కురవి/డోర్నకల్, వెలుగు : ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆఫీసర్లు ఏం చేస్తున్నారు ? మంచినీరు కూడా ఇవ్వలేరా.. తమాషా చేస్తున్నారా అంటూ డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని ట్రంక్ తండాలో పర్యటించారు. దీంతో మంచినీరు సరిగా రావడం లేదని, పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉందని, ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు ఎమ్మెల్యేను నిలదీశారు.
దీంతో స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత మున్సిపల్ కమిషనర్ మున్వర్ అలీతో పాటు, సంబంధిత ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బందులు పడితే ఆఫీసర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వాంకుడోతు వీరన్న, మార్కెట్ చైర్మన్ విద్యాసాగర్, నున్న రమణ పాల్గొన్నారు.