ఎండాకాలం వస్తూ వస్తూ ఎన్నో వ్యాధులను తీసుకొస్తుంది. ముఖ్యంగా పిల్లలకు ఎండాకాలంలో అనేక సమస్యలు వస్తాయి. సెలవుల్లో ఆడుకుంటూ ఎక్కువ సమయం ఎండలోనే ఉంటారు. దాంతో సాధారణంగానే జ్వరం, తలనొప్పి లాంటి సమస్యలు, ఇన్ఫెక్షన్లు వస్తాయి. అయితే వాటి బారిన పడకుండా ఉండాలంటే వాళ్లలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. ఇందుకోసం కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆహారం
పిల్లలకు ఎప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారాన్నే ఇవ్వాలి. ఆహారంలో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ సమానంగా ఉండేట్లు చూసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు, ఎక్కువగా తిని పించాలి. ఇలా చేస్తే పిల్లలో ఇమ్యూ నిటీ పవర్ పెరుగుతుంది. అయితే ముఖ్యంగా పిల్లల ఆహారంలో ఉండాల్సినవి..
అల్లం: ఇందులో ఉండే ఔషధగుణా లు అనేక వ్యాధులను నివారిస్తాయి. పది నెలల వయసు దాటిన పిల్లల ఆహారంలో అల్లాన్ని చేర్చవచ్చు. ఇది దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కల్పిస్తుంది.
పెరుగు : దీనిలో పిల్లల ఎదుగుదలకు కావాల్సిన ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఆహారం తొందరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.
వెల్లుల్లి: దీన్ని చిన్న ముక్కలుగా చేసి ఆహారంలో చేర్చాలి. ఇది గాయాలు త్వరగా మానిపోవడానికి, రోగ నిరోధక శక్తి పెరగడానికి బాగా ఉప యోగపడుతుంది.
పండ్లు: అరటి, బత్తాయి, ద్రాక్ష పండ్లలో విటమిన్స్, యాంటాక్సి డెంట్స్ ఉంటాయి. ఇవి పిల్లలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. బొప్పాయిలో ఉండే విటమిన్-బి, విటమిన్-సి పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడుతాయి. ఇన్ఫెక్షన్లను ఎదురుకునే శక్తిని ఇస్తాయి.
నిద్ర
కొందరు పిల్లలు నిద్రపోకుండా మారాం చేస్తారు. అర్ధరాత్రి వరకు మెలకువగానే ఉంటారు. మళ్లీ ఉదయాన్నే లేస్తారు. దాంతో సరిపడా నిద్ర లేక రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఇలాంటి పిల్లల్ని తల్లిదండ్రులు తొందరగా నిద్రపుచ్చాలి. సరిగ్గా నిద్ర పోకపోతే అనారోగ్య సమస్యలు వస్తా యని చెప్పాలి. కంప్యూటర్లు, స్మార్ట్ఫో న్లకు వీలైనంత దూరంగా ఉంచాలి. తగినంత నిద్ర ఉంటే పిల్లలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
శుభ్రత
పిల్లలో మట్టిలో ఆటలాడి అలసిపో యి వచ్చి తొందరలో చేతులు బాగా కడుక్కోకుండానే తినడానికి రెడీ అవుతారు. దాంతో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఆహారం తినేముందు, తిన్న తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలని పిల్లలకు చెప్పాలి. పెంపుడు జంతువులను ముట్టుకున్నా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే పిల్లలకు వచ్చే వ్యాధుల్లో ఎక్కువ శాతం దుమ్ము, ధూళిలో గడపడం వల్ల, పెంపుడు జంతువుల ను ముట్టుకోవడం వల్లే వస్తాయి.
ఇంకే చేయొచ్చు?
* సరిపడా నీళ్లు తాగాలి. రోజుకు 3నుంచి 4లీటర్ల నీళ్లు తాగితే మంచిది. అలాగని దాహానికి మించినీళ్లు తాగకూడదు.
• కొబ్బరినీళ్లలో పోషకఖనిజాలు ఉంటాయి. ఇది ఎనర్జీ డ్రింక్ కూడా పని చేస్తుంది. కాబట్టి ఎం దాకాలంలో పిల్లలకు కొబ్బరినీళ్లు తాగిస్తే మంచిది. వీటిలో ఎలక్ట్రో లైట్స్ (సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్ లు) వడదెబ్బ బారిన పడకుండా చేస్తాయి.
౦ వేసవిలో వేడి వల్ల శరీర ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. మజ్జిగ తాగితే శరీరంలోని అధిక వేడి తగ్గి చల్లగా ఉంచుతుంది. ఇందులో క్యాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటాయి. దీనిలో ఉండే లాక్టిక్ యాసిడ్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
• సబ్జాగింజల నీళ్లు తాగడం వల్ల ఎండ తాపం నుంచి ఉపశమనం వెంటనే లభిస్తుంది. అంతేకాకుం దా దీనిలోని యాంటీ యాక్సిడెం ట్లు రక్తంలోని షుగర్ లెవల్స్ ను క్రమబద్ధీకరిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో ప్రొటీ న్లు, ఐరన్, విటమిన్ కె ఎక్కువగా ఉంటాయి.