
చైత్రమాసం.. శుద్ద నవమి రోజు ప్రతి పల్లె కూడా జై శ్రీరామ్ అనే నామంతో మారుమోగుతుంది. అభిజిత్ లగ్నంలో జగదేక వీరుడైన శ్రీరామచంద్రునికి... తల్లి జగన్మాత సీతా దేవికి.. అత్యంత వైభవంగా కళ్యాణం చేస్తారు. అయితే కోరిన కోర్కెలు నెరవేరాలంటే శ్రీరాముడిని కొన్ని రకాల పూలతో పూజిస్తే తప్పకుండా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. శ్రీరామనవమి రోజు ఏ పూలతో పూజిస్తే ఏ కోరికలు నెరవేరుతాయో తెలుసుకుందాం..
గన్నెరు పూలు: ఇవి గ్రామాలు.. పట్టణాల్లో కూడా దొరుకుతాయి. చదువుకొనే పిల్లలకు ఙ్ఞాపకశక్తి పెరగాలన్నా.. మేథాశక్తి అభివృద్ది చెందాలన్నా.. మీరు చదివే రంగంలో రాణించాలన్నా సీతారాములను గన్నేరుపూలతో పూజించాలని పండితులు చెబుతున్నారు.
జాజిపూలు : నవమి తిథి రోజున శ్రీరామ చంద్రుడిని జాజి పూలతో పూజిస్తే చెడు ఆలోచనలు రావని పండితులు అంటున్నారు. దుష్ట గుణాలు తొలగిపోతాయని.. చెబుతున్నారు. శ్రీరామనవమి రోజే కాదు.. ప్రతి నవమి తిథి రోజున సీతారాములను జాజిపూలతో పూజిస్తే అంతా మంచే జరుగుతుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. అంతేకాదు ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు ఈ పూలతో పూజిస్తే తొందరగా ఉద్యోగం వస్తుందట.
మల్లెపూలు : మల్లెపూల చెట్టును ప్రతి ఇంట్లో ఉంటుంది. అనారోగ్య సమస్యలతో బాధపడడే వారు శ్రీరామనవమి రోజు మల్లెపూలతో పూజిస్తే ఆరోగ్యం చేకూరుతుందని చెబుతున్నారు.
నందివర్ధన పూలు: ఈ మధ్య కాలంలో చాలా మంది ఇళ్లల్లో మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నారు. సుఖ శాంతులు లేకుండా.. ఎప్పుడో ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటి సమస్యలున్నవారు తప్పకుండా నందివర్దన పూలతో శ్రీరామనవమి రోజున పూజ చేయాలి. కళ్యాణం తరువాత సహజంగా అష్టోత్తరంతో పూజ చేస్తారు.ఆ సమయంలో ప్రతి నామానికి కూడా నందిర్దన పూలతో పూజిస్తే మనశ్శాంతి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
►ALSO READ | జై శ్రీరాం : ఏప్రిల్ 6న సీతారాముల కళ్యాణం.. ఆ రోజు చదవాల్సిన శ్లోకాలు ఇవే....
పద్మ పుష్పం: శ్రీమంతులు కావాలన్నా... , ఐశ్వర్యం సిద్ధించాలన్నా పద్మ పుష్పాన్ని రాములవారికి సమర్పించి నమస్కారం చేసుకుంటే మంచిదంటున్నారు.
పారిజాత పుష్పాలు: చాలా మంది కాలసర్ప దోషాలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు నవమి రోజు పారిజాత పుష్పాలతో స్వామి వారిని పూజిస్తే సమస్త సమస్యలు తొలగిపోతాయట. కుజ దోషం ఉన్న వారు కూడా పారిజాత పుష్పాలతో సీతారాములను పూజించాలి. శ్రీరామనవమి రోజు మొదలు పెట్టి 11 నవమి తిథుల్లో స్వామి వారికి పారిజాత పుష్పాలను సమర్పించాలి. అంటే సెప్టెంబర్ లో వచ్చే మొదటి నవమి తిథి వరకు చేయాలి.
సంపెంగ పూలు: శత్రువులు ఎక్కువగా ఉన్నవారు శత్రు బాధలు తొలగిపోవాలంటే శ్రీరామనవమి రోజు రామయ్యను సంపెంగ పూలతో పూజించాలని చెబుతున్నారు.