Health Alert: ఆరోగ్యానికి డ్రైఫ్రూట్స్, గింజలు.. ఎప్పుడు, ఎలా, ఏ మోతాదులో తింటే మంచిది?

Health Alert: ఆరోగ్యానికి  డ్రైఫ్రూట్స్, గింజలు..  ఎప్పుడు, ఎలా, ఏ మోతాదులో తింటే మంచిది?

చాలామంది ఆరోగ్యంపై అవగామన ఉన్నవాళ్లు వారి రోజువారీ ఆహారంలో డ్రైఫ్రూట్స్, గింజలు తింటుంటారు. నిజానికి వీటిలో ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువే. వీటిలో పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. బాదంపప్పులు, పిస్తా వంటి గింజల్లో విటమిన్లు, పోషకాలతో నిండి ఉంటాయి.  అయితే వీటిలోని పోషకాలు, విటమిన్లు అందరికి మేలు చేస్తాయా..? ఎవరు , ఎప్పుడు ఎలా తినాలి అనే విషయాల్లో కొన్ని డౌట్స్ వస్తుంటాయి. ఈ సందేహాలను ఈ ఆర్టికల్ లో పరిష్కరించుకుందాం.. 

 డ్రైఫ్రూట్స్, నట్స్ అన్నీ ఆరోగ్యానికి మంచివేనా? 

డ్రైఫ్రూట్స్, గింజల్లో పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లతో పుష్కలంగా ఉన్నప్పటికీ అవి అందరికి ప్రయోజకరం కావంటున్నారు డైటీషియన్లు. డ్రైఫ్రూట్స్, నట్స్ ని ఎవరు ఏ మోతాదులో తీసుకోవాలి.. ఎప్పుడు తీసుకోవాలి అనే విషయాలపై కొన్ని సలహాలు సూచనలు చేస్తున్నారు. 

డ్రై ఫ్రూట్స్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. జీర్ణ క్రియను మెరుగు పరుస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అయినప్పటికీ వీటిలో ఉండే కొన్ని సహజ చక్కెరలు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని తగు మోతాదులో తీసుకోవడం అవసరం అంటున్నారు ఢిల్లీకి చెందిన ప్రముఖ న్యూట్రిషనిస్టు దీపాలీ శర్మ. 

ఉప్పు, చక్కెర లాంటి పదార్థాలతో ఈ డ్రైఫ్రూట్స్, నట్స్ తీసుకోవడం మంచిది కాదు అంటున్నారు హైదరాబాద్ రెయిన్ బో చిల్ర్డన్స్ హాస్పిటల్ సీనియర్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అడ్డూ కిరణ్మయి. 

డ్రైఫ్రూట్స్, నట్స్ వినియోగించే విధానం.. 

గింజలు రాత్రి పూట నానబెట్టి తినడం ఉత్తమ మార్గం అంటున్నారు న్యూట్రిషనిస్టులు. ఇది పోషకాల శోషణను అడ్డుకునే, జీవక్రియకు అంతరాయం కలిగించే ఫైటేట్స్ , టానిన్ లను వదిలించుకోవడంలో సహాయపడతాయని అంటున్నారు. నానబెట్టడం సాధ్యం కాకపోతే డీప్ ఫ్రై చేయకుండా డ్రై రోస్ట్ చేసుకొని తినాలి.  

ఆయుర్వేదంలో బాదం, వాల్ నట్ లు , జీడీపప్పు వంటి గింజలను రాత్రంతా నానబెట్టడం సిఫారు చేయబడింది. దీని వల్ల వేడిని తగ్గించడంలో సహాయపడటమే కాకుండా పోషకాల శోషణను మెరుగుపర్చే ఎంజైమ్ ల పనితీరును చక్కబర్చి సులభంగా జీర్ణం చేస్తుంది. కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాల శోషణను నిరోధించే ఫైటిక్ యాసిడ్ ను కూడా నివారించవచ్చునని చెబుతోంది. 

నట్స్ ( గింజలు) లో కేలరీలు, కొవ్వులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునేవారి తగిన మోతాదు అనుసరించి తినడం మంచిదంటున్నారు. నట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి సంతృప్తిని కలిగిస్తాయి. ఇది బరువు తగ్గించే ఆహారంగా తీసుకోవచ్చంటున్నారు డైటీషియన్లు. 

గింజలు ఎప్పుడు తింటే మంచిది.. 

 నట్స్ ( గింజలు) తినడానికి మంచి సమయం అంటే ఉదయం. మధ్యాహ్నం తినడం కూడా మంచిదే అంటున్నారు నిపుణులు. గింజలు నిరంతరం శక్తిని అందిస్తాయి. ఆకలిని తీర్చడంలో సహాయపడతాయి. నిద్రవేళకు అంటే రాత్రిపూట గింజలను తినకుండా ఉండటం మంచిది. ఇవి కొంతమందికి జీర్ణ క్రియలో అసౌకర్యాన్ని కలిగించే అవకాశం ఉంది. 

పండ్లతో కలిపి గింజలను తింటే మంచిది అంటున్నా డైటీషియన్లు. గింజలు పండ్లలోని గ్లైసెమిక్ ఇండెక్స్ ను తగ్గిస్తాయట. పండ్లలోని విటమిన్ సి గింజలలో ఉన్న ఇనుమును శోషించుకోవడంలో సహాయపడుతుందని అంటున్నారు. 

భోజనానికి, భోజనానికి మధ్య డ్రైఫ్రూట్స్, గింజలు తింటే మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఇవి శక్తిని అందించడమే కాకుండా, జీర్ణవ్యవస్థపై లోడ్ పడకుండా నియంత్రిస్తుంది. 

ఎంత పరిమాణంలో తినాలి.. 

రోజులో గరిష్టంగా 30-520 గ్రాముల గింజలు మాత్రమే తినాలి 
రోజుకు రెండు సార్లు 15 గ్రాముల చొప్పున తినాలి. 
ఖర్జూరం, అంజీర్ లేదా నల్ల ఎండు ద్రాక్ష వంటి డ్రైఫ్రూట్ లను 15-నుంచి 30 గ్రాముల వరకు తీసుకోవాలి. 

డ్రైఫ్రూట్స్, గింజలు ఆరోగ్యకరమైనవే కదా అని అతిగా తినడం మంచిది కాదంటున్నారు డైటీషియన్లు. రుచికరమైన గింజల విషయంలో నియంత్రణ చాలా అవసరం అంటున్నారు. మంచింగ్ ప్రారంభించేందుకు ఒకసారి అందులో ఉండే పదార్థాల కంటెంట్ ను చెక్ చేసుకోవాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.