సావరిన్ రేటింగ్స్ ఇచ్చే సంస్థలు పారదర్శకంగా లేవు : నిర్మలా సీతారామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సావరిన్ రేటింగ్స్ ఇచ్చే సంస్థలు పారదర్శకంగా లేవు : నిర్మలా సీతారామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇచ్చే సావరిన్ రేటింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పారదర్శకత లేదని యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఐఎంఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాన్యువల్ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు. ఎమర్జింగ్ మార్కెట్స్ అండ్ డెవలపింగ్ ఎకనామిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఈఎండీఈ)  రేటింగ్స్ సంబంధిత దేశాల ఆర్థిక వ్యవస్థ పరిస్థితులను చూపేలా ఉండాలన్నారు. ఎకనామిక్ ఫండమెంటల్స్ నుంచి ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లను ఆకర్షించడంలో చేసే ఖర్చు వరకు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకోవలన్నారు.

 అలానే క్రెడిట్ రేటింగ్స్ ఇచ్చే సంస్థలు తాము లెక్కించే విధానాన్ని  మెరుగుపరుచుకోవాలని పేర్కొన్నారు. అప్పుడే అప్పులు తీర్చగలిగే సత్తాను ఇవి ప్రతిబింబిస్తాయని అభిప్రాయపడ్డారు. మారుతున్న ఆర్థిక పరిస్థితులకు తగ్గట్టు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్), ఇతర గ్లోబల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సంస్కరణలు రావాలని అన్నారు. గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్యాండింగ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.