలు, అభిప్రాయాలు... పట్టవు. పక్కవాళ్లు ఎంత సంపాదించారు. ఏమేమి కొనుక్కున్నారు. ఎవరిలో ఏ లోపం ఉంది... వంటి వాటి మీదే ఆలోచనలన్నీ. కానీ తనేంటో తెలుసుకోవడమే నిజమైన మార్గం అని చెప్తాయి ఆధ్యాత్మిక గ్రంథాలు.
ఎంత సంపాదించాం... ఏం కొనాలి... ఇంకా ఏం కావాలి అని తర్జనభర్జనలు పడుతుంటారు. చాలామంది గొప్పగా, దర్జాగా ఉండాలని కోరుకుంటారు. కానీ తనకంటూ సొంతవైన ఆలోచనలు, అభిప్రాయలు ఉండవు. లోకం ఎలా పోతుంటే అలా పోతారు. ఇంటిపక్కవాళ్లకు రెండు కార్లు ఉంటే మూడు కొనాలనుకుంటారు. తెలిసిన వాళ్లకు అరకేజీ బంగారం ఉంటే కేజీ సంపాదించాలని పోటీ పడతారు. కానీ తనేంటో తెలుసుకోవడమే నిజమైన మార్గం అని చెప్తాయి ఆధ్యాత్మిక గ్రంథాలు.
ఆనందమే అసలు మార్గం
కొత్తకారు కొన్నారా...? కొత్త బట్టలు వేసుకున్నారా? అన్నవి ముఖ్యం కాదు. ఆనందంగా ఉన్నారా లేదా అన్నది ముఖ్యం. అందుకోసం ఎవర్నివాళ్లు తెలుసుకోవాలి. సంతోషం అంటే బయటకు కనిపించే హంగులు, ఆర్భాటాలు కాదు. హృ దయాన్ని పట్టించే ఓ మంచి మార్గం. సుఖంగా జీవించడం కోసం, గుర్తింపుకోసం చాలా మంది లక్ష్యాలు పెట్టుకుంటారు. వాటిని సాధించడానికే సమయాన్ని కేటాయిస్తారు.
Also Read : వైష్ణవుల మహా పుణ్యక్షేత్రం శ్రీరంగం
కానీ అవి నిజంగా సంతోషాన్నిస్తాయా... అంటే కాదనేచెప్పాలి. ఇం కొందరైతే మేం చెప్పిందే వినాలి... అని మాత్రమే ఆలోచిస్తారు. కానీ నిజమైన సంతోషం ఎవర్ని వాళ్లు తెలుసుకోవడమే అని చెప్తాయి . ఇతిహాసాలు, పురాణాలు. అయితే అందుకోసం కఠోరసాధన అవసరం లేదు. పూర్వకాలంలో మునుల్లా అడవులకు వెళ్లి తపస్సులు చేయాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా బతకాలి..
ఇష్టంగా బతకడమే
ప్రశాంతంగా ఉండటం అంటే ఇష్టంగా బతకడం. మనసును కలుషితం చేసుకోకూడదు. ప్రతి మనిషి మనసును అంటిపెట్టుకునే బతకాలి. కోట్ల ఆస్తులున్నా, ఎప్పటికప్పుడు అవసరాలు తీరుతున్నా మనసులో అసంతృప్తి, ఏదో కోల్పోయామన్న ఆలోచన ఉందంటే... వాళ్లు తప్పనిస రిగా వాళ్లలా బతకడం లేదన్నమాట. బతకడం అంటే వ్యాపారం కాదు. షాపింగ్ మాల్స్ లో దొరికే విలువైన వస్తువులతో జీవించడం కాదు. అంతర్గతంగా ఎలా ఉన్నారో తెలుసుకుని... అందుకు అనుకూలంగా జీవించడం బయటకు, లోపలకు మధ్య ఒక లింక్ ఉండాలి. ఆ లింక్ తెలుసుకుంటే ఆనందం సొంతమవుతుంది. ఆనందం పొందడం అంటే ఎక్కడ నుంచో పొందడం కాదు. లోపలున్న దాన్ని వెలికితీయ డమే నిజమైన ఆనందం. అలా గుర్తించిన రోజు మనిషి, మరో మనిషిలో దేవుడినే చూడగలుగుతా దని అంటారు.
ప్రతి ఒక్కరిలో దేవుడు
దేవుడి గురించి తెలుసుకోడానికి భక్తులు శోధించాలి. తర్కించాలని చెప్తారు ఆధ్యాత్మి కవేత్తలు. అసలు దేవుడి గురించి అన్వేషించ డం అంటే మనిషి తన గురించి తాను లోతుగా పరిశీలించుకోవడం లాంటిదే. ప్రతి వ్యక్తి తనలో ఉన్న మంచి చెడును, అందుకు గల కారణాలు పూర్తిగా గమనించగలిగితే చాలు. చెడును వెళ్లగొట్టి, మంచిని మరికొంత పెం. చుకోవచ్చు. అలా పెంచుకోగలిగితే మనిషి గొప్పవాడవుతాడు.
అలాగే చుట్టూ ఉన్న సమాజ పోకడలో పడి కొట్టుకు పోకుండా సొంతంగా ఆలోచించాలి. సొంత ఇష్టాలేమిటి, అభిప్రాయాలేమిటి, దేనిలో సంతోషం దొరుకుతుంది కూడా తెలుసుకోవాలని ప్రవచనకర్తలు చెప్తుంటారు. అలా తెలుసుకుని, వాటికోసం కష్టపడి, దక్కించుకుంటే ఆనందం దొరుకుతుంది. అలాగే చుట్టూ ఉన్నవాళ్లలో మంచిని మాత్రమే చూడగలుగుతారు. ఒక వ్యక్తిని అలాగే స్వీకరించే గొప్ప గుణం అలవడుతుంది. అదే ఉత్తమమైన మార్గం. భక్తి మార్గంలో దేవుడిని చేరుకునేది కూడా ఇలాంటి ఆనందం కోసమేనని పురాణాలు చెప్తాయి.
–వెలుగు, లైఫ్–