గణేష్ చతుర్థి 2024: ఏరంగు వినాయకుడిని పూజించాలి.. విగ్రహం ఎలా ఉండాలి. .

గణేష్ చతుర్థి 2024: ఏరంగు వినాయకుడిని పూజించాలి.. విగ్రహం ఎలా ఉండాలి. .

దేశ వ్యాప్తంగా గణేషుని విగ్రహాల హడావిడి మొదలైంది.  దాదాపు మండపాల నిర్వాహకులు ఇప్పటికే విగ్రహాలకు ఆర్డర్ ఇచ్చారు.  కాని ఇళ్లల్లో కూడా  వినాయకుడి ప్రతిమకు పూజిస్తారు.  మండపాల్లో ఎలా ఉన్నా..  వాస్తు నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం... ఇంట్లో పూజించే వినాయకుడి విగ్రహం ఎలా ఉండాలి.. ఏ రంగులో ఉండాలి. తొండం ఎటువైపు వంపు తిరిగి ఉండాలో తెలుసుకుందాం. . . . . .  .  

హిందూ మతంలో వినాయకుడికి విశిష్ట స్థానం ఉంది. ఆదిపూజ్యుడు. విఘ్నాలకదిపతి వినాయకుడుని ఏ శుభకార్యం, ఏ పూజల్లోనైనా తొలి పూజ చేస్తారు. గణేశుడిని జ్ఞానం, ఆనందం, శ్రేయస్సు, అదృష్టాన్ని ఇచ్చే దేవుడు అంటారు. గణేశుడిని గజాననుడు, గణపతి, ఏకదంతుడు, వక్రతుండుడు, సిద్ధి వినాయకుడు మొదలైన అనేక పేర్లతో కూడా పిలుస్తారు. వినాయక చవితి పండుగ గణేశుడికి అంకితం చేయబడిన హిందూ మతంలోని ముఖ్యమైన పండుగ. ఈ పండగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. హిందూ పంచాంగం ప్రకారం గణేష్ చతుర్థి పండుగ భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి  ( సెప్టెంబర్ 7) రోజున ప్రారంభమై చతుర్దశి రోజున ముగుస్తుంది.

 సహజంగా మట్టి వినాయకుడుని పూజించడం అత్యంత శ్రేష్టం. అయితే రంగుల వినాయకుడిని ఇంటికి తెచ్చుకోవాలని కోరుకుంటే వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం, తెలుపు రంగు గణపతి విగ్రహాలు గృహాల్లో పూజించడం మంచిదని వాస్తు పండితులు చెబుతున్నారు. . తెలుపు రంగు శాంతి , స్వచ్ఛతకు చిహ్నం. ఇంటికి శ్రేయస్సు, శాంతిని తీసుకురావడంలో మీకు సహాయపడుతుంది. 

 
భంగిమను జాగ్రత్తగా చూసుకోండి:
వాస్తు శాస్త్రం ప్రకారం కూర్చున్న భంగిమలో లేదా లలితాసనంలో ఉన్న విగ్రహాన్ని కొనుగోలు చేయడం మంచిది. ఈ భంగిమ విశ్రాంతి, శాంతిని అందిస్తుంది. ఇంటిని మరింత ప్రశాంతంగా మార్చడంలో సహాయపడుతుంది.


గణేశుడి తొండం: వినాయకుడిని ఇంటికి తీసుకొచ్చే ముందు వినాయకుడి తొండం ఎడమ వైపుకు వంగి ఉండే విధంగా చూసుకోండి. అటువంటి వినాయకుడి విగ్రహాన్ని తీసుకురండి. ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సుని ఇస్తుంది.

గణేశుడిని ప్రతిష్టించే దిశ: వాస్తు శాస్త్రం ప్రకారం గణేశ విగ్రహాన్ని ఇంటికి పడమర, ఉత్తరం , ఈశాన్య మూలల్లో ఉంచాలి. హిందూ మతంలోని అత్యంత ముఖ్యమైన దేవతలలో ఒకరైన శివుడు ఇంటి ఉత్తర దిశలో నివసిస్తాడు కనుక గణేశ విగ్రహాన్ని కూడా అదే దిశలో ఉండాలి.