పిల్లలు ఏది పెడితే అదే తింటారు. వాళ్లకు రుచే తప్ప అందులో ఉండే పోషకాల గురించి తెలియదు కదా. అందుకే వాళ్లకి ఏం పెడుతు న్నాం, ఏం తింటున్నారు? అన్న విషయాన్ని తల్లిదండ్రులే చూసుకోవాలి. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు సరైన పోషక విలువలున్న ఆహారాన్ని అందించాలో తెలుసుకుందాం. . .
ఎదిగే వయసులో సరైన ఆహారాన్ని అందించ కపోతే పిల్లల్లో ఎదుగుదల సమస్యలే కాదు.. బలహీనంగా మారడం, బరువు పెరగకపో వడం, బుద్ధి మందగించడం లాంటి సమస్య లు కూడా మొదలవుతాయి. అందుకే ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లల్లో డైట్ సరిగా ఉండాలి. అంతే కాకుండా ఆ వయ సులోనే పిల్లలు ఎక్కువ యాక్టివ్ కూడా ఉంటారు. శారీరక శ్రమ ఎక్కువ ఉండడంవల్ల త్వరగా అలిసిపోతారు. అందుకే వారికి రోజులో 4 నుంచి 5సార్లు భోజనం తినిపించా లి. ఇందులో ఎక్కువ కూరగాయలు, పండ్లు, పాలు ఉండేలా చేస్తే ఇంకా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
పిల్లల్లో చిన్న వయసులోనే ఊబకాయం రాకూడదంటేఆహారంలో గోధుమ, బియ్యం, ఓట్స్, కార్న్మ ల్, బార్లీలాంటివి కచ్చితంగా ఉండేలా చూసు కోవాలి. ఇవేకాకుండా బ్రౌన్ రైస్, ఓట్మీల్స్ లాంటివి పిల్లల ఎదుగుదలకు మరింత ఉప యోగపడుతాయి. పాల ఉత్పత్తులను కూడాపిల్లలకు అలవాటు చేయాలి. అయితే ఇందులో ఫ్యాట్ ఫ్రీ ఉన్నవాటిని ఎంచుకోవాలి. వీటివల్ల వారికి కావాల్సిన క్యాల్షియం అందుతుంది. అలాగే పిల్లలకు ప్రొటీన్ ఆహారం తప్పకుండా ఇవ్వాలి. దానికోసం చేపలు, నట్స్, లాంటివి పెట్టొచ్చు. అలాగే మాంసం విషయంలో తక్కువ కొవ్వు ఉండే మాంసాన్ని అలవాటు చేస్తే మంచిదని వైద్య నిపుణులు అంటున్నారు.
ఒక్కోసారి పిల్లలు కొన్ని పదార్థాలు తిన దానికి పేచీ పెడతారు. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు పాటించాలి. రోజుకి రెండు మూడు జీడిపప్పులు, బాదం పప్పు వంటివి చేతికి ఇవ్వాలి. వాటిని తిన కపోతే నట్స్ను పొడిచేసి.. ఫ్రూట్ సలాడ్ లేదా పాలల్లో కలిపి ఇవ్వాలి..ఆకుకూరలు, పోషకాలు ఉన్న ఆహారం తినమని మొండికేస్తే వాటిని సమోసాలు, పరోటాల్లో కూరి పెట్టాలి.తయారు చేసిన కోవా. పనీర్, రసమలై వంటివి తినిపించాలి.
క్యారెట్లు, బీట్రూ ట్లు తినకపోతే హల్వా, లౌజుల రూపంలో ఇవ్వొచ్చు. మొలకెత్తిన విత్తనాలు తింటే పిల్లల్లో జ్ఞాప కశక్తి పెరుగుతుంది. అందుకే వారానికి రెండు సార్లయినా పిల్లలకు ఇస్తుండాలి. ఒకవేళ వాటిని ఇష్టపడకపోతే.. నిమ్మర సం, కీర, క్యారెట్ వంటివి కలిపి వెరైటీగా ఇవ్వాలి. బొప్పాయి, కర్బూజ వంటి కొన్ని పళ్లను పిల్లలు ఇష్టపడరు. అలాంటప్పుడు వాటిని ఫ్రూట్ సలాడ్లలో మిక్స్ చేసి ఇవ్వాలి. లేదా వారు ఇష్టంగా తాగే జ్యూసుల్లో రెండు ముక్కలు మిక్సీలో వేసి కలిపేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.ఇకవేపుడు కూరలను ఎక్కువగా ఇష్టపడే పిల్ల లకు డైరెక్ట్ గా వేగించిన వాటిని పెట్టకుండా కూరను కుక్కర్లో ఉడికించి ఆ తరువాత పల్లీలపొడి, పుట్నాల పొడి కలిపి వేపుడు కూరగా పెట్టాలి.