ఏంటీ ట్రూత్ సోషల్..ఇందులో మోదీ అకౌంట్ క్రియేట్ చేయటం వెనక ఉద్దేశం ఏంటీ..?

ఏంటీ ట్రూత్ సోషల్..ఇందులో మోదీ అకౌంట్ క్రియేట్ చేయటం వెనక ఉద్దేశం ఏంటీ..?

ట్రూత్ సోషల్.. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫాం గురించే చర్చ..ఎందుకంటే ఇటీవల ప్రధాని మోదీ కూడా ట్రూత్ సోషల్ లో అకౌంట్ ఓపెన్ చేశారు. అంతేకాదు..ఈ సోషల్ మీడయా ప్లాట్ఫాంలో తన మొదటి పోస్ట్గా 2019లో అమెరికా పర్యటనలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. తర్వాత ట్రంప్, అమెరికా ఉపాధ్యక్షుడు జాండీ వాన్స్ ను ఫాలో అవుతున్నారు. దేశ ప్రధాని పేరున అకౌంట్ ఓపెన్ చేయడం..ప్రముఖులను ఫాలో అవుతుండటంతో ట్రూత్ సోషల్ గురించి చర్చకు వచ్చింది. అయితే ఇందులో మరే ఇతర ప్రముఖ నేతలు లేకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించింది. ఇంతకీ ఈ ట్రూత్ సోషల్ ప్లాట్ ఫాం ఎప్పుడు ప్రారంభించారు.. ఎవరు లాంచ్ చేశారు. ఎవరికోసం ఈ ప్లాట్ ఫాం పనిచేస్తుందో ఈ కొత్త సోషల్ మీడియా ప్లాట్ గురించి లోతుగా పరిశీలిస్తే.. 

2022లో ట్రూత్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం లాంచ్ చేశారు. 2020 ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయిన తర్వాత ఈ ప్లాట్ ఫాం లాంచ్ ప్రారంభించారు. ఈ ప్లాట్ ఫాం లాంచింగ్ వెనక పెద్ద కథే ఉంది. ట్రంప్ ఓటమి తర్వాత ఫేస్ బుక్, ట్విట్టర్ సహా ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ ఫాంలన్నీ ట్రంప్ ఖాతాలు నిషేధించబడ్డాయి. దీంతో తనకంటూ ఓ ప్లాట్ ఫాం ఉండాలంటూ  కమ్యూనికేషన్ కోసం ట్రంప్ ట్రూత్ సోషల్ ను ప్రారంభించారు. ఈ ప్లాట్ ఫాం..మైక్రోబ్లాగింగ్ సైట్ X  లాగానే  పనిచేస్తుంది. కస్టమర్లు ట్రూత్స్, రీట్రూత్స్ పోస్ట్ చేయొచ్చు.  

ALSO READ | Layoffs: ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు.. 2వేల మంది ఉద్యోగులు అవుట్

ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ ఆధ్వర్యంలో ట్రూత్ సోషల్ నడుస్తోంది..ఇందుల్లో ట్రంప్ కు 57 శాతం వాటా ఉంది. మిగిలిన వాటా ARC గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్, ఇతర ఇన్వెస్టర్లది. ఈ ప్లాట్ ఫాంకు దాదాపు 9.2 మిలియన్ల యూజర్లున్నారు. అయితే ఎలాన్ మస్క్ కు చెందిన Xలో ట్రంప్ కు దాదాపు 100 మిలియన్ల ఫాలోవర్లు ఉండటం విశేషం.