గుడ్ న్యూస్: యూట్యూబ్ వీడియోలు, రీల్స్ చేస్తే రూ. 8లక్షలు..

గుడ్ న్యూస్: యూట్యూబ్ వీడియోలు, రీల్స్ చేస్తే రూ. 8లక్షలు..

సోషల్ మీడియా ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది.ఒకప్పుడు కాలక్షేపానికి మాత్రమే అన్నట్లు ఉన్న సోషల్ మీడియా ఇప్పుడు చాలా మందికి ఆదాయ వనరుగా మారింది. సోషల్ మీడియాలో అప్డేట్స్ పోస్ట్ చేయనిదే రోజు గడవనివారు చాలా మంది ఉన్నారు. అయితే, సోషల్ మీడియాలో ఫేమ్ సంపాదించి సెటిల్ అయినవారు ఎంతమంది ఉన్నారో... సోషల్ మీడియాకు బానిసలయ్యి నష్టపోయేవారు కూడా అంతకంటే ఎక్కువ మందే ఉన్నారు. ఇదిలా ఉండగా.. యూట్యూబర్లకు, రీల్స్ చేసేవాళ్లకు అదిరిపోయే న్యూస్ చెప్పింది యూపీ సర్కార్. యోగి సర్కార్ పొందుపరిచిన కొత్త సోషల్ మీడియా పాలసీ ప్రకారం యూట్యూబర్లకు రూ. 8లక్షలు, ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేసేవారికి రూ.5 లక్షలు ఇవ్వనుంది.

Also Read :- ఫ్రీ ఆధార్ అప్డేట్ గడువు ముగుస్తోంది

రోజురోజుకీ పెరుగుతున్న సోషల్ మీడియా సెలెబ్రిటీలను ప్రభుత్వానికి అనుకూలంగా వాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా...ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో సంఘవ్యతిరేక పోస్టులు షేర్ చేసినా, అలాంటి చర్యలను ప్రోత్సహించినా జీవిత ఖైదు వేసే విధంగా సోషల్ మీడియాలో పాలసీలో మార్పులు చేసింది యూపీ ప్రభుత్వం.

అంతే కాకుండా వివిధ సోషల్ మీడియా ప్లాటుఫార్మ్స్ కు పేమెంట్ రిస్ట్రిక్షన్స్ తో పాటు వయోపరిమితులు కూడా విధించింది యోగి సర్కార్. కొత్త సోషల్ మీడియా పాలసీ పట్ల యూపీకి చెందిన యూట్యూబర్లు, సోషల్ మీడియా సెలెబ్రిటీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.