కొత్త వైరస్ : దేశంలో పసుపు జ్వరం.. లక్షణాలు ఏంటీ.. జాగ్రత్తలు ఎలా..!

కొత్త వైరస్ : దేశంలో పసుపు జ్వరం.. లక్షణాలు ఏంటీ.. జాగ్రత్తలు ఎలా..!

కరోనా వైరస్​ తరువాత... రోజుకొక కొత్త వైరస్​ పుట్టుకొస్తుంది.  ఎప్పుడు ఏ వ్యాధి... ఎలాంటి ఫీవర్​ వస్తుందో అర్దం కావడం లేదు.  జికా వైరస్​.. నియో వైరస్​ ఇలా రూపాంతరం చెందుతూ ఇంకా జనాలను భయపెడుతోంది. ఇప్పుడు తాజాగా మరో వైరస్​ బయలు దేరింది.. ఈ వైరస్​ సోకితే పసుపు జ్వరం వస్తుంది.  అసలు ఈ జ్వరం ఎలా వస్తుంది.. దేని ద్వారా వ్యాపిస్తోంది ఈ జ్వరం లక్షణాలు.. నివారణ మార్గాలను ఒకసారి చూద్దాం. . . 

పసుపు జ్వరం .. ఇది అంటు వ్యాధి..   దోమల దాడి వలన  కలిగే అతి భయంకరమైన ప్రమాదకరమైన వ్యాధి. ఎల్లో ఫీవర్​  ఒక రకమైన వైరల్ ఫీవర్ అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వాతావరణం.. పరిసరాల అపరిశుభ్రత .. దోమల వ్యాప్తి వలన కలిగే వ్యాధులలో ఇది ఒకటి.  రోగ నిరోధక శక్తి తక్కువుగా ఉన్న వారికి ఈ ఫీవర్​ త్వరగా సోకుతుంది. .

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిసిన వివరాల ప్రకారం ... పసుపు జ్వరం అనేది  వ్యాధి సోకిన దోమలు కుట్టినప్పుడు వచ్చే వైరల్ వ్యాధి. ఇది ఎక్కువగా ఆఫ్రికాలోని ఉష్ణమండలం..  ఉపఉష్ణమండల ప్రాంతాల వారికి వస్తుంది. ఇలాంటి దోమలు ఎక్కవుగా అమెరికాలోని దక్షిణ ప్రాంతాలలో కనిపిస్తాయి. చాలా అరుదైన వ్యాధి అయినప్పటి...  తమిళనాడులో ఈ వ్యాధికి సంబంధించిన మూడు వ్యాక్సిన్​ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆ రాష్ట్ర  సుబ్రమణియన్  తెలిపారు. తమిళనాడు ప్రజలు ఎల్లో ఫీవర్​  వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు.

పసుపు జ్వరం అంటే ఏమిటి?

పసుపు జ్వరం సోకిన వారికి అధిక ముప్పు వాటిల్లే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.  ఈ వ్యాధి మూడు రకాలుగా వ్యాపిస్తుంది.  అటవీ(సిల్వాటిక్) ప్రాంతంలో ఉండే కోతులను దోమలు కరచినప్పుడు వాటి ద్వారా మొదటి దశలో వ్యాపిస్తుంది. అంతే కాకుండా ఈదోమలు గేదెలు,, ఆవులు..వంటి వాటిని కరిస్తే.. వాటి ద్వారా వచ్చే పాలను తీసుకున్న వారికి కూడా ఎల్లో ఫీవర్​ వస్తుంది.  రెండో దశలో సెమీ డొమెస్టిక్​ దోమలు అంటే ఇలాంటి దోమలు ఇళ్లలోకి వచ్చి కుడతాయి. అలాంటి వారికి పసుపు జ్వరం వస్తుంది.  ఇక మూడో విధానంలో దోమలు ఎక్కువుగా సంచరించే ప్రాంతాల్లో నివసించే వారికి వస్తుంది.  ఈ వ్యాధి త్వరగా వ్యాపిస్తుంది. పసుపు జ్వరం సోకిన వారికి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది,  ఈ దోమలు దాడి చేస్తే హానికరమైన రసాయనాలు  రక్తంలో కలిసి వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. 

అన్ని దోమలు కుడితే వ్యాధులు రావు, ఈడెస్​, హేమాగోగస్ వర్గానికి చెందిన దోమలు కుడితే పసుపు వైరస్​ సంక్రమిస్తుంది, 1960 లో ఈ వ్యాధి ఎక్కువుగా వ్యాపించిందని కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది.  ఏడెస్ దోమ డెంగ్యూ ఫీవర్​ , జికా వైరస్  చికున్‌గున్యా  లాంటి విష జ్వరాలు వస్తాయి. ఎల్లో ఫీవర్​ లక్షణాలు వారం రోజుల్లో  బయటపడుతాయి.   ఏమాత్రం కొద్దిగా అస్వస్థతగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. 

ఎల్లో ఫీవర్​ లక్షణాలు

  • అకస్మాత్తుగా జ్వరం
  • తీవ్రమైన తలనొప్పి
  • శరీరం నొప్పులు
  • అలసట
  • వాంతులు 
  • చర్మం, కళ్లు పసుపు వర్ణంలోకి మారడం
  • రక్తస్రావం
  • ఉన్నట్టుండి షాక్​ కు గురికావడం ( ఉలిక్కిపడటం)

పసుపు జ్వరం నివారణ మార్గాలు

 

  • దోమల నివారణకు మస్కిటో కాయిల్స్​... దోమ తెరలు వాడాలి
  • శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి
  • ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
  • వ్యాధి సోకినట్లయితే నీరు ఎక్కువుగా తాగాలి
  • ఏమాత్రం అస్వస్థతగా ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. 

ఇన్‌ఫెక్షన్‌ సోకిన  దోమ ద్వారా ఈ ఫీవర్ మనుషులకు సోకుతుందని చెబుతున్నారు.  వ్యాధి సోకిన వ్యక్తుల లక్షణాల ఆధారంగా చికిత్స అందించాలని చెప్పారు. ఎల్లో  ఫీవర్ బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు ప్రజలకు సూచిస్తున్నారు.